ఆపిల్ ఐఫోన్‌లో ‘i’ అంటే అర్థం తెలుసా? ఆ పేరు ఎలా వచ్చిందంటే?

ఆపిల్ ఐఫోన్‌లో ‘i’ అంటే అర్థం తెలుసా? ఆ పేరు ఎలా వచ్చిందంటే?

iPhone Stands for : ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ అనగానే.. అందరికి ముందుగా గుర్తుచ్చేది.. ఐఫోన్.. (iPhone). ప్రపంచ మార్కెట్లలో బెస్ట్ సెల్లింగ్ సెల్ ఫోన్ ఐఫోన్.. 2007లో ప్రపంచ మొబైల్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది. అప్పటినుంచి ఐఫోన్ అంటే అదో క్రేజ్.. ఇప్పటివరకూ ఐఫోన్ క్రేజ్ అలానే ఉంది. ఎంతమాత్రం చెక్కు చెదరలేదు. ఐఫోన్ కాస్ట్ ఎంత ఎక్స్ పెన్సివ్ గా ఉంటుందో దాని పర్ఫార్మెన్స్ కూడా అదే స్థాయిలో ఉంటుంది.

మీలో ఎవరైనా ఐఫోన్ వాడుతున్నారా? అయితే ఐఫోన్.. ఐకానిక్ లెటర్ ‘i’ ప్రత్యేకత ఏంటో తెలుసా? ఐ.. అంటే అందరూ ఇంటర్నెట్ అనుకుంటారు. మొదటి నుంచి ఐఫోన్ ఆవిర్భావం నుంచి ఇంటర్నెట్ ఫెసిలిటీ ఉంది. ఫీచర్లు, యాప్స్ ఏదో ఒకటి చాయిస్ ఎంచుకోవడానికి ఐకాన్ అని కావొచ్చు.. ఇందులో ఏ ఒక్కటి కాదు.. ఐఫోన్.. ఐ అక్షరానికి 5 రకాల వేర్వేరు పదాలు ఉన్నాయి.

‘I’ అనే పేరు.. ఆపిల్ ప్రొడక్ట్ iMac కంప్యూటర్ నుంచి వచ్చింది. ఇది 1998లో రిలీజ్ అయింది. కంప్యూటర్లలో మాత్రమే ఇంటర్నెట్ యాక్సస్ ఉండేది. ఐఫోన్ వచ్చాక ఫోన్లలో ఇంటర్నెట్ యాక్సస్ మొదలైంది. మ్యాక్ కంప్యూటర్ లో ఇంటర్నెట్ కెపాసిటీ హైలెట్ అని చెప్పాలి.

స్టీవ్ జాబ్స్ iMac లాంచింగ్ చేసిన తర్వాత ఐఫోన్.. ఐ పదానికి మరిన్ని అర్థాలు వచ్చి చేరాయి. స్టీవ్ జాబ్స్ ఒక ప్రజెంటేషన్‌లో భాగంగా ‘i’ అంటే.. internet, individual, instruct, inform, inspire అని అర్థాలను వివరించారు. ఆపిల్ ప్రొడక్టులలో ‘ఐ’ పేరుతో వచ్చిన వాటిలో iPod ఎంతో పాపులర్ అయ్యాయి.