OnePlus 10R Prime : వన్‌ప్లస్ కొత్త బ్లూ ఎడిషన్ స్మార్ట్‌‌ఫోన్ వస్తోంది.. ఈ ఫోన్ ఫస్ట్ కొన్నవారికి అమెజాన్ ప్రైమ్ మూడు నెలలు ఫ్రీ..!

OnePlus 10R Prime : ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం వన్‌ప్లస్ (OnePlus) భారత మార్కెట్లో OnePlus 10R కొత్త బ్లూ ఎడిషన్‌ (OnePlus 10R New Blue Edition)ను రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించింది.

OnePlus 10R Prime : వన్‌ప్లస్ కొత్త బ్లూ ఎడిషన్ స్మార్ట్‌‌ఫోన్ వస్తోంది.. ఈ ఫోన్ ఫస్ట్ కొన్నవారికి అమెజాన్ ప్రైమ్ మూడు నెలలు ఫ్రీ..!

OnePlus 10R Prime Blue colour announced, early buyers will get free 3-month Amazon Prime subscription

OnePlus 10R Prime : ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం వన్‌ప్లస్ (OnePlus) భారత మార్కెట్లో OnePlus 10R కొత్త బ్లూ ఎడిషన్‌ (OnePlus 10R New Blue Edition)ను రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించింది. OnePlus 10R ప్రైమ్ బ్లూ ఎడిషన్‌గా పిలిచే ఈ ఫోన్ అమెజాన్‌లో ప్రత్యేకంగా అందుబాటులో ఉంటుంది. ఈ డివైజ్ రెండు కంపెనీల భాగస్వామ్యంతో ప్రవేశపెట్టినట్టు కంపెనీ పేర్కొంది.

సరికొత్త OnePlus 10R ప్రైమ్ బ్లూని ముందుగా కొనుగోలు చేసే అమెజాన్ యూజర్లు (Amazon Users) 3-నెలల అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్‌ (Amazon Prime Subscription)ను ఉచితంగా పొందవచ్చు. ఈ వేరియంట్ లాంచ్ తేదీపై క్లారిటీ లేదు. కానీ, సెప్టెంబర్ 23న ప్రారంభమయ్యే అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌ (Amazon Great Indian Festival Sale)లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

OnePlus 10R Prime Blue colour announced, early buyers will get free 3-month Amazon Prime subscription

OnePlus 10R Prime Blue colour announced, early buyers will get free 3-month Amazon Prime subscription

OnePlus Prime బ్లూ కలర్ ఆప్షన్ 5,000mAh బ్యాటరీతో 80W ఫాస్ట్ ఛార్జింగ్‌తో OnePlus 10R వేరియంట్‌కు మాత్రమే అందుబాటులో ఉంటుంది. 4,500mAh బ్యాటరీ, 150W ఛార్జింగ్‌తో ఎడిషన్ సింగిల్ బ్లాక్ కలర్ వేరియంట్‌లో అందుబాటులోకి రానుంది. వినియోగదారులను ఆకర్షించేందుకు ఈ ఫోన్‌పై అమెజాన్ సేల్ ఆఫర్‌లను అందించే అవకాశం ఉంది. Blue Edition ఇండియా ధరను కంపెనీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ప్రస్తుతం బేస్ 8GB, 128GB స్టోరేజ్ ఆప్షన్‌ ధర రూ. 34,999, 12GB RAM, 256GB స్టోరేజ్ మోడల్ ధర రూ.38,999గా ఉండనుంది.

OnePlus 10R Prime Blue colour announced, early buyers will get free 3-month Amazon Prime subscription

OnePlus 10R Prime Blue colour announced, early buyers will get free 3-month Amazon Prime subscription

కలర్ ఆప్షన్లతో కాకుండా OnePlus 10R (80W ఫాస్ట్ ఛార్జింగ్‌) స్పెసిఫికేషన్‌లతో రానుంది. 5nm-ఆధారిత MediaTek డైమెన్సిటీ 8100-MAX SoC ద్వారా రన్ అవుతుంది. ఈ ఫోన్ కోసం ప్రత్యేకంగా కస్టమ్-ట్యూన్ చేసింది. ఫోన్ Full HD+ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్ స్క్రీన్‌తో 6.7-అంగుళాల AMOLED డిస్‌ప్లేతో వస్తుంది. డివైజ్ వెనుకవైపు OnePlus 10R ట్రిపుల్-కెమెరా సెటప్‌తో రానుంది.

వెనుక కెమెరా సిస్టమ్‌లో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)తో కూడిన 50-MP సోనీ IMX766 ప్రైమరీ కెమెరా సెన్సార్ ఉంది. ప్రైమరీ కెమెరా 8-MP అల్ట్రావైడ్ కెమెరా, 2-MP మాక్రో కెమెరాతో రానుంది. సెల్ఫీల కోసం.. ఈ ఫోన్‌లో 16-MP ఫ్రంట్ కెమెరా ఉంది. ఇతర ఫీచర్లలో ఆండ్రాయిడ్ 12, NFC, 5G, ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉన్నాయి. 80W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 32 నిమిషాల్లో Full ఛార్జింగ్ అవుతుందని OnePlus పేర్కొంది.

Read Also : OnePlus 11 Series : పవర్‌ఫుల్ ప్రాసెసర్‌తో రెండు కొత్త వన్‌ప్లస్ 11 సిరీస్ ఫోన్లు.. ఫీచర్లు ఇవేనా? లాంచ్ ఎప్పుడో తెలుసా?