WhatsApp Redesign : వాట్సాప్ కొత్త డిజైన్ వచ్చేస్తోంది.. UI పూర్తిగా మార్చేస్తోంది.. మరెన్నో ఫీచర్లు..!

WhatsApp Redesign : వాట్సాప్ (Whatsapp) యూజర్లకు అలర్ట్.. త్వరలో వాట్సాప్ యూజర్ ఇంటర్‌ఫేస్ (UI) పూర్తిగా మార్చేయనుంది. వాట్సాప్ యూజర్లకు సరికొత్త డిజైన్ అందించనుంది. మరెన్నో ఆకర్షణీయమైన ఫీచర్లను యాడ్ చేయనుంది.

WhatsApp Redesign : వాట్సాప్ కొత్త డిజైన్ వచ్చేస్తోంది.. UI పూర్తిగా మార్చేస్తోంది.. మరెన్నో ఫీచర్లు..!

WhatsApp Redesign (Photo : Credit (Whatsapp)

WhatsApp Redesign : ప్రముఖ మెటా యాజమాన్యంలోని ఇన్‌స్టంట్ యాప్ వాట్సాప్ (Whatsapp) ఎప్పటికప్పుడూ సరికొత్త ఫీచర్లను ప్రవేశపెడుతోంది. వాట్సాప్ తమ యూజర్లను ఆకట్టుకునేందుకు కొత్త అప్‌డేట్స్ తీసుకొస్తోంది. ఇప్పటికే కొన్ని ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చిన వాట్సాప్.. కొద్దిరోజుల్లో వాట్సాప్ డిజైన్ లుక్ మొత్తం మార్చేయనుంది. వాట్సాప్ యూజర్ ఇంటర్‌ఫేస్ (Whatsapp User Iterface) కొత్త డిజైన్ అందించనుంది. దీనికి సంబంధించి (WaBetaInfo) స్క్రీన్‌షాట్‌లను షేర్ చేసింది. వాట్సాప్ పూర్తిగా రీడిజైన్ కానుంది. యూజర్ చాటింగ్ ఎక్స్‌పీరియన్స్ మరింత మెరుగుపరచడానికి కొత్త ఫీచర్లు, ఆప్షన్‌లకు యాక్సెస్‌ను అందించే దిశగా పనిచేస్తోంది.

ఆండ్రాయిడ్ (Android) యూజర్లకు వాట్సాప్ బీటా వెర్షన్‌ కూడా అందుబాటులో ఉంది. ఈ ప్లాట్‌ఫారమ్ యాప్ యూజర్ ఇంటర్‌ఫేస్‌ను అడ్జెస్ట్ చేయనుంది. ఈ క్రమంలో యాప్ దిగువన కొత్త నావిగేషన్ బార్‌ను పొందవచ్చు. చాట్‌లు, కాల్‌లు, కమ్యూనిటీలు, స్టేటస్ వంటి ట్యాబ్‌లు కొత్త ప్లేస్‌మెంట్, విజువల్ డిస్‌ప్లేతో కిందికి మారనున్నాయి.

Read Also : Whatsapp Lock Chats : వాట్సాప్‌లో కొత్త ప్రైవసీ ఫీచర్.. మీ చాట్ ఎవరూ చూడకుండా ఇలా లాక్ చేసుకోవచ్చు!

ఇకపై, వాట్సాప్ యూజర్లు యాప్ దిగువ నుంచి వాట్సాప్ వివిధ సెక్షన్లను త్వరగా నావిగేట్ చేసుకోవచ్చు. ప్రస్తుతం, ఈ ట్యాబ్‌లన్నింటినీ యాప్ పైభాగంలో చూడవచ్చు. ప్రస్తుత రోజుల్లో స్మార్ట్‌ఫోన్‌లు భారీ డిస్‌ప్లేలతో మార్కెట్లోకి వస్తున్నాయి. వాట్సాప్ ట్యాబ్‌ల మధ్య మారడం కొందరి యూజర్లకు కష్టంగా ఉండవచ్చు.

WhatsApp to get a redesign, will the user interface completely change

WhatsApp Redesign (Photo : Credit (Whatsapp)

నివేదిక ప్రకారం.. వాట్సాప్ ఫీచర్‌లతో యూజర్లకు అద్భుతమైన ఎక్స్‌పీరియన్స్ అందించేందుకు వాట్సాప్ అనేక మార్పులు చేస్తోందని పేర్కొంది. స్క్రీన్‌షాట్‌లను సూచించే ఒక చిన్న రీడిజైన్ కావచ్చు. ప్రస్తుతానికి, వాట్సాప్ సెట్టింగ్‌ (Settings) సెక్షన్‌లో కూడా మార్పులు చేస్తుందా లేదా అనేది క్లారిటీ లేదు. కొన్ని ఫీచర్‌లకు మెరుగైన యాక్సెస్‌ను అందించే కాంటాక్టు డేటా సెక్షన్లలో మార్పులు చేస్తుందా అనేది వివరాలు లేవు. భవిష్యత్తులో వాట్సాప్ ఎలాంటి మార్పులు చేయనుందో చూడాలి. ఆండ్రాయిడ్ 2.23.8.4 అప్‌డేట్‌ తర్వాత వాట్సాప్ బీటాలో కొత్త డిజైన్ మారనుంది.

అంతేకాకుండా, వాట్సాప్ మిమ్మల్ని చాట్‌లను లాక్ చేసేందుకు హైడ్ చేయడానికి అనుమతించే ప్రైవసీ ఫీచర్‌పై కూడా పని చేస్తోంది. వాట్సాప్‌లోని కాంటాక్ట్ ఇన్ఫో సెక్షన్‌లో చాట్‌ను లాక్ చేసే ఆప్షన్ కనిపిస్తుంది. వాట్సాప్ వ్యక్తిగత యూజర్లు తమ చాట్ కోసం పాస్‌కోడ్ (Passcode), వేలిముద్ర లాక్‌ (Finger Print Lock) సెట్ చేయవచ్చు. మీరు నిర్దిష్ట చాట్‌ల కోసం ఈ ఫీచర్‌ని ఎనేబుల్ చేసిన తర్వాత యాప్ సులభంగా హైడ్ చేసేందుకు పైన లాక్ చాట్ సెక్షన్ యాడ్ చేయనుంది. ఈ సెక్షన్ హైడ్ చేసే అవకాశం కూడా ఉంది. వాట్సాప్ ఇప్పటికే లాక్ చేసే అవకాశాన్ని అందిస్తోంది. చాట్ లాక్ ఫీచర్ యూజర్లకు అదనపు సెక్యూరిటీని అందిస్తుంది. రాబోయే ఫీచర్ డబుల్ సెక్యూరిటీని కలిగిన నిర్దిష్ట చాట్‌లను లాక్ చేసేందుకు మిమ్మల్ని అనుమతిస్తుంది. ఈ ఫీచర్ స్కామర్ల నుంచి రక్షిస్తుంది. ఈ లాక్ ఫీచర్ భవిష్యత్తులో అందరి యూజర్లకు అందుబాటులోకి వస్తుందని నివేదిక తెలిపింది.

Read Also : Samsung Galaxy A24 Launch : శాంసంగ్ గెలాక్సీ A24 ఫోన్ కీలక ఫీచర్లు లీక్.. లాంచ్ ఎప్పుడు? ధర ఎంత ఉండొచ్చుంటే?