WhatsApp Feature : వాట్సాప్ యూజర్లకు గుడ్‌న్యూస్.. ఆ ఫీచర్ వచ్చేసింది..!

WhatsApp Feature : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్.. వాట్సాప్ యూజర్లు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ఆకర్షణీయమైన కొత్త ఫీచర్ వచ్చింది.

WhatsApp Feature : వాట్సాప్ యూజర్లకు గుడ్‌న్యూస్.. ఆ ఫీచర్ వచ్చేసింది..!

Whatsapp Feature Whatsapp Rolls Out Message Reactions Feature To Select Users Here’s How It Works

WhatsApp Feature : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్.. వాట్సాప్ యూజర్లు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ఆకర్షణీయమైన కొత్త ఫీచర్ వచ్చింది. అదే.. మెసేజ్ రియాక్షన్స్ ఫీచర్ (WhatsApp message reactions feature).. కానీ, అందరికి కాదండోయ్. ఈ ఫీచర్ ఇప్పుడు ప్రస్తుతం ఎంపిక చేసిన బీటా వాట్సాప్ యూజర్లకు అందుబాటులో ఉంది. టెలిగ్రామ్, ఇన్ స్టాగ్రామ్ యూజర్లకు ఇప్పటికే ఈ తరహా ఫీచర్ అందుబాటులో ఉంది. కొన్ని అద్భుతమైన యానిమేటెడ్ ఎమోజీలతో మీ స్నేహితులకు పంపుకోవచ్చు. WhatsApp యానిమేటెడ్ ఎమోజీలతో వాట్సాప్‌లోని మెసేజ్ లు పంపేముందు వినియోగించుకోవచ్చు. ఇందులో ఏదైనా మెసేజ్ నొక్కితే చాలు.. వాట్సాప్ యాప్ ఎమోజి బాక్స్‌ డిస్ ప్లే అవుతుంది. మీ ఎమోజీల్లో మీకు నచ్చినది ఏదైనా ఎంచుకోవచ్చు. WhatsApp మీ ఎమోజీని మెసేజ్‌కు పంపుతుంది.

ప్రస్తుతానికి యూజర్లు ఎమోజీలను లైక్, లవ్, లాఫ్, ఆశ్చర్యం, విచారం, ధన్యవాదాలు వంటి ఆరు ఎమోజీ రియాక్షన్స్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అదే టెలిగ్రామ్ లో 10 కంటే ఎక్కువ ఎమోజీలను అందిస్తుంది. అదేవిధంగా Instagram DM సెక్షన్ ద్వారా చాటింగ్ చేసే యూజర్లు అన్ లిమిటెడ్ ఎమోజీలను అందిస్తోంది. అయితే ఈ ఎమోజీల డిఫాల్ట్ లిస్టులో యాడ్ చేసుకోవచ్చు. మెటా యాజమాన్యమైన సంస్థ మెసేజ్ రియాక్షన్ ఫీచర్ తీసుకురానున్నట్టు ఇప్పటికే నివేదికలు వెల్లడించాయి.

Whatsapp Feature Whatsapp Rolls Out Message Reactions Feature To Select Users Here’s How It Works(1)

Whatsapp Feature Whatsapp Rolls Out Message Reactions Feature To Select Users Here’s How It Work

ఈ కొత్త ఫీచర్ వాట్సాప్ రెగ్యులర్ యూజర్లందరికి అందుబాటులోకి రాలేదు. కేవలం బీటా టెస్టర్‌ల కోసం మాత్రమే రూపొందించారు. రాబోయే నెలల్లో ఈ కొత్త ఫీచర్ అందరికి అందుబాటులోకి రానుంది. వాట్సాప్ గ్రూప్, పర్సనల్ చాట్‌ల కోసం వాట్సాప్ ఫీచర్‌ను అందిస్తుందా? అనేది క్లారిటీ లేదు. ఇతర యాప్‌లు అన్ని చాట్‌లకు మెసేజ్ రియాక్షన్స్ ఫీచర్‌ను అందిస్తున్నాయి. మీరు ఆండ్రాయిడ్ బీటా టెస్టర్ అయితే మీరు WhatsApp 2.22.8.3 వెర్షన్‌లో ఈ కొత్త రియాక్షన్స్ ఫీచర్‌ యాక్సస్ చేసుకోవచ్చు.

ఈ ఫీచర్ మాత్రమే కాకుండా, WhatsApp మల్టీ-డివైస్ ఫీచర్ స్టాండెడ్ వెర్షన్‌ను కూడా రిలీజ్ చేసింది. ఇకపై ఈ ఫీచర్ బీటా మోడ్‌లో అందుబాటులో ఉండదు. మునుపటి వెర్షన్లలో కొన్ని బగ్‌లు ఉన్నాయి. మీరు వాడే డివైజ్‌ల్లో అన్ని చాట్‌లకు సాంకేతికపరమైన సమస్యలు ఉన్నాయి. కొత్త అప్‌డేట్ ద్వారా ఆ బగ్ ఫిక్స్ చేయనుంది. మల్టీ డివైజ్ ఫీచర్ సాయంతో WhatsApp అకౌంట్ మీ ప్రైమరీ డివైజ్ కు లింక్ చేయాల్సిన అవసరం లేదు. అన్ని డివైజ్ లకు సులభంగా యాక్సస్ చేసుకోవచ్చు. మందుగా మీరు ఏదైనా డివైజ్‌లో ఈ ఫీచర్ యాక్సెస్ చేయాలంటే మెయిన్ డివైజ్ ద్వారా మాత్రమే వినియోగించాల్సి ఉంటుంది. ఒకసారి యాక్సస్ చేస్తే సరిపోతుంది. మళ్లీ కనెక్ట్ చేయాల్సిన పనిలేదు. మల్టీ డివైజ్ ఫీచర్ Settings> Menu > లింక్డ్ డివైజ్‌లలో ఉంటుంది.

Read Also :WhatsApp Tips : వాట్సాప్‌లో UPI పేమెంట్ ఫీచర్.. అకౌంట్ క్రియేషన్ ఎలా? పేమెంట్ చేయాలంటే?