Puncture Guard Tyre : ఈ టైర్లకు పంక్చర్‌ అయితే.. సొంతంగా రిపేర్ చేసుకుంటాయి.. గాలి బయటకు పోదు..!

Puncture Guard Tyre : సాధారణంగా వాహనాల చక్రాలకు అమర్చే టైర్లలో గాలి ఉంటుంది. గాలి తగ్గినప్పుడల్లా టైర్లకు గాలి కొట్టించాల్సి ఉంటుంది. అదే టైర్లకు పంక్చర్ అయితే కష్టమే మరి...

Puncture Guard Tyre : ఈ టైర్లకు పంక్చర్‌ అయితే.. సొంతంగా రిపేర్ చేసుకుంటాయి.. గాలి బయటకు పోదు..!

Puncture Guard Tyre Jk Tyre Launches ‘puncture Guard Tyre’ Resists Upto 6mm Wide Punctures

Puncture Guard Tyre : సాధారణంగా వాహనాల చక్రాలకు అమర్చే టైర్లలో గాలి ఉంటుంది. గాలి తగ్గినప్పుడల్లా టైర్లకు గాలి కొట్టించాల్సి ఉంటుంది. అలాగే అదే టైర్లకు పంక్చర్ అయితే తప్పనిసరిగా వేయించాల్సిందే.. లేదంటే.. టైర్లలో గాలి ఉండదు.. మొత్తం బయటకు పోతుంది. కానీ, ఈ కొత్త రకం టెక్నాలజీతో వచ్చిన టైర్లు మాత్రం అలా కాదు.. టైర్లలో కొట్టిన గాలి ఎప్పటికీ పోదు.. అలానే ఉంటుంది. ఎన్ని పంక్చర్లు అయినా గాలి బయటకు పోనే పోదు.. 6 మిల్లీమీటర్ల వ్యాసంతో మేకులు టైర్ల లోపలికి దిగినా కూడా ఏమాత్రం గాలి బయటకు పోదు.. ఎందుకంటే.. ఈ టైర్లలో ప్రత్యేకమైన టెక్నాలజీ ద్వారా అది సాధ్యమే అంటోంది జేకే టైర్ (JK Tyre) కంపెనీ.. ఈ కంపెనీ దేశంలోనే మొట్టమొదటిగా (Puncture Guard Tyre) టైర్ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చింది.

భారతీయ వాహన కొనుగోలుదారుల కోసం ఈ ప్రత్యేకమైన టైర్లను రూపొందించినట్టు కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది. పంక్చర్ గార్డ్ టైర్ టెక్నాలజీతో తయారైన ఈ టైర్ల ఉత్పత్తిని ప్రారంభించింది. దేశంలో విక్రయించే ఆధునిక కార్ల కోసం కొత్త పంక్చర్ గార్డ్ టైర్‌లను అందుబాటులోకి తీసుకొచ్చినట్టు కంపెనీ వెల్లడించింది. ఈ టైర్లకు పంక్చర్ అయినప్పుడు అందులోని సెల్ఫ్-హీలింగ్ ఎలాస్టోమర్ ఇన్నర్ కోట్‌ సాయంతో గాలి బయటకు పోకుండా అడ్డుకుంటుంది.

Puncture Guard Tyre Jk Tyre Launches ‘puncture Guard Tyre’ Resists Upto 6mm Wide Punctures (1)

Puncture Guard Tyre Jk Tyre Launches ‘puncture Guard Tyre’ Resists Upto 6mm Wide Punctures 

ఈ కోట్ టైర్ లోపలిభాగంలో అమర్చబడి ఉంటుంది. వాటంతట అవే పంక్చర్లను అవే రిపేర్ చేసుకోగలవు. ఈ కొత్త పంక్చర్ గార్డ్ టైర్ ప్రత్యేకంగా రూపొందించిన కోటు టైర్‌లో ఏదైనా పంక్చర్‌ అయినప్పుడు సొంతంగా రిపేర్ చేసుకోగలవు. 6 మిల్లీమీటర్ల వ్యాసం కలిగిన పంక్చర్లను రిపేర్ చేసుకోగలవు. పంక్చర్ గార్డ్ టైర్ టెక్నాలజీ ద్వారా గాలి బయటకు పోకుండా అడ్డుకుంటుందని కంపెనీ చెబుతోంది.

ఈ సందర్భంగా JK టైర్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రఘుపతి సింఘానియా మాట్లాడుతూ.. 2020లో స్మార్ట్ టైర్ టెక్నాలజీని అభివృద్ధి చేశామన్నారు. ఇప్పుడు తమ కస్టమర్ల కోసం పంక్చర్ గార్డ్ టైర్ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చినట్టు తెలిపారు. పంక్చర్ గార్డ్ టైర్ టెక్నాలజీ ఆటో ఎక్స్‌పో 2020లోనే ఆవిష్కరించారు. ఇటీవలే దేశంలోనే మొట్టమొదటి ‘స్మార్ట్ టైర్’ని జేకే టైర్ కంపెనీ ప్రారంభించింది. ప్రస్తుతం JK టైర్ ప్రపంచవ్యాప్తంగా 12 ఉత్పత్తి యూనిట్లను కలిగి ఉంది. వీటిలో 9 భారతదేశంలోనే ఉన్నాయి. బ్రాండ్ మెక్సికోలో 3 ఉత్పత్తి యూనిట్లను స్థాపించింది. ప్రతి ఏడాదిలో సుమారు 35 మిలియన్ టైర్లను జేకే టైర్ కంపెనీ ఉత్పత్తి చేస్తోంది.

Read Also : Cheapest Electric Car : ప్రపంచంలోనే అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ కారు.. త్వరలో విడుదల