OTT యూజర్లకు గుడ్ న్యూస్: Netflix మొబైల్ ఓన్లీ ప్లాన్

ప్రపంచవ్యాప్తంగా ఓటీటీ ప్లాట్ ఫాంలకు భారీ డిమాండ్ ఉంది. బ్రాడ్ క్యాస్టింగ్ టెలివిజన్ ఛానళ్ల ప్రసారాలను అందించే OTT ప్లాట్ ఫాంపై నెట్ ఫ్లిక్స్ తరహాలో Amazon prime, హాస్ట్ స్టార్ (hotstar) మరెన్నో స్ట్రీమింగ్ కంపెనీలు తమ సర్వీసులను అందిస్తున్నాయి.

  • Published By: sreehari ,Published On : March 22, 2019 / 02:26 PM IST
OTT యూజర్లకు గుడ్ న్యూస్: Netflix మొబైల్ ఓన్లీ ప్లాన్

ప్రపంచవ్యాప్తంగా ఓటీటీ ప్లాట్ ఫాంలకు భారీ డిమాండ్ ఉంది. బ్రాడ్ క్యాస్టింగ్ టెలివిజన్ ఛానళ్ల ప్రసారాలను అందించే OTT ప్లాట్ ఫాంపై నెట్ ఫ్లిక్స్ తరహాలో Amazon prime, హాస్ట్ స్టార్ (hotstar) మరెన్నో స్ట్రీమింగ్ కంపెనీలు తమ సర్వీసులను అందిస్తున్నాయి.

ప్రపంచవ్యాప్తంగా ఓటీటీ ప్లాట్ ఫాంలకు భారీ డిమాండ్ ఉంది. బ్రాడ్ క్యాస్టింగ్ టెలివిజన్ ఛానళ్ల ప్రసారాలను అందించే OTT ప్లాట్ ఫాంపై నెట్ ఫ్లిక్స్ తరహాలో Amazon prime, హాట్ స్టార్ (hotstar) మరెన్నో స్ట్రీమింగ్ కంపెనీలు తమ సర్వీసులను అందిస్తున్నాయి. ఆడియో, వీడియో, మీడియా కంటెంట్ ను ఇంటర్నెట్ ద్వారా నేరుగా యూజర్లకు అందించవచ్చు. ఇందుకు కేబుల్, టెలికమ్యూనికేషన్ సిస్టమ్ తో పనిలేదు. తమకు నచ్చిన ప్లాన్లను ఎంచుకుని టెలివిజన్ ఛానళ్లు, మూవీలు వీక్షించే అవకాశం ఉంది. కేబుల్ సిస్టమ్ తో పోలిస్తే OTT ప్లాట్ ఫాం చాలా ఖరీదైనది. ఎందుకంటే.. ఇందులో హెచ్ డీ క్వాలిటీతో సౌండ్, వీడియోలను వీక్షించవచ్చు. OTT ఫ్లాట్ ఫాంపై అందించే సబ్ స్ర్కిప్షన్ ప్లాన్స్ కాస్ట్ కూడా ఎక్కువే. ఈ సర్వీసును అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు OTT స్ట్రీమింగ్ సర్వీసులు ప్రయత్నాలు మొదలుపెట్టాయి. 
Read Also : బాబోయ్ ఇదేం వైవిధ్యం : కత్తులు, పాములతో బాడీ మసాజ్

ఇండియాలో చీపెస్ట్ ప్లాన్లను అందించి యూజర్లను ఆకట్టుకునేందుకు సరికొత్త ప్లాన్లతో ముందుకు వస్తున్నాయి. అందులో ఒకటి.. Netflix స్ట్రీమింగ్ సర్వీసు. ప్రపంచంలో అతిపెద్ద ఎంటర్ టైన్ మెంట్ ఆన్ లైన్ స్ట్రీమింగ్ OTT ప్లాట్ ఫాం Netflix సరికొత్త సబ్ స్క్రిప్షన్ ప్లాన్ ను ఇండియాలో ప్రవేశపెట్టనుంది. ప్రస్తుతం భారత్ లో నెట్ ఫ్లిక్స్ OTT ప్లేయర్ సబ్ స్క్రిప్షన్ ఎంతో ఖరీదైనప్పటికీ.. యూజర్ల కోసం చీపెస్ట్ ప్లాన్ వెర్షన్ అందుబాటులోకి తీసుకురానుంది. అదే.. మొబైల్ ఓన్లీ ప్లాన్ (mobile-only plan). ఈ కొత్త ప్లాన్ కేవలం మొబైల్ యూజర్లకు మాత్రమే సపోర్ట్ చేయనుంది. ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉంది. ఇండియన్ యూజర్ల కోసం చీపర్ వెర్షన్ ను స్పెషల్ గా నెట్ ఫ్లిక్స్ డిజైన్ చేస్తోంది. మలేసియాలో టెస్టింగ్ పూర్తి అయ్యాక ఇతర దేశాల్లో కూడా ఈ మొబైల్ వెర్షన్ ను టెస్టింగ్ చేయనుంది. నెట్ ఫ్లిక్స్ అందించే సబ్ స్క్రిప్షన్ ప్లాన్ లో ఇదే చీప్ అండ్ బెస్ట్. 

నెలకు రూ.250 మాత్రమే :
మొబైల్ ఓన్లీ ప్లాన్.. ఇండియన్ యూజర్లు నెలకు రూ.250 చెల్లిస్తే చాలు. మీకు నచ్చిన టీవీ ఛానళ్లు, మూవీలను హెచ్ డీ క్వాలిటీతో మొబైల్లో చూడవచ్చు. ప్రస్తుతం.. Netflix స్ట్రీమింగ్ సర్వీసు.. భారతీయ యూజర్లకు నెలకు రూ.500 వరకు ఛార్జ్ చేస్తోంది. మొబైల్ ఓన్లీ ప్లాన్ తో 50 శాతం తక్కువగా ఖరీదుతో సబ్ స్క్రిప్షన్ చేసుకోవచ్చు. 250లకే యూజర్లు తమ మొబైల్లో ఈ ప్లాన్ యాక్టివేట్ చేసుకోవచ్చు.

నెట్ ఫ్లిక్స్ అందించే సబ్ స్ర్కిప్షన్ ప్లాన్స్ ప్రారంభ ధర రూ.500, రూ.800 వరకు ఆఫర్ చేస్తోంది. ఇండియాలో ఈ నెట్ ఫ్లిక్స్ సర్వీసు ఇతర పోటీదారుల కంటే ఖరీదైనది. వచ్చే ఏడాది కాలంలో.. ఇండియన్ మార్కెట్ లో కొత్తగా కోటి మందికి స్ట్రీమింగ్ సర్వీసును అందించేందుకు ప్లాన్ చేస్తున్నట్టు కంపెనీ సీఈఓ రీడ్ హాస్టింగ్స్ తెలిపారు. అయితే.. ఇండియాలో ఎంతమంది నెట్ ఫ్లిక్స్ సబ్ స్క్రైబర్లు ఉన్నారనేది మాత్రం వెల్లడించలేదు. ఇండియన్ స్ట్రీమింగ్ మార్కెట్ లో మొత్తం 6 శాతం వరకు ఉంటారని అంచనా. నవంబర్ 2018లో ఓ నివేదిక వెల్లడించిన డేటా ప్రకారం.. హాట్ స్టార్, జియో టీవీ, జీ5, జియో సినిమా, సోనీలైవ్ సర్వీసులతో పాటు నెట్ ఫ్లిక్స్ దేశవ్యాప్తంగా ఉన్న యూజర్లతో కలిపి 8వ ర్యాంకులో ఉంది. 

ఇండియాలో Netflix ఖరీదైనదే :
హాట్ స్టార్ (Hotstar) స్ట్రీమింగ్ OTT సర్వీసుకు కూడా ఇండియాలో భారీ డిమాండ్ ఉంది. భారత్ లో నెంబర్ వన్ ఎంటర్ టైన్ మెంట్ యాప్ గా హాట్ స్టార్ (డిస్నీ కంపెనీ) సర్వీసు అందిస్తోంది. ఈ ప్రీమియం సర్వీసును రూ.365 తో ఏడాదిపాటు పొందొచ్చు. రోజుకు రూ.1 వరకు ఛార్జ్ చేస్తుంది. నెట్ ప్లిక్స్ మాత్రం నెలకు రూ.250తో చీపెస్ట్ ప్లాన్ తీసుకొస్తోంది. అంటే.. యూజర్.. ఏడాదికి రూ.3వేలు.. రోజుకు రూ.8.3 చెల్లించాలి. ఇది హాట్ స్టార్ ప్రీమియం ప్లాన్ కంటే 8రెట్లు ఎక్కువ. అమెజాన్ ప్రైమ్ కు పోటీగా నెట్ ఫ్లిక్స్ ఏడాదికి రూ.1000 ప్లాన్ అందిస్తోంది. రోజుకు రూ.2.7 చెల్లించాలి. అమెజాన్ ప్రైమ్ కంటే నెట్ ప్లిక్స్ 4రెట్లు ఎక్కువ. 

* ఇండియాలో అప్ కమింగ్ OTT సర్వీసు జీ5 కూడా నెలకు రూ.99కే అందిస్తోంది. ఏడాది ప్లాన్ రూ.1188 అందుబాటులో ఉంది. రోజుకు యూజర్లు రూ.3.3 చెల్లిస్తున్నారు. 

* బాలాజీ టెలిఫిల్మీస్ అందిస్తోన్న Altbalaji OTT స్ట్రీమింగ్ సర్వీసు ప్రీమియంపై 3 నెలలు వరకు యాక్సస్ చేసుకోవచ్చు. రూ.100 చెల్లిస్తే సరిపోతుంది. అంటే.. రోజుకు రూ.1.09 చార్జ్ చేస్తోంది. 

* ఇండియాలో ఓటీటీ స్ట్రీమింగ్ సర్వీసు అందించే ప్లాట్ ఫాంల్లో Hotstar, AltBalaji చీపెస్ట్ ప్లాన్స్ అందుబాటులో ఉన్నాయి. నెట్ ఫ్లిక్స్ మోస్ట్ ఎక్స్ పెన్సీవ్ OTT చెప్పుకోవచ్చు. 

Netflix కొత్తగా తీసుకొస్తున్న mobile-only plan ద్వారా ఇండియా మార్కెట్ లో భారీ ఎత్తున ఖాతాదారులను రాబట్టుకోవాలనే వ్యూహం ఎంత వరకు సక్సెస్ అవుతుందో చూడాలి..
Read Also : బీ అలర్ట్ : గూగుల్ ప్లస్, ఇన్‌బాక్స్‌ బై జీమెయిల్ మూసివేత