Twitter Character Count : ట్విట్టర్ ట్వీట్ క్యారెక్టర్ కౌంట్‌ పెంచే ఛాన్స్.. ఇకపై 280 కాదట.. ఎలన్ మస్క్ హింట్ ఇచ్చాడుగా..!

Twitter Character Count : ప్రముఖ మైక్రోబ్లాగింగ్ వెబ్‌సైట్ ట్విట్టర్ (Twitter)లో కొత్త మార్పులు చోటుచేసుకుంటున్నాయి. అక్టోబర్ చివరిలో ప్రపంచ బిలియనీర్ ఎలోన్ మస్క్ (Elon Musk) ట్విట్టర్ కొనుగోలు చేసినప్పటి నుంచి Twitter చాలా మార్పులను చేస్తోంది.

Twitter Character Count : ట్విట్టర్ ట్వీట్ క్యారెక్టర్ కౌంట్‌ పెంచే ఛాన్స్.. ఇకపై 280 కాదట.. ఎలన్ మస్క్ హింట్ ఇచ్చాడుగా..!

Twitter may consider increasing tweet character count from 280 to 420, Elon Musk hints

Twitter Character Count : ప్రముఖ మైక్రోబ్లాగింగ్ వెబ్‌సైట్ ట్విట్టర్ (Twitter)లో కొత్త మార్పులు చోటుచేసుకుంటున్నాయి. అక్టోబర్ చివరిలో ప్రపంచ బిలియనీర్ ఎలోన్ మస్క్ (Elon Musk) ట్విట్టర్ కొనుగోలు చేసినప్పటి నుంచి Twitter చాలా మార్పులను చేస్తోంది. అందులో ప్రైమరీ ఫీచర్ మాత్రం అలాగే ఉంది. ట్విట్టర్ ప్లాట్‌ఫారమ్ యూజర్ల ఆలోచనలు, అభిప్రాయాలను కేవలం 280 అక్షరాలలో ట్వీట్ చేసేందుకు అనుమతిస్తుంది. గత నాలుగు ఏళ్లుగా ఇదే ప్రక్రియ కొనసాగుతోంది.

అయితే, కొత్త ట్విట్టర్ బాస్ భవిష్యత్తులో ట్విట్టర్ ట్వీట్ క్యారెక్టర్ కౌంట్ 280 నుంచి 420కి పెంచే ఆలోచనలో ఉన్నట్లు కనిపిస్తోంది. వచ్చే వారం నుంచి సస్పెండ్ చేసిన అకౌంట్ల పట్ల ప్లాట్‌ఫారమ్ “క్షమాభిక్ష” చూపుతుందని మస్క్ చెప్పారు. కంగనా రనౌత్, ఆమె సోదరి రంగోలి చందేల్, గాయకుడు అభిజీత్ బెనర్జీ వంటి చాలా మంది ప్రముఖులు, యూజర్ల ట్విట్టర్ అకౌంట్లు త్వరలో యాక్టివ్ అయ్యే అవకాశం కనిపిస్తోంది.

గతవారంలో యూజర్ల చేసే ట్వీట్‌లో 280 అక్షరాల సంఖ్యను పెంచడానికి మస్క్ ఆసక్తి వ్యక్తం చేశారు. ఒక యూజర్ ‘@rawalerts’ పోస్టు ప్రకారం..”Twitter 2.0లో 280కి బదులుగా అక్షర పరిమితిని 420 చేయాలని కోరారు. దానికి మస్క్ మంచి ఆలోచన అంటూ బదులిచ్చాడు. ప్రారంభ రోజులలో Twitter ట్వీట్లు 140 అక్షరాలకు పరిమితం చేసిన సంగతి తెలిసిందే. ఎందుకంటే సర్వీసు సంప్రదాయ SMSపై ఎక్కువగా ఆధారపడటమే ఇందుకు కారణమని చెప్పవచ్చు.

Twitter may consider increasing tweet character count from 280 to 420, Elon Musk hints

Twitter may consider increasing tweet character count from 280 to 420, Elon Musk hints

Read Also : Twitter Account Backup : ట్విట్టర్ నుంచి వెళ్లిపోతున్నారా? మీ డేటా జర భద్రం.. అకౌంట్లో ట్వీట్లు, ఫాలోవర్ల లిస్టును ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!

2018లో ట్విట్టర్ (Twitter Character Count) అక్షరాల సంఖ్యను 140 నుంచి 280కి పెంచింది. ట్విట్టర్ కొనుగోలు తర్వాత మస్క్ సైతం దీనిపై పోల్‌లను కూడా నిర్వహిస్తున్నాడు ప్లాట్‌ఫారమ్‌లో ఎలాంటి మార్పులు చేయాలి అనేదానిపై యూజర్ల అభిప్రాయాన్ని తీసుకుంటున్నాడు. ఏప్రిల్‌లో ముందుగా, మస్క్ యూజర్లకు ‘Edit Tweet’ ఆప్షన్ చూడాలనుకుంటున్నారా అని అడిగారు. అందుకు చాలామంది ‘అవును’ అని సమాధానమిచ్చారు.

పోల్ రిజల్ట్స్ తర్వాత Twitter బ్లూ సబ్‌స్క్రిప్షన్‌ (Twitter Blue Subscription)లు కలిగిన యూజర్లకు Twitter త్వరగా కొత్త ఎడిట్ బటన్‌ను లాంచ్ చేసింది. ఇటీవల.. మస్క్ ఒక పోల్ నిర్వహించగా.. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అకౌంట్ (Donald Trump)ను రీస్టోర్ చేయాలా వద్దా అని యూజర్లను అడిగారు. చాలా మంది యూజర్లు ట్రంప్ అకౌంట్ తిరిగి ఇవ్వడాన్ని అంగీకరించారు.

ఆ మరుసటి రోజునే ట్రంప్ ట్విట్టర్ అకౌంట్‌పై సస్పెన్షన్‌ను మస్క్ ఎత్తివేశాడు. జనవరి 2021లో యూఎస్ క్యాపిటల్ అల్లర్లను ప్రేరేపించినందుకు మాజీ US అధ్యక్షుడి అకౌంట్ ట్విట్టర్ సస్పెండ్ చేసింది. ఆ తర్వాత ట్రంప్ కూడా ట్విట్టర్ కు పోటీగా ట్రూత్ సోషల్ (Truth Social) యాప్ సొంతంగా ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Twitter Check Marks : వచ్చే వారం నుంచే ట్విట్టర్ యూజర్లకు బ్లూ, గ్రే, గోల్డ్ చెక్ మార్కులు.. ఎవరికి ఏయే టిక్ మార్క్ ఇస్తారంటే? ఎలన్ మస్క్ మాటల్లోనే..!