Ola Own Maps India : భారత్‌లో గూగుల్ మ్యాప్స్‌కు పోటీగా ఓలా సొంత మ్యాప్స్.. Ola యాప్‌లో కొత్త నావిగేషన్ సర్వీసులు ఎప్పటినుంచంటే?
Ola Own Maps India : ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ సర్వీసుల్లో ఒకటైన గూగుల్ మ్యాప్స్ (Google Maps) చాలా కాలంగా భారత్ వెబ్ మ్యాపింగ్ ప్లాట్‌ఫారమ్‌గా అందుబాటులో ఉంది. ప్రత్యేకించి ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లకు గూగుల్ మ్యాప్స్ అనేది ఒక ప్రధాన అవసరంగా మారింది.

Ola set to challenge Google Maps with its own maps of India, first available in Ola vehicles
Ola Own Maps India : ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ సర్వీసుల్లో ఒకటైన గూగుల్ మ్యాప్స్ (Google Maps) చాలా కాలంగా భారత్ వెబ్ మ్యాపింగ్ ప్లాట్‌ఫారమ్‌గా అందుబాటులో ఉంది. ప్రత్యేకించి ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లకు గూగుల్ మ్యాప్స్ అనేది ఒక ప్రధాన అవసరంగా మారింది. ఎందుకంటే.. గూగుల్ మ్యాప్స్ సర్వీసుకు పోటీగా ఏ ఇతర యాప్ నిలబడలేదని చెప్పవచ్చు. అయినప్పటికీ, Google Maps తరహాలో డిజిటల్ మ్యాప్‌లు, నావిగేషన్ ఫీచర్‌లను అందించే Ola మ్యాప్స్ (Ola Maps) ఇంటర్నల్ నావిగేషన్ సిస్టమ్ అందించనుంది. ఈ మేరకు Ola సొంత నావిగేషన్ మ్యాప్ సిస్టమ్ ద్వారా భవిష్యత్తులో అనేక మార్పులు తీసుకురానుంది.
రైడ్‌షేరింగ్, ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీ వ్యాపారంలో అగ్రగామి అయిన Ola కంపెనీ.. సొంత డిజిటల్ మ్యాప్, నావిగేషన్ సిస్టమ్‌పై పని చేస్తోంది. ప్రస్తుతం, కంపెనీ MapMyIndia అందించే డేటా ఆధారంగా నావిగేషన్‌ను అందిస్తోంది. త్వరలో పూర్తి స్థాయిలో ఒలా సర్వీసులను సొంత నావిగేషన్ సిస్టమ్‌ను ఉపయోగిస్తుంది.

Ola set to challenge Google Maps with its own maps of India
ఓలా మ్యాప్స్ కంపెనీ CEO భవిష్ అగర్వాల్ ఫీచర్ టెస్టింగ్ చేసినట్టు వెల్లడించారు. ఈ మేరకు నావిగేషన్ యాప్ స్క్రీన్‌వ్యూను పోస్ట్ చేసారు. సొంత ఓలా మ్యాప్‌లను టెస్టింగ్ చేస్తున్నామని తెలిపారు. ఓలా యాప్, తమ వాహనాల్లో కొన్ని నెలల్లో సొంత ఓలా మ్యాప్స్ ప్రారంభించనుంది. భారత్ కోసం ప్రపంచ స్థాయి మ్యాప్‌లను వారి యాప్‌లలో ఉపయోగించాలనుకునే వారందరికీ dev APIని కూడా తయారు చేస్తామని ఆయన ట్వీట్ చేశారు. విశేషమేమిటంటే.. Ola Maps సర్వీసులో ప్రస్తుతం Ola Electric వెబ్‌సైట్‌లో లైవ్ టెలిక్యాస్ట్ కానుంది.
అయితే త్వరలో కంపెనీ ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లు (Ola electric scooters), ఓలా క్యాబ్ (Ola Cabs)లతో సహా ఇతర ఓలా ప్రొడక్టుల్లో నావిగేషన్ సర్వీసులను అందుబాటులోకి తీసుకురానుంది. అదనంగా, అగత్వాల్ ట్వీట్‌లో కంపెనీ ‘Dev API’ (డెవలపర్స్ అప్లికేషన్ ప్రోగ్రామ్ ఇంటర్‌ఫేస్)ను డెవలప్ చేయడంపై కూడా కృషి చేస్తోందని వెల్లడించాడు. వినియోగదారులను ఔటర్ థర్డ్-పార్టీ డెవలపర్‌లతో ఓలా మ్యాప్‌లను ఓపెన్ చేసేందుకు అనుమతిస్తుంది.

Ola set to challenge Google Maps with its own maps of India
ముఖ్యంగా, Ola నెక్స్ట్ జనరేషన్ లొకేషన్ టెక్నాలజీతో పాటు నావిగేషన్ సిస్టమ్‌ను రూపొందించడానికి 2021లో జియోస్పోక్ – జియో-అనలిటిక్స్ సొల్యూషన్స్ ప్రొవైడర్‌ని కొనుగోలు చేసింది. కంపెనీ లొకేషన్-బేస్డ్ సొల్యూషన్స్, సర్వీస్‌లు, ప్రొడక్ట్‌లను ఆఫర్ చేస్తుందని తెలిపింది. కొనుగోలులో భాగంగా.. జియోస్పోక్ CEO ధృవ రాజన్, జియోస్పేషియల్ సైంటిస్టులు, ఇంజనీర్ల బృందం లొకేషన్ టెక్నాలజీలను డెవలప్ చేయడానికి ఓలాలో చేరారు.
ఓలా మ్యాప్స్‌తో, కంపెనీ తన EV వాహనాల ఫీచర్లను కూడా పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. Ola EV వాహనాలపై విశ్వసనీయతను పెంచనుంది. కస్టమర్ సర్వీసులను కూడా పెంచుతుంది. భవిష్యత్తులో ఓలా EV వాహనాలకు ఎలోన్ మస్క్ టెస్లా అందించే విధంగానే నావిగేషన్, GPS ఫీచర్లను అందించనుంది. టెస్లా కార్లకు ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్‌లో గ్రీన్ సిగ్నల్ రాగా.. భారత మార్కెట్లో మాత్రం ఇప్పటికీ ఎలాంటి అనుమతి లభించలేదు. కానీ, భారత్‌లోని EV మార్కెట్‌లో ఓలా పైచేయి సాధించే దిశగా అడుగులు వేస్తోంది.
WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..