Redmi Note 11 Pro : రెడ్‌మీ నుంచి 5G స్మార్ట్‌ ఫోన్‌.. 108MP కెమెరాతో ఆకర్షణీయమైన ఫీచర్లు.. ధర ఎంతంటే?

Redmi Note 11 Pro smartphones : ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం రెడ్‌మి నుంచి కొత్త 5G స్మార్ట్ ఫోన్ వచ్చింది. 108మెగా ఫిక్సల్ కెమెరాలతో ఆకర్షణీయమైన ఫీచర్లతో వచ్చింది.

Redmi Note 11 Pro : రెడ్‌మీ నుంచి 5G స్మార్ట్‌ ఫోన్‌.. 108MP కెమెరాతో ఆకర్షణీయమైన ఫీచర్లు.. ధర ఎంతంటే?

Redmi Note 11 Pro 5g, Redmi Note 11 Pro+ 5g Smartphones With 108mp Main Camera Launched

Redmi Note 11 Pro : ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం రెడ్‌మి నుంచి కొత్త 5G స్మార్ట్ ఫోన్ వచ్చింది. 108మెగా ఫిక్సల్ కెమెరాలతో ఆకర్షణీయమైన ఫీచర్లతో వచ్చింది. మార్చి 11న ఈ స్మార్ట్ ఫోన్ రెండు వేరియంట్లలో మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చింది. అవే.. Redmi Note 11 Pro 5G, Redmi Note 11 Pro+ 5G స్మార్ట్ ఫోన్లు. తక్కువ బడ్జెట్‌లో అత్యాధునిక ఫీచర్లతో Redmi Note 11 Pro సిరీస్‌ పేరుతో లాంచ్ అయింది. ఈ రెండు స్మార్ట్ ఫోన్ల ఫీచర్లలో 6.67FHD+ AMOLED Display అందించారు. ఈ డిస్‌ప్లేను 1200 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌, DCI-P3 కలర్‌ గముట్‌, 120 హెడ్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌ను కలిగి ఉంది. ఈ రెండు వేరియంట్ల ఫోన్ స్ర్కీన్ డిస్‌ప్లేకు ప్రొటెక్షన్‌‌గా కార్నింగ్‌ గొరిల్లా గ్లాస్‌ 5 అమర్చారు. ఈ ఫోన్‌ త్వరలోనే స్మార్ట్ ఫోన్ యూజర్లకు అందుబాటులోకి తీసుకురానుంది.

మిడ్ రేంజ్‌ స్మార్ట్‌ ఫోన్లకు పోటీగా చాలా స్మార్ట్‌ ఫోన్ కంపెనీలు రూ. 20 వేలలోపు ధరకే అత్యాధునిక ఫీచర్లను అందిస్తున్నాయి. Redmi Note 11 pro స్మార్ట్‌ఫోన్‌‌లో స్నాప్‌డ్రాగన్‌ 695 ప్రాసెసర్‌తో వచ్చింది. ఇందులో లిక్విడ్‌ కూల్‌ టెక్నాలజీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రెడ్ మి నోట్ 11 ప్రో రెండు వేరియంట్లలో ప్రత్యేకించి కెమెరా ఫీచర్లకే రెడ్‌మి ఎక్కువగా ప్రాయారిటీ ఇచ్చింది. అందుకే ఈ ఫోన్లలో 108MP రెయిర్‌ కెమెరాను అమర్చారు.

ధర విషయానికొస్తే.. Redmi Note 11 Pro ప్రారంభ ధర రూ. 17,999 ఉండగా.. Redmi Note 11 Pro Plus 5G ఫోన్‌ ధర రూ. 19,999గా ఉంది. బ్యాటరీ విషయానికొస్తే.. 67Wats చార్జింగ్ సపోర్ట్ అందించే 500mAh బ్యాటరీని అమర్చారు. ఈ బ్యాటరీ సామర్థ్యంతో 50 శాతం వరకు ఛార్జింగ్ కేవలం 15 నిమిషాల్లో పూర్తి అవుతుంది. అలాగే 42 నిమిషాల్లో 100 శాతం ఛార్జింగ్ పూర్తి అవుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ MI అధికారిక వెబ్‌సైట్‌ mi.comతో పాటు, amzon.inలో అందుబాటులో ఉంది.

Redmi Note 11 Pro 5g, Redmi Note 11 Pro+ 5g Smartphones With 108mp Main Camera Launched (1)

Redmi Note 11 Pro

ధర ఎంతంటే? :
Redmi Note 11 Pro+ 5G మూడు వేరియంట్‌లలో వస్తుంది.. 6GB+128GB, 8GB+128GB, 8GB+256GB ధర వరుసగా రూ.20,999, రూ.22,999, రూ.24,999లకు అందుబాటులో ఉండనున్నాయి. యూజర్లు ఈ స్మార్ట్‌ఫోన్‌ను స్టీల్త్ బ్లాక్, ఫాంటమ్ వైట్‌లో ఫ్రోస్టెడ్ గ్లాస్ బ్యాక్, మిరాజ్ బ్లూ కలర్ ఆప్షన్‌లతో కొనుగోలు చేయవచ్చు. స్మార్ట్‌ఫోన్ ఆన్‌లైన్‌లో Amazon, Mi.com, ఆఫ్‌లైన్‌లో Mi Home స్టోర్‌లలో మార్చి 15 నుంచి అందుబాటులో ఉంటాయి.

మరోవైపు, Redmi Note 11 Pro 5G రెండు వేరియంట్‌లలో వస్తుంది. 6GB+128GB, 8GB+128GB ధర రూ.17,999 నుంచి వరుసగా రూ.19,999 వరకు ఉన్నాయి. స్మార్ట్‌ఫోన్ స్టార్ బ్లూ, స్టెల్త్ బ్లాక్‌లో ఫ్రాస్టెడ్ గ్లాస్ బ్యాక్‌తో వస్తుంది. ఫాంటమ్ వైట్ కలర్ వేరియంట్‌లో కూడా వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ డివైజ్ మార్చి 23 నుంచి అందుబాటులోకి రానుంది. Amazon.in, Mi.com, Mi హోమ్ స్టోర్‌లలోనూ ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటుంది.

Read Also : Redmi Note 11 Pro : మార్చి 9న రెడ్‌మి నోట్ 11ప్రో వచ్చేస్తోంది.. ఫీచర్లు అదుర్స్.. ధర ఎంత ఉండొచ్చుంటే?