Vivo T1 5G : వివో T1 5G సిల్కీ వైట్ వేరియంట్ ఫోన్ వచ్చేసింది.. ఫీచర్లు ఇవేనా? భారత్‌లో ధర ఎంతంటే?

Vivo T1 5G : చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వివో (Vivo) భారత మార్కెట్లో Vivo T1 5G సిల్కీ వైట్ వేరియంట్‌ను లాంచ్ చేసింది. రెయిన్‌బో ఫాంటసీ, స్టార్‌లైట్ బ్లాక్ కలర్ ఆప్షన్‌లలో వచ్చింది. ఫస్ట్ టైం ఈ ఏడాది ఫిబ్రవరిలో మార్కెట్లో అందుబాటులోకి వచ్చింది. ఈ కొత్త 5G ఫోన్ వేరియంట్ ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలుకు అందుబాటులో ఉంది.

Vivo T1 5G : వివో T1 5G సిల్కీ వైట్ వేరియంట్ ఫోన్ వచ్చేసింది.. ఫీచర్లు ఇవేనా? భారత్‌లో ధర ఎంతంటే?

Vivo T1 5G Silky White variant launched in India Details on price, specs

Vivo T1 5G : చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వివో (Vivo) భారత మార్కెట్లో Vivo T1 5G సిల్కీ వైట్ వేరియంట్‌ను లాంచ్ చేసింది. రెయిన్‌బో ఫాంటసీ, స్టార్‌లైట్ బ్లాక్ కలర్ ఆప్షన్‌లలో వచ్చింది. ఫస్ట్ టైం ఈ ఏడాది ఫిబ్రవరిలో మార్కెట్లో అందుబాటులోకి వచ్చింది. ఈ కొత్త 5G ఫోన్ వేరియంట్ ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలుకు అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ Qualcomm Snapdragon 695 SoCతో వస్తుంది. ఇందులో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను ప్రత్యేక ఆకర్షణగా ఉంది.

Vivo T1 5G భారత్‌లో ధర ఎంతంటే? :
సిల్కీ వైట్ కలర్ వేరియంట్ 4GB RAM +128GB స్టోరేజ్ వేరియంట్‌తో వచ్చింది. దీనిపై ధర రూ. 15,990 ట్యాగ్‌తో వస్తుంది. 6GB RAM, 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.16,990గా ఉంది. ఫ్లిప్‌కార్ట్, అధికారిక Vivo ఇండియా ఆన్‌లైన్ స్టోర్‌లో కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంది.

Vivo T1 5G Silky White variant launched in India Details on price, specs

Vivo T1 5G Silky White variant launched in India Details on price, specs

Vivo T1 5G : స్పెసిఫికేషన్‌లివే :
Vivo T1 5G సిల్కీ వైట్ వేరియంట్ స్పెసిఫికేషన్‌లతో ఈ ఏడాది ఫిబ్రవరిలో లాంచ్ అయింది. ఈ ఫోన్ ఫీచర్లు స్టాండర్డ్ వేరియంట్‌ల మాదిరిగానే ఉన్నాయి. Vivo T1 5G 6nm స్నాప్‌డ్రాగన్ 695 5G ఆక్టా-కోర్ చిప్‌సెట్ ఆధారిత 4GB వరకు RAM, 128GB ROM, FunTouch OS 12 మాదిరిగానే కనిపిస్తున్నాయి. Vivo T1 5G 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.58-అంగుళాల FHD+ ఇన్-సెల్ డిస్‌ప్లేను కలిగి ఉంది. Vivo నుంచి వచ్చిన స్మార్ట్‌ఫోన్ 18W ఛార్జర్‌తో పాటు 5,000mAh బ్యాటరీని అందిస్తుంది. అదనంగా, స్మార్ట్‌ఫోన్ రివర్స్ ఛార్జింగ్‌కు కూడా సపోర్టు అందిస్తుంది.

Vivo T1 5G Silky White variant launched in India Details on price, specs

Vivo T1 5G Silky White variant launched in India Details on price, specs

ఆప్టిక్స్ కోసం.. Vivo T1 5G 50MP ప్రైమరీ సెన్సార్, 2MP సూపర్ మాక్రో కెమెరా, 2MP బోకె కెమెరాను కలిగి ఉంది. 16MP సెల్ఫీ లెన్స్‌ని అందిస్తుంది. Vivo హ్యాండ్‌సెట్‌లో సూపర్ నైట్ మోడ్, మల్టీ స్టైల్ పోర్ట్రెయిట్ మోడ్ వంటి కొన్ని కెమెరా ఫీచర్‌లను అందించింది. Vivo T1 5G 128GB వరకు ఇంటర్నల్ స్టోరేజీతో వచ్చింది. దీనిని మైక్రో SD కార్డ్ ద్వారా uo1TBకి విస్తరించవచ్చు. స్మార్ట్‌ఫోన్‌లో 5G, 4G LTE, డ్యూయల్-బ్యాండ్ Wi-Fi, బ్లూటూత్ v5.1, USB టైప్ C పోర్ట్, USB OTG కనెక్టివిటీ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి.

Read Also : Vivo T1X : రూ. 15వేల లోపు ధరలో వివో T1X స్మార్ట్‌ఫోన్.. ధర తక్కువ.. ఫీచర్లు ఎక్కువ..!