OnePlus 9RT: స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో వన్‌ప్లస్‌ 9RT మోడల్.. అద్భుతమైన కెమెరాతో!!

ప్రముఖ చైనా మొబైల్ తయారీ సంస్థ వన్‌ప్లస్‌ త్వరలో OnePlus 9RT స్మార్ట్‌ఫోన్‌ను త్వరలో మార్కెట్లోకి తీసుకుని రానుంది.

OnePlus 9RT: స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో వన్‌ప్లస్‌ 9RT మోడల్.. అద్భుతమైన కెమెరాతో!!

One Plus

OnePlus 9RT: ప్రముఖ చైనా మొబైల్ తయారీ సంస్థ వన్‌ప్లస్‌ త్వరలో OnePlus 9RT స్మార్ట్‌ఫోన్‌ను త్వరలో మార్కెట్లోకి తీసుకుని రానుంది. కంపెనీ 9R మోడల్ అప్‌గ్రేడ్ వెర్షన్‌ అయిన OnePlus 9RT ఈ నెలలోనే చైనా, భారతదేశంలో లాంచ్ చేయవచ్చు. ఫోన్ ధర 23వేల 250 నుంచి 34 వేల 800 రూపాయల మధ్య ఉంటుందని భావిస్తున్నారు.

ఈ స్మార్ట్‌ఫోన్ అక్టోబర్ 13 న చైనాలో లాంచ్ కానుండగా.. ఈ ఫోన్‌‌లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 888SoC ప్రాసెసర్‌ ఉంటుంది. ప్రీమియం OnePlus 9, 9 ప్రోలో కూడా ఇదే ప్రాసెసర్ ఉంది. ఇందులో 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. OnePlus 9RT స్మార్ట్‌ఫోన్‌లో 6.55-అంగుళాల ఫుల్ HD డిస్‌ప్లే ఇవ్వవచ్చు, దీనిలో 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. ఫోన్ ఆండ్రాయిడ్ 11లో రన్ అవ్వవచ్చు. అదే సమయంలో కంపెనీ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్‌ని ఉపయోగించే అవకాశం ఉంది. 6GB RAM, 128GB ఇంటర్నల్ స్టోరేజ్‌లో ఈ ఫోన్ లభించవచ్చు.

ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్ ప్రైమరీ కెమెరా 50 మెగాపిక్సెల్స్ ఉంటుంది. OnePlus 9RT స్మార్ట్‌ఫోన్, ఫోటోగ్రాఫ్‌లు తీసుకోవడానికి చాలా బాగా ఉంటుంది. 16-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా, 2-మెగాపిక్సెల్ B&W సెన్సార్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ఇందులో ఇవ్వవచ్చు. అదే సమయంలో, సెల్ఫీ కోసం 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఇందులో ఉండవచ్చు.

బ్యాటరీ:
పవర్ కోసం OnePlus 9RT స్మార్ట్‌ఫోన్‌లో 4500mAh బ్యాటరీ ఉంది. ఇది 65W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. కనెక్టివిటీ కోసం Wi-Fi, బ్లూటూత్, GPS, USB పోర్ట్ వంటి ఫీచర్‌లను ఫోన్‌లో ఇవ్వవచ్చు.