WhatsApp Data Breach : వాట్సాప్ డేటా ఉల్లంఘన.. ఆన్‌లైన్‌లో 50 కోట్ల మంది యూజర్ల ఫోన్ నెంబర్లు లీక్.. ఏయే దేశాల్లో ఎక్కువంటే?

WhatsApp Data Breach : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (Whatsapp) యూజర్ల డేటా ఉల్లంఘనకు గురైంది. ఇప్పటివరకూ జరిగిన ఆన్‌లైన్ యూజర్ల అతిపెద్ద డేటా ఉల్లంఘనలలో ఇదొకటి కావచ్చు. దాదాపు 500 మిలియన్ల (50కోట్ల మంది) వాట్సాప్ వినియోగదారుల ఫోన్ నంబర్‌లు ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెట్టేశారు.

WhatsApp Data Breach : వాట్సాప్ డేటా ఉల్లంఘన.. ఆన్‌లైన్‌లో 50 కోట్ల మంది యూజర్ల ఫోన్ నెంబర్లు లీక్.. ఏయే దేశాల్లో ఎక్కువంటే?

WhatsApp Data Breach _ 500 million users’ phone numbers on sale

WhatsApp Data Breach : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (Whatsapp) యూజర్ల డేటా ఉల్లంఘనకు గురైంది. ఇప్పటివరకూ జరిగిన ఆన్‌లైన్ యూజర్ల అతిపెద్ద డేటా ఉల్లంఘనలలో ఇదొకటి కావచ్చు. దాదాపు 500 మిలియన్ల (50కోట్ల మంది) వాట్సాప్ వినియోగదారుల ఫోన్ నంబర్‌లు ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెట్టేశారు. సైబర్‌న్యూస్ నివేదిక ప్రకారం.. హ్యాకింగ్ కమ్యూనిటీ ఫోరమ్‌లో 487 మిలియన్ వాట్సాప్ యూజర్ మొబైల్ నంబర్‌ల 2022 డేటాబేస్‌ను విక్రయిస్తున్నట్లు పేర్కొంటూ ఒక ప్రకటనను పోస్ట్ చేశాడు.

డేటాబేస్ US, UK, ఈజిప్ట్, ఇటలీ, సౌదీ అరేబియా, భారత్ సహా 84 వేర్వేరు దేశాల నుంచి WhatsApp యూజర్ల మొబైల్ నంబర్లను కలిగి ఉంది. ఉల్లంఘనకు గురైన డేటాలో ఎక్కువగా ఫిషింగ్ అటాక్స్ ద్వారానే ఉన్నట్టు కనిపిస్తోంది. వాట్సాప్ యూజర్లు తెలియని నంబర్ల నుంచి కాల్స్, మెసేజ్‌లకు దూరంగా ఉండటం మంచిదని సైబర్ నిపుణులు సైతం హెచ్చరిస్తున్నారు.

అమ్మకానికి వాట్సాప్ డేటాసెట్ :
వాట్సాప్ డేటా సెట్‌ (Whatsapp Dataset)లో 32 మిలియన్ల అమెరికన్ వాట్సాప్ యూజర్ల రికార్డ్‌లు ఉన్నాయని గుర్తించారు. అదే విధంగా, వాట్సాప్ ప్రభావిత యూజర్లు ఈజిప్ట్‌లో 45 మిలియన్లు, ఇటలీలో 35 మిలియన్లు, సౌదీ అరేబియాలో 29 మిలియన్లు, ఫ్రాన్స్‌లో 20 మిలియన్లు, టర్కీలో 20 మిలియన్లు ఉన్నారు. డేటాబేస్‌లో దాదాపు 10 మిలియన్ల రష్యన్లు, 11 మిలియన్లకు పైగా యూకే పౌరుల ఫోన్ నంబర్లు ఉన్నాయి.

WhatsApp Data Breach _ 500 million users’ phone numbers on sale

WhatsApp Data Breach _ 500 million users’ phone numbers on sale

అమెరికా డేటాసెట్‌ను 7,000 డాలర్లు (సుమారు రూ. 5,71,690) కి విక్రయిస్తున్నట్లు నివేదిక పేర్కొంది. యూకే, జర్మనీ డేటాసెట్‌ల ధర వరుసగా 2,500 డాలర్లు (సుమారు రూ. 2,04,175), 2,000 డాలర్లు (సుమారు రూ.1,63,340)గా ఉన్నాయి. ఆన్‌లైన్‌లో పోస్ట్ చేసిన భారీ డేటా సెట్‌లు స్క్రాప్ చేయడం ద్వారా WhatsApp సేవా నిబంధనలను ఉల్లంఘించినట్టు నిర్ధారణ అయింది.

అన్ని ఫోన్ నంబర్‌లు మెటా-యాజమాన్య ప్లాట్‌ఫారమ్‌లోని యాక్టివ్ యూజర్‌లకు చెందినవని అంటున్నారు. అసలు వాట్సాప్ డేటాబేస్ ఎలా యాక్సస్ చేశాడనేది మాత్రం వెల్లడించలేదు. వాట్సాప్ యూజర్ల డేటాను సేకరించడానికి సీక్రెట్ వ్యూహాన్ని ఉపయోగించినట్టు నివేదిక తెలిపింది.

మెటా, ప్లాట్‌ఫారమ్‌లు డేటా ఉల్లంఘనకు గురికావడం ఇదే మొదటిసారి కాదు. గత ఏడాదిలోనూ లీక్‌స్టర్ 500 మిలియన్లకు పైగా ఫేస్‌బుక్ యూజర్ల డేటా (Facebook Users Data)ను ఆన్‌లైన్‌లో ఉచితంగా బహిర్గతం చేశాడు. అలా లీకైన డేటాలో యూజర్ల ఫోన్ నంబర్లు, ఇతర వివరాలు ఉన్నాయి.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : WhatsApp Share Voice Notes : వాట్సాప్‌లో త్వరలో వాయిస్ నోట్స్ కొత్త ఫీచర్ వస్తోంది.. మీ వాయిస్ నోట్‌ను స్టేటస్ అప్‌డేట్స్‌గా షేర్ చేసుకోవచ్చు!