WhatsApp Two Features : వాట్సాప్‌లో రెండు కొత్త ఇంట్రెస్టింగ్ ఫీచర్లు.. క్యాప్షన్‌తో ఫార్వార్డ్ మీడియా ఆప్షన్ వచ్చేసింది.. చెక్ చేశారా?

WhatsApp Two New Features : ప్రముఖ మెసేంజర్ యాప్ వాట్సాప్ (Whatsapp) మెరుగైన అనుభవాన్ని అందించేందుకు యూజర్ల కోసం రెండు కొత్త ఫీచర్లను రిలీజ్ చేసింది. మెసేజింగ్ యాప్ ఇప్పుడు iOS యూజర్లను క్యాప్షన్‌తో మీడియాను ఫార్వార్డ్ చేసేందుకు అనుమతిస్తుంది.

WhatsApp Two Features : వాట్సాప్‌లో రెండు కొత్త ఇంట్రెస్టింగ్ ఫీచర్లు.. క్యాప్షన్‌తో ఫార్వార్డ్ మీడియా ఆప్షన్ వచ్చేసింది.. చెక్ చేశారా?

WhatsApp is rolling out two new features _ Forward media with caption and more

WhatsApp Two New Features : ప్రముఖ మెసేంజర్ యాప్ వాట్సాప్ (Whatsapp) మెరుగైన అనుభవాన్ని అందించేందుకు యూజర్ల కోసం రెండు కొత్త ఫీచర్లను రిలీజ్ చేసింది. మెసేజింగ్ యాప్ ఇప్పుడు iOS యూజర్లను క్యాప్షన్‌తో మీడియాను ఫార్వార్డ్ చేసేందుకు అనుమతిస్తుంది. అలాగే, ఆండ్రాయిడ్ యూజర్లు తమ WhatsAppలో తమకు తామే మెసేజ్ పంపుకోవచ్చు. కొత్త వాట్సాప్ ఫీచర్‌ల గురించి మరిన్ని వివరాలను ఇప్పుడు పరిశీలిద్దాం.

వాట్సాప్ మీడియా ఫార్వర్డ్ ఫీచర్ ( Forward Media) :
వాట్సాప్ (WhatsApp) ఇప్పుడు iOS యూజర్లకు ఏదైనా ఫొటో లేదా వీడియోను క్యాప్షన్‌తో ఫార్వార్డ్ చేసేందుకు అనుమతిస్తుంది. ఇప్పుడు, మీరు మీడియాను ఫార్వార్డ్ చేసేందుకు ప్రయత్నించినప్పుడు.. యాప్ దిగువన కొత్త క్యాప్షన్ బాక్స్‌ (New Caption Box)ను చూపుతుంది. మీరు క్యాప్షన్‌లో ఏమీ రాయకూడదనుకుంటే దాన్ని కూడా తొలగించవచ్చు. లేటెస్ట్ ఫీచర్ iOS 22.23.77 వెర్షన్‌లో కనిపిస్తుంది. మీరు ఇంకా ఈ ఫీచర్‌ని అందుకోకపోతే.. ప్లాట్‌ఫారమ్ ఇప్పటికే దీన్ని రిలీజ్ చేసింది. మీరు రాబోయే రోజుల్లో లేదా వారాల్లో ఈ కొత్త ఫీచర్ పొందే అవకాశం ఉంది.

WhatsApp is rolling out two new features _ Forward media with caption and more

WhatsApp is rolling out two new features _ Forward media with caption and more

Read Also : WhatsApp Self Chat : వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. ఇకపై మీకు మీరే మెసేజ్ పంపుకోవచ్చు.. ఇదిగో ప్రాసెస్..!

వాట్సాప్ సెల్ఫ్ చాట్ ఫీచర్ (WhatsApp Self-Chat) :
వాట్సాప్ నోట్స్ (Whatsapp Notes), మెసేజ్‌లను ట్రాక్ చేసేందుకు WhatsApp ఇప్పుడు దాని యూజర్లకు యాప్‌లో మెసేజ్ పంపుకోవడానికి అనుమతిస్తుంది. సరళంగా చెప్పాలంటే.. ప్లాట్‌ఫారమ్ దానిని నోట్‌ప్యాడ్‌ (Notepad)గా ఉపయోగించేందుకు మిమ్మల్ని అనుమతిస్తుంది. మీరు కొన్ని ముఖ్యమైన మెసేజ్‌లను సులభంగా యాక్సెస్ చేసేందుకు వాటిని Pin చేయవచ్చు లేదా Star చేయవచ్చు. మీకు సంబంధించిన మెసేజ్‌లు, సాధారణ చాట్‌ల వలె కనిపిస్తాయి, కానీ మీరు ఆడియో కాల్‌లు, వీడియో కాల్‌లు, మ్యూట్ నోటిఫికేషన్‌లు పంపలేరు.

WhatsApp is rolling out two new features _ Forward media with caption and more

WhatsApp is rolling out two new features _ Forward media with caption

అలాగే మీరు Last Seen online కూడా చూడలేరని కంపెనీ తెలిపింది. మీరు మీ సొంత వాట్సాప్ నంబర్‌కు మెసేజ్‌లను పంపుతే మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ ఫీచర్‌ని వినియోగించే వారు దీన్ని చాలా త్వరగా యాక్సెస్ చేయవచ్చు. వాట్సాప్ యాప్‌ని ఓపెన్ చేసి.. స్క్రీన్ కుడి దిగువ మూలన ఉన్న కొత్త చాట్ ఐకాన్‌పై నొక్కండి. దీని తర్వాత, WhatsApp మీ కాంటాక్టుల లిస్టును చూడవచ్చు. మీ చాట్‌ని క్రియేట్ చేసేందుకు మీ పేరు లేదా ఫోన్ నంబర్‌ను సెర్చ్ చేయడం లేదా ఎంచుకోవాలి.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : WhatsApp Self Chat : వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. ఇకపై మీకు మీరే మెసేజ్ పంపుకోవచ్చు.. ఇదిగో ప్రాసెస్..!