Vi IR Plans : విదేశాలకు వెళ్తున్నారా? వోడాఫోన్ ఐడియా 5 రోమింగ్ ప్లాన్లు ఇవే.. అన్‌లిమిటెడ్ కాలింగ్, మరెన్నో డేటా బెనిఫిట్స్..!
Vodafone Idea IR Plans : విదేశాలకు వెళ్తున్నారా? విదేశీ ప్రయాణాల్లో లేదా సుదీర్ఘ విహారయాత్రకు వెళ్లేందుకు ఇదే సరైన సమయం.. 2022 డిసెంబర్‌లో శీతాకాలంతో పాటు కొత్త సంవత్సరం కూడా వస్తోంది. ఈ సమయంలో హాలిడే ట్రిప్‌కి వెళ్లేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు.

Vodafone Idea IR Plans : విదేశాలకు వెళ్తున్నారా? విదేశీ ప్రయాణాల్లో లేదా సుదీర్ఘ విహారయాత్రకు వెళ్లేందుకు ఇదే సరైన సమయం.. 2022 డిసెంబర్‌లో శీతాకాలంతో పాటు కొత్త సంవత్సరం కూడా వస్తోంది. ఈ సమయంలో హాలిడే ట్రిప్‌కి వెళ్లేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. విదేశాలకు వెళ్లి న్యూ ఇయర్ సెలబ్రేషన్లు చేసేందుకు ఈ సీజన్ సరైనదిగా చెప్పవచ్చు.
అమెరికా (USA), యూకే (UK) సహా ఇతర యూరోపియన్ దేశాలు, సింగపూర్, దుబాయ్, థాయ్‌లాండ్, ఆస్ట్రేలియా, ఇతర దేశాల్లో అంతర్జాతీయ పర్యటనను చేసేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే విదేశీ ప్రయాణాలు చేసేవారి కోసం ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం వోడాఫోన్ ఐడియా Vodafone Idea (Vi) తమ యూజర్ల కోసం ప్రత్యేక రీఛార్జ్ ప్లాన్‌లను ఆఫర్ చేస్తోంది.

Vodafone Idea offering 5 IR plans with Unlimited Calling
ఈ హాలిడే సీజన్‌లో అంతర్జాతీయంగా ప్రయాణించే వారికోసం ఎంపిక చేసిన అంతర్జాతీయ ప్యాక్‌లపై Vi అన్‌లిమిటెడ్ కాలింగ్, డేటా బెనిఫిట్స్ అందిస్తోంది. ఇంటర్నేషనల్ రోమింగ్ (IR)లో ‘ట్రూలీ అన్‌లిమిటెడ్ డేటా అండ్ వాయిస్ ఎక్స్‌పీరియన్స్’ని అందిస్తోంది. డేటా ఎగ్జాషన్ లేకుండా ఇంటర్నెట్‌ను వినియోగించేందుకు స్ట్రీమ్ చేసేందుకు యూజర్లకు అనుమతిస్తుంది.
ఈ అంతర్జాతీయ ప్యాక్‌లు US, UK, UAE, మలేషియా, సింగపూర్, చెక్ రిపబ్లిక్, జర్మనీ, గ్రీస్, హంగరీ, థాయిలాండ్, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, హాంకాంగ్, ఐర్లాండ్, ఇటలీ, నెదర్లాండ్స్, పోర్చుగల్, రొమేనియాతో సహా అన్ని ప్రధాన అంతర్జాతీయ ప్రయాణ గమ్యస్థానాలకు అందుబాటులో ఉన్నాయి.
స్పెయిన్, టర్కీ, న్యూజిలాండ్, బ్రెజిల్, ఇండోనేషియాలో ఈ ఏడాది చివరిలో 90 శాతం ట్రాఫిక్ అధికంగా ఉంటుంది. ఎందుకంటే.. న్యూఇయర్ కావడంతో విదేశాలకు వెళ్లేవారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. అందుకే ఇలాంటి సమయాల్లో అన్‌లిమిటెడ్ కాలింగ్, డేటా బెనిఫిట్స్ పొందాలంటే.. Vi ద్వారా అందుబాటులో ఉన్న IR ప్లాన్‌లను వివరంగా పరిశీలిద్దాం.

Travelling abroad_ Vodafone Idea offering 5 IR plans with Unlimited Calling, Data Benefits
Vi International Roaming Plans :
Vi Rs.599 IR Plan : 24 గంటల వ్యాలిడిటీతో ఈ ప్లాన్ ద్వారా అన్‌లిమిటెడ్ అవుట్‌గోయింగ్ లోకల్, ఇండియా కాలింగ్, ఇన్‌కమింగ్ కాలింగ్, డేటాతో SMSలను పొందవచ్చు.
Vi Rs.2999 IR Plan : వినియోగదారులు 7 రోజుల పాటు అన్‌లిమిటెడ్ అవుట్‌గోయింగ్ లోకల్, ఇండియా కాలింగ్, ఇన్‌కమింగ్ కాలింగ్, డేటాతో పాటు SMS బెనిఫిట్స్ పొందవచ్చు.
Vi Rs.3999 IR Plan : ఈ IR ప్లాన్ అన్‌లిమిటెడ్ అవుట్‌గోయింగ్ లోకల్, ఇండియా కాలింగ్, ఇన్‌కమింగ్ కాలింగ్, డేటా, SMS బెనిఫిట్స్ సహా10 రోజుల వ్యాలిడిటీని అందిస్తుంది.
Vi Rs.4499 IR Plan : వినియోగదారులు అన్‌లిమిటెడ్ అవుట్‌గోయింగ్ లోకల్, ఇండియా కాలింగ్, ఇన్‌కమింగ్ కాలింగ్, డేటా, SMS బెనిఫిట్స్‌తో పాటు 14 రోజుల వ్యాలిడిటీని పొందవచ్చు.
Vi Rs 5999 IR Plan : ఈ IR పోస్ట్‌పెయిడ్ ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీతో పాటు 15Gb డేటా, 1500 గంటల అవుట్‌గోయింగ్ లోకల్, ఇండియా కాలింగ్, ఫ్రీ ఇన్‌కమింగ్ కాల్స్, ఫ్రీగా SMS బెనిఫిట్స్ అందిస్తుంది.
ముఖ్యంగా, వోడాఫోన్ యూజర్లు యూజర్లు ఎక్కడ ప్రయాణించినా నిరంతరం కనెక్టివిటీని పొందవచ్చు. నెట్‌వర్క్ గమ్యస్థానాల్లోని వివిధ సర్వీస్ ప్రొవైడర్‌లతో Vi భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. అన్ని Vi పోస్ట్‌పెయిడ్ రోమింగ్ ప్యాక్‌లలోని ‘Always On’ ఫీచర్ ద్వారా సబ్‌స్క్రయిబ్ ప్యాక్ గడువు ముగిసిన తర్వాత కూడా అంతర్జాతీయ రోమింగ్‌లో ఉన్నప్పుడు కస్టమర్‌లకు ఛార్జీ విధించవచ్చు.
WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..