OnePlus Phones : ఈ 16 వన్‌ప్లస్ ఫోన్లలో జియో, ఎయిర్‌టెల్ 5G సర్వీసులు.. మీ ఫోన్ ఉందేమో చెక్ చేసుకోండి.. ఇదిగో ఫుల్ లిస్టు మీకోసం..!

OnePlus Phones : ప్రముఖ దేశీయ రెండు అగ్ర టెలికాం ఆపరేటర్లలో రిలయన్స్ జియో (Reliance Jio), ఎయిర్‌టెల్ (Airtel) వివిధ ప్రాంతాలలో తమ 5G సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చాయి.

OnePlus Phones : ఈ 16 వన్‌ప్లస్ ఫోన్లలో జియో, ఎయిర్‌టెల్ 5G సర్వీసులు.. మీ ఫోన్ ఉందేమో చెక్ చేసుకోండి.. ఇదిగో ఫుల్ లిస్టు మీకోసం..!

These 16 OnePlus phones can now run Jio and Airtel 5G in India_ check full list

OnePlus Phones : ప్రముఖ దేశీయ రెండు అగ్ర టెలికాం ఆపరేటర్లలో రిలయన్స్ జియో (Reliance Jio), ఎయిర్‌టెల్ (Airtel) వివిధ ప్రాంతాలలో తమ 5G సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చాయి. అన్ని సపోర్టెడ్ డివైజ్‌లలో 5Gని తీసుకొచ్చేందుకు టెలికాం ఆపరేటర్లు OEMలతో కలిసి పనిచేస్తోంది.

2020 నుంచి లాంచ్ అయిన అన్ని ఫోన్‌లకు 5G సపోర్టును అందించేందుకు Reliance Jio, Airtel టెల్కోలు OnePlusతో భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. ముఖ్యంగా, హై-స్పీడ్ 5G డేటా 5G-సపోర్టు ఉన్న డివైజ్‌లలో మాత్రమే రన్ అవుతుంది. మీరు పాత 4G-సపోర్టు ఉన్న OnePlus ఫోన్‌లలో ఒకదానిని ఉపయోగిస్తుంటే.. మీరు హై-స్పీడ్ ఇంటర్నెట్‌ కోసం అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు.

These 16 OnePlus phones can now run Jio and Airtel 5G in India_ check full list

These 16 OnePlus phones can now run Jio and Airtel 5G in India

OnePlus 2020 ఏడాదిలో లాంచ్ అయిన అన్ని స్మార్ట్‌ఫోన్‌లు Jio, Airtel 5G సర్వీసులను అందించనున్నట్టు అధికారికంగా ధృవీకరించింది. OnePlus 8 సిరీస్ నుంచి ప్రారంభమైన అన్ని OnePlus ఫోన్‌లు, OnePlus Nord సహా భారత్‌లోని అన్ని టెలికాం ప్రొవైడర్‌ల నుంచి 5G నెట్‌వర్క్‌లకు సపోర్టు చేస్తాయని చెప్పవచ్చు.

జియో, ఎయిర్‌టెల్‌తో పాటు, న్యూఢిల్లీలో వోడాఫోన్ ఐడియా Vi 5G ట్రయల్ దశలో భాగంగా డివైజ్‌లను కూడా టెస్టింగ్ చేసినట్టు OnePlus అధికారిక ప్రకటనలో వెల్లడించింది. 5G సర్వీసులు అందుబాటులోకి వచ్చిన తర్వాత అన్ని అర్హత కలిగిన OnePlus ఫోన్‌లు Vi 5G సపోర్టు అందించగలవని కంపెనీ స్పష్టం చేసింది. భారత్‌లో Jio, Airtel 5G సర్వీసులను అందించగల OnePlus ఫోన్‌ల పూర్తి లిస్టును మీకోసం అందిస్తున్నాం.

* OnePlus 8
* OnePlus 8 Pro
* OnePlus 8T
* OnePlus 9
* OnePlus 9 Pro
* OnePlus 9R
* OnePlus 9RT
* OnePlus 10 Pro
* OnePlus 10R
* OnePlus 10T
* OnePlus Nord
* OnePlus Nord 2
* OnePlus Nord 2T
* OnePlus Nord CE
* OnePlus Nord CE 2
* OnePlus CE 2 Lite

These 16 OnePlus phones can now run Jio and Airtel 5G in India_ check full list

These 16 OnePlus phones can now run Jio and Airtel 5G in India

ఇప్పుడు, మీ ప్రాంతంలో Jio లేదా Airtel 5G అందుబాటులో ఉంటే.. మీ OnePlus ఫోన్‌లో హై స్పీడ్ 5G ఇంటర్నెట్‌ని ఉపయోగించేందుకు మీరు మీ ఫోన్‌లో 5G సెట్టింగ్‌లను యాక్టివేట్ చేయాలి. మీ OnePlus ఫోన్‌లో 5Gని ఎలా యాక్టివేట్ చేయాలో ఇప్పుడు చూద్దాం..

* మీ స్మార్ట్‌ఫోన్‌లో ‘Settings’ యాప్‌ను ఓపెన్ చేయండి.
* ‘Mobile networks’కి వెళ్లండి
* ఇప్పుడు Jio SIMని ఎంచుకోండి.
* ఇప్పుడు ‘Preferred network type’ ఆప్షన్‌పై Tap చేయండి.
* ఇప్పుడు 5G network type ఎంచుకోండి.

సెట్టింగ్‌ని మార్చిన తర్వాత, అర్హత ఉన్న OnePlus యూజర్లు తమ ఫోన్‌లలో 5Gని యాక్సస్ చేసుకోవచ్చు. ముఖ్యంగా, Jio 2023 చివరి నాటికి లేదా ఈ సంవత్సరం డిసెంబర్ నాటికి ట్రూ 5G సర్వీసులను అందుబాటులోకి తీసుకురానున్నట్లు అధికారికంగా ప్రకటించింది.

మరోవైపు, ఎయిర్‌టెల్ మార్చి 2024 నాటికి దేశవ్యాప్తంగా ఎయిర్‌టెల్ 5G ప్లస్ సర్వీసులను అందిస్తామని తెలిపింది. ఇదిలా ఉండగా, OnePlus నెక్స్ట్ జనరేషన్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌ను OnePlus 11 గా ఫిబ్రవరి 7న భారత మార్కెట్లో లాంచ్ చేయనున్నట్టు వెల్లడించింది.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Tecno Phantom X2 5G : టెక్నో మొబైల్ నుంచి అత్యంత ఖరీదైన 5G ఫోన్ వచ్చేసింది.. ఫీచర్లు అదుర్స్.. ధర ఎంతంటే?