Whatsapp New Update: వాట్సాప్ యూజర్లకు గుడ్‌న్యూస్.. ఇకపై గ్రూపులో 1024 మందికి అనుమతి.. త్వరలోనే అందుబాటులోకి

వాట్సాప్‌ గ్రూప్‌లో ఇప్పుడున్న సభ్యుల సంఖ్య త్వరలో రెట్టింపు కాబోతుంది. మరికొద్ది రోజుల్లో ఒక గ్రూపులో 1024 మంది సభ్యుల వరకు చేరవచ్చు. దీనితోపాటు మరిన్ని కొత్త ఫీచర్స్ త్వరలో రానున్నాయి.

Whatsapp New Update: వాట్సాప్ యూజర్లకు గుడ్‌న్యూస్.. ఇకపై గ్రూపులో 1024 మందికి అనుమతి.. త్వరలోనే అందుబాటులోకి

Whatsapp New Update: వాట్సాప్ యూజర్లకు గుడ్‌న్యూస్ అందించింది ఆ కంపెనీ మాతృ సంస్థ అయిన ‘మెటా’. త్వరలో వాట్సాప్ గ్రూపులో 1024 మందిని యాడ్ చేసుకునే అవకాశం కల్పించనుంది. ప్రస్తుతం ఒక గ్రూపులో 512 మందికి మాత్రమే అవకాశం ఉన్న సంగతి తెలిసిందే.

Videos of Girls: అమ్మాయిల డామిట్రీలో సీసీ కెమెరా.. దుస్తులు మార్చుకుంటుండగా వీడియో రికార్డు.. యజమానిపై ఫిర్యాదు

త్వరలో గ్రూప్ మెంబర్స్ సంఖ్యను రెట్టింపు చేయనుంది. అంతకుముందు 256 మంది మాత్రమే గ్రూపులో ఉండేవారు. తర్వాత ఈ సంఖ్యను 512కు పెంచారు. ప్రస్తుతం 1024 మంది సభ్యులున్న ఈ ఫీచర్ కొందరు బీటా యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. టెస్టింగ్ ఫేజ్ పూర్తయిన తర్వాత ఈ ఫీచర్ అందరికీ అందుబాటులోకి వస్తుంది. దీని ద్వారా ఒకేసారి గ్రూపులో వెయ్యి మందికిపైగా సభ్యులతో చాట్ చేయొచ్చు. ఈ ఫీచర్‌తోపాటు త్వరలో గ్రూప్ అడ్మిన్ల కోసం అప్రూవల్ సిస్టమ్ కూడా తీసుకురాబోతుంది. దీని ద్వారా గ్రూపులోకి చేరేందుకు రిక్వెస్ట్ పంపిన యూజర్ల జాబితా.. పెండింగ్ పార్టిసిపెంట్స్ రూపంలో కనిపిస్తుంది. వీరిలోంచి అడ్మిన్ వీలునుబట్టి, సభ్యులను గ్రూపులో చేర్చవచ్చు. అలాగే కాల్ లింక్స్, వాయిస్ స్టేటస్ ఫీచర్లు కూడా త్వరలో రానున్నాయి.

Girl Drowns: నీటిలో మునిగిపోతున్న చెల్లిని కాపాడి ప్రాణాలు కోల్పోయిన అక్క

వాట్సాప్ కాల్ లింక్ ఫీచర్.. జూమ్, గూగుల్ మీట్ యాప్స్‌లాగా పనిచేస్తుంది. ఎవరినైనా గ్రూప్ కాల్‌లో చేర్చుకోవాలి అంటే వారికి కాల్ లింక్స్ పంపాలి. ఆ లింక్స్‌పై క్లిక్ చేయడం ద్వారా యూజర్లు గ్రూప్ కాల్స్‌లో జాయిన్ కావొచ్చు. ఇప్పటివరకు ఇమేజెస్, వీడియోస్ మాత్రమే స్టేటస్‌లుగా పెట్టుకునే వీలుండగా, త్వరలో వాయిస్ రికార్డింగులను కూడా సెట్ చేసుకోవచ్చు. వ్యూవన్స్ మెసేజ్ పంపితే, దాన్ని స్క్రీన్ షాట్ తీసుకోవడాన్ని బ్లాక్ చేసే మరో ఫీచర్ కూడా రాబోతుంది. ఈ ఫీచర్ ఎనేబుల్ చేసి, మెసేజ్ సెండ్ చేస్తే.. రిసీవర్స్ ఆ మేసేజ్‌ను స్క్రీన్ షాట్ తీసుకోలేరు.