Netflix అదిరే ఆఫర్.. ఈ Game గెలిస్తే.. లైఫ్ లాంగ్ ఉచితంగా చూడొచ్చు!

  • Published By: sreehari ,Published On : July 17, 2020 / 07:09 PM IST
Netflix అదిరే ఆఫర్.. ఈ Game గెలిస్తే.. లైఫ్ లాంగ్ ఉచితంగా చూడొచ్చు!

ప్రముఖ ఓటీటీ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ తమ యూజర్ల కోసం అదిరే ఆఫర్‌తో ముందుకు వచ్చింది.. నెట్ ఫ్లిక్స్ ఉచితంగా సబ్ స్ర్కిప్షన్ పొందాలంటే తామిచ్చే గేమ్‌లో కచ్చితంగా విన్ అవ్వాలంటోంది. ఈ గేమ్ లో విన్ అయితే 83 ఏళ్ల వరకు ఉచిత సబ్ స్ర్కిప్షన్ పొందే అవకాశం ఉందని అంటంది. ‘immortal’ పేరుతో Netflix అకౌంట్ అందిస్తోంది. ఈ అకౌంట్ ఉచితంగా పొందాలంటే నెట్ ఫ్లిక్స్ గేమ్ ఆడాలని సూచిస్తోంది.

ఇందులో గెలిచిన అదృష్టవంతుడికి 83 ఏళ్లు (1000 నెలల పాటు) ఉచితంగా సబ్ స్ర్కిప్షన్ పొందవచ్చు. ఇంతకీ ఆ గేమ్ ఏంటంటే… New Old Guard Game.. ఈ గేమ్ లో అత్యధిక స్కోరు సాధించినవారికి 13వేల డాలర్లను సేవ్ చేసినట్టే.. ఒకవేళ మీరు సాధారణంగా 1000 నెలల వరకు నెట్ ఫ్లిక్స్ స్టాండర్డ్ ప్లాన్ పొందాలంటే ఇంత మొత్తంలో చెల్లించాల్సి ఉంటుంది.. అదే ఈ నెట్ ఫ్లిక్స్ గేమ్‌లో గెలిస్తే మాత్రం ఉచితంగా 1000 నెలల వరకు సబ్ స్ర్కిప్షన్ సొంతం చేసుకోవచ్చు.
Netflix is offering a free subscription for 83 years if you win this game!Charlize Theron నటించిన నెట్‌ఫ్లిక్స్ మూవీ ‘immortal mercenaries’ని ఓసారి చూడండి. మీరు కొత్త గేమ్ ఆడే ముందు ఈ మూవీ చూడొచ్చు. ఎందుకంటే గేమ్ పోటీలో అసలు ఆట మూవీలో మాదిరిగానే ఉంటుంది. డోంట్ వర్రీ.. యాక్షన్ థ్రిల్లర్ మూవీనే మీకేం బోర్ కొట్టదులే అంటోంది. ఈ మూవీ చూసిన తర్వాత ‘The Old Guard Game’ ఆడొచ్చు. మీరు మీ వెబ్ బ్రౌజర్ ద్వారా గేమ్ ఆడవచ్చు.

ఈ రోజు నుండి ఉదయం 8 గంటల నుంచి PST (11AM ET) నుండి అందుబాటులో ఉంటుంది. మీరు ఈ మూవీలోని లీడ్ రోల్ అయిన చార్లీజ్ థెరాన్ పాత్రలో గేమ్ ఆడతారు. శత్రువుల గ్రూపులపై దాడి చేయడంలో లాబ్రిస్ (ఒక పెద్ద, డబుల్ బ్లేడెడ్ గొడ్డలి)ను వినియోగించవచ్చు. అత్యధిక స్కోరు సాధించాలి. ఒకవేళ ఆట మధ్యలోనే మిమ్మల్ని శత్రువులు చంపేస్తే.. స్కోరు తగ్గిపోతుంది.

మీపై శత్రువుల దెబ్బ పడకుండా వారిని ఓడించవలసి ఉంటుంది. జూలై 17, 18, 19 సంవత్సరాల్లో ఈ పోటీ మూడు రోజులు పాటు జరుగుతుంది. ఆ సమయంలో ఎవరు అత్యధిక స్కోరు సాధిస్తారో వారు ఆటను గెలుస్తారు. అప్పటి నుంచి నెట్ ఫ్లిక్ అకౌంట్లో 83 ఏళ్ల పాటు ఉచితంగా సబ్ స్ర్కిప్షన్ పొందవచ్చు. అంటే.. లైఫ్ లాంగ్ అన్నమాట..