Realme Narzo 50A : ఈరోజే లాంచ్.. రియల్‌మి Narzo కొత్త సిరీస్ ఫోన్ వస్తోంది..!

రియల్ మి బ్రాండ్ నుంచి సరికొత్త స్మార్ట్ ఫోన్ Narzo 50A మార్కెట్లోకి వస్తోంది. ఏప్రిల్ 25న Realme Narzo 50A Prime భారత మార్కెట్లో లాంచ్ కానుంది.

Realme Narzo 50A : ఈరోజే లాంచ్.. రియల్‌మి Narzo కొత్త సిరీస్ ఫోన్ వస్తోంది..!

Realme Narzo 50a Prime India Launch Today Expected Price, Specifications

Realme Narzo 50A Prime : ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం రియల్ మి బ్రాండ్ నుంచి సరికొత్త స్మార్ట్ ఫోన్ Narzo 50A మార్కెట్లోకి వస్తోంది. ఏప్రిల్ 25న Realme Narzo 50A Prime భారత మార్కెట్లో లాంచ్ కానుంది. నార్జో సిరీస్‌ మోడల్ స్మార్ట్‌ఫోన్ గతంలో ఇండోనేషియాలో అందుబాటులోకి వచ్చింది. 180Hz టచ్ శాంప్లింగ్ రేట్‌తో 6.6-అంగుళాల Full-HD+ డిస్‌ప్లేతో వచ్చింది. హ్యాండ్‌సెట్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. హుడ్ కింద Unisoc T612 SoC ప్రాసెసర్ ద్వారా పనిచేస్తుంది. Realme ప్రకారం.. 18W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టుతో 5,000mAh బ్యాటరీని అందిస్తోంది. భారత మార్కెట్లో Realme Narzo 50A Prime స్మార్ట్ ఫోన్ మధ్యాహ్నం 12:30 గంటలకు లాంచ్ కానుంది. ఈ ఫోన్ లాంచ్‌కు ముందు.. కంపెనీ ప్రత్యేక మైక్రోసైట్‌లో హ్యాండ్‌సెట్ వివరాలను షేర్ చేసింది కంపెనీ.

Realme Narzo 50A ప్రైమ్ ధర (అంచనా) :
భారత మార్కెట్లో Realme Narzo 50A ప్రైమ్ ధర ఇండోనేషియాలో కంపెనీ ధరలకు అనుగుణంగా ఉంటుందని అంచనా.. గత నెలలో స్మార్ట్‌ఫోన్ IDR 1,999,000 (దాదాపు రూ. 10,600) బేస్ సమానంగా ఉండొచ్చు. 4GB RAM + 64GB స్టోరేజ్ వేరియంట్ ధర IDR 2,199,00 ఉండగా, 4GB +128GB కాన్ఫిగరేషన్ స్మార్ట్ ఫోన్ ధర (రూ. 11,700)గా ఉండనుంది.

Realme Narzo 50a Prime India Launch Today Expected Price, Specifications (1)

Realme Narzo 50a Prime India Launch Today Expected Price, Specifications 

ఫీచర్లు ఇవే :
రాబోయే Realme Narzo 50A ప్రైమ్ మార్చిలో ఇండోనేషియాలో లాంచ్ అయింది. ఈ మోడల్ మాదిరిగానే భారత మార్కెట్లో Realme Narzo 50A స్పెసిఫికేషన్‌లతో రానుంది. 6.6-అంగుళాల Full-HD+ (1,080×2,408 పిక్సెల్‌లు) డిస్‌ప్లేతో రానుంది. 4GB RAMతో Unisoc T612 SoC ద్వారా పనిచేయనుంది. కెమెరా ఫ్రంట్ సైడ్ చూస్తే.. 50-MP ప్రైమరీ కెమెరా, మోనోక్రోమ్ పోర్ట్రెయిట్ సెన్సార్, మాక్రో కెమెరాతో పాటు 8-MP ఫ్రంట్ ఫేసింగ్ సెల్ఫీ కెమెరాతో ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుందని అంచనా. Realme Narzo 50A Prime ఇండోనేషియా మోడల్ 128GB వరకు ఇంటర్నల్ స్టోరేజీ ఆప్షన్లతో వస్తోంది.

దీనిని మైక్రో SD కార్డ్ స్లాట్ ద్వారా (1TB వరకు) ఎక్స్ ప్యాండ్ చేసుకోవచ్చు. కనెక్టివిటీ ఆప్షన్ల విషయానికి వస్తే.. 4G LTE, Wi-Fi, బ్లూటూత్, GPS/ A-GPS USB టైప్-C పోర్ట్ ఉన్నాయి. ఈ ఫోన్ సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో రానుంది. కంపెనీ మైక్రోసైట్ ప్రకారం.. ఈ హ్యాండ్‌సెట్ 18W ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీ సామర్థ్యంతో వస్తోంది.

Read Also : Nokia G21 : ఏప్రిల్ 26న నోకియా కొత్త బడ్జెట్ ఫోన్.. ఫీచర్లు అదుర్స్.. ధర ఎంత ఉండొచ్చంటే?