Nokia 110 4G : నోకియా నుంచి కొత్త 4G ఫీచర్ ఫోన్.. ఫీచర్లు కిరాక్.. ధర ఎంతంటే?

ప్రముఖ HMD గ్లోబల్ సంస్థ నోకియా నుంచి లేటెస్ట్ ఫీచర్ ఫోన్ (4G) భారత మార్కెట్లోకి వచ్చింది. అదే.. Nokia 110 4G ఫోన్.. గత జూన్ నెలలోనే ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లోకి ఈ ఫోన్ రిలీజ్ అయింది.

Nokia 110 4G : నోకియా నుంచి కొత్త 4G ఫీచర్ ఫోన్.. ఫీచర్లు కిరాక్.. ధర ఎంతంటే?

Nokia 110 4g Feature Phone With Hd Calling Launched In India

Nokia 110 4G Feature Phone : ప్రముఖ HMD గ్లోబల్ సంస్థ నోకియా నుంచి లేటెస్ట్ ఫీచర్ ఫోన్ (4G) భారత మార్కెట్లోకి వచ్చింది. అదే.. Nokia 110 4G ఫోన్.. గత జూన్ నెలలోనే ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లోకి ఈ ఫోన్ రిలీజ్ అయింది. స్టయిలీష్ డిజైన్, అట్రాక్టివ్ లుక్, చేతిలో మంచి గ్రిప్ ఉండేలా ఆల్ రౌండెడ్ ఫినిష్ తో వచ్చింది. ఈ కొత్త నోకియా ఫోన్‌లో 4G కనెక్టవిటీని ఆఫర్ చేస్తోంది. HD Voice Calling, వైర్డ్, వైర్‌లెస్ FM Radio వంటి ఆకర్షణీయమైన ఫీచర్లు ఉన్నాయి. ఒకసారి ఫుల్ చార్జింగ్ చేస్తే 13 రోజుల వరకు వస్తుంది. Nokia 110 4G ఫీచర్ ఫోన్ లో 3.5mm ఆడియో జాక్, 3-ఇన్-1 స్పీకర్లు, వీడియో, MP3 ప్లేయర్‌తో పాటు, స్టోరేజీని 32GB వరకు ఎక్స్ ప్యాండ్ చేసుకోవచ్చు.

ధర ఎంతంటే? :
ఈ కొత్త నోకియా 110 4G ఫీచర్ ఫోన్ భారత మార్కెట్లో రూ.2,799గా నిర్ణయించారు. ఈ ఫోన్ ఎల్లో, అక్వా, బ్లాక్ కలర్ ఆప్షన్లలో వస్తోంది. జూలై 24 నుంచి ఈ ఫోన్ సేల్ ప్రారంభం కానుంది. Nokia.com, Amazon.in వెబ్ సైట్లలో నోకియా 110 4G ఫోన్ సేల్ అందుబాటులో ఉండనుంది.

స్పెషిఫికేషన్లు ఇవే :
Nokia 110 4G స్పెషిఫికేషన్ల విషయానికి వస్తే.. 4G కనెక్టవిటీ సపోర్ట్ చేస్తుంది. HD Voice Calling సపోర్ట్ కూడా ఉంది. 1.8 అంగుళాల QVGA (120×160 pixels) కలర్ డిస్ ప్లే, UniSoc T110 SoC పవర్ అందిస్తోంది. స్టోరేజీలో 128MP RAM, 48MB ఇంటర్నల్ స్టోరేజీతో మైక్రో SD కార్డ్ స్లాట్ (32GB వరకు) సపోర్ట్ చేస్తుంది. అదనంగా 0.8 MP QVGA రియర్ కెమెరా కూడా ప్రత్యేక ఆకర్షణగా ఉంది. ఈ నోకియా ఫోన్ Series 30+ ఆపరేటింగ్ సిస్టమ్ పై రన్ అవుతుంది. 1,020mAh రిమూవబల్ బ్యాటరీ.. ఒకసారి ఛార్జ్ చేస్తే 13 రోజులు వరకు వస్తుంది. అలాగే 16 గంటల పాటు మ్యూజిక్ ప్లే చేసుకోవచ్చు. 5 గంటల 4G టాక్ టైమ్ అందిస్తోంది.

FM Radio కనెక్టవిటీ వైర్, వైర్ లెస్ ద్వారా యాక్సస్ చేసుకోవచ్చు. ఇందులో వీడియో ప్లేయర్, MP3 ప్లేయర్, 3-in-1 స్పీకర్లు ఇంటిగ్రేడ్ అయి ఉన్నాయి. అదేవిధంగా క్లాసిక్ గేమ్స్, ఐకానిక్ స్నేక్ గేమ్ స్పెషల్ ఎట్రాక్షన్.. ఈ ఫోన్ లో యాప్స్ కూడా ఉన్నాయి. ఆక్స్ ఫర్డ్ ఇంగ్లీష్ కూడా ఉంది. రిఫ్రెషడ్ UI ఆప్షన్ కూడా ఉంది. మెనూలు జూమ్ చేసుకోవడం ద్వారా ఈజీగా నావిగేట్ చేసుకోవచ్చు. బుల్ట్ ఇన్ టార్చ్ కూడా సపోర్ట్ చేస్తుంది. Micro USB పోర్ట్ సపోర్ట్ కూడా ఉంది. డ్యుయల్ సిమ్ (Nano) స్లాట్స్ ఉన్నాయి. ఈ ఫోన్ పరిమాణం 121x50x14.5mm ఉండగా.. 84.5 గ్రామలు బరువు ఉంటుంది.