Whatsapp Lock Chats : వాట్సాప్‌లో కొత్త ప్రైవసీ ఫీచర్.. మీ చాట్ ఎవరూ చూడకుండా ఇలా లాక్ చేసుకోవచ్చు!

Whatsapp Lock Chats : వాట్సాప్ (Wabetainfo) నివేదిక ప్రకారం.. చాట్ లాక్ చేసినప్పుడు యూజర్ మాత్రమే వారి ఫింగర్ ఫ్రింట్ లేదా పాస్‌కోడ్‌ని ఉపయోగించి చాట్ యాక్సెస్ చేయొచ్చు. ఎవరైనా మీ చాట్‌ను ఓపెన్ చేయడం దాదాపు అసాధ్యమే.

Whatsapp Lock Chats : వాట్సాప్‌లో కొత్త ప్రైవసీ ఫీచర్.. మీ చాట్ ఎవరూ చూడకుండా ఇలా లాక్ చేసుకోవచ్చు!

WhatsApp will soon let you lock chats and hide them from people who borrow your phone occasionally

Whatsapp Lock Chats : ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం మెటా (Meta) యాజమాన్యంలోని ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ (Whatsapp) సరికొత్త ప్రైవసీ ఫీచర్ తీసుకొస్తోంది. ఈ కొత్త ఫీచర్ ద్వారా యూజర్ల తమ చాట్లను హైడ్ చేసుకోవచ్చు. అంటే.. తమ వాట్సాప్ చాట్స్‌ను ఎవరూ చూడకుండా లాక్ వేసుకోవచ్చు అనమాట.. అదే.. వాట్సాప్ లాక్ చాట్ (Whatsapp Lock Chat) ఫీచర్.. ప్రస్తుతం వాట్సాప్ ఈ కొత్త ఫీచర్‌పై వర్క్ చేస్తోందని (Wabetainfo) నివేదిక తెలిపింది. ఈ ఫీచర్ ప్రస్తుతం ఆండ్రాయిడ్ బీటా వెర్షన్‌లో మాత్రమే టెస్టింగ్ చేస్తోంది.

వాట్సాప్ రెగ్యులర్ యూజర్ల కోసం ఇప్పట్లో రిలీజ్ చేయదని చెప్పవచ్చు. ఈ కొత్త ఫీచర్ ద్వారా యూజర్లు తమ ప్రైవేట్ చాట్‌లను చాట్ కాంటాక్ట్ లేదా గ్రూప్ ఇన్‌ఫోలో లాక్ చేసుకునేందుకు వీలు కల్పిస్తుందని తెలిపింది. వాట్సాప్ యూజర్లు తమ వ్యక్తిగత చాట్‌లను ఎవరూ చూడకుండా ఫుల్ కంట్రోల్ కలిగి ఉంటారు. యూజర్ ప్రైవసీతో పాటు సెక్యూరిటీని కూడా అందిస్తోంది. చాట్ లాక్ చేసినప్పుడు.. యూజర్ మాత్రమే తమ ఫింగర్ ఫ్రింట్ లేదా పాస్‌కోడ్‌ని ఉపయోగించి చాట్ యాక్సెస్ చేయవచ్చు. దీని వలన ఎవరైనా చాట్‌ను ఓపెన్ చేయడం దాదాపు అసాధ్యమనే చెప్పాలి.

Read Also : WhatsApp iPhone Users : ఐఫోన్ యూజర్లకు గుడ్‌న్యూస్.. వాట్సాప్‌లో పంపిన మెసేజ్‌లను కూడా ఎడిట్ చేసుకోవచ్చు!

అవసరమైన అథెంటికేషన్ ఇవ్వకుండా ఎవరైనా యూజర్ ఇతరుల ఫోన్‌ని యాక్సెస్ చేసేందుకు ప్రయత్నిస్తే.. చాట్ లాక్ తీసేందుకు చూస్తే.. చాట్‌ను క్లియర్ చేయమంటూ ఒక ప్రాంప్ట్ కనిపిస్తుంది. లాక్ చాట్ ఫీచర్ లాక్ చేసిన చాట్‌లో పంపిన ఫొటోలు, వీడియోలు ఆటోమాటిక్‌గా డివైజ్ గ్యాలరీలో సేవ్ కావని గమనించాలి.

WhatsApp will soon let you lock chats and hide them from people who borrow your phone occasionally

Whatsapp Lock Chats : WhatsApp will soon let you lock chats and hide them from people

ఈ అదనపు ప్రొటెక్షన్ లేయర్ సున్నితమైన మీడియాను ఎవరూ చూడకుండా నిరోధిస్తుంది. యూజర్లకు మరింత ప్రైవసీని అందిస్తుంది. ఈ లాక్ చాట్ ఫీచర్ ఇంకా డెవలప్ స్టేజ్‌లో ఉంది. వాట్సాప్ ఎప్పుడు రిలీజ్ చేసేది కూడా కంపెనీ ఇంకా ప్రకటించబడలేదు. అయితే, ఈ ఫీచర్ (WhatsApp)లో ప్రైవసీని మెరుగుపరచడానికి అందించనుంది. యూజర్ల చాట్, అందులోని మీడియాపై ఎక్కువ కంట్రోల్ అందిస్తుంది.

లాక్ చాట్ ఫీచర్‌తో పాటు, ఆండ్రాయిడ్ బీటాలో కొంతమంది బీటా టెస్టర్ల కోసం వాట్సాప్ కొత్త టెక్స్ట్ ఎడిటర్ ఎక్స్ పీరియన్స్ కూడా టెస్టింగ్ చేస్తోంది. ఈ కొత్త టెక్స్ట్ ఎడిటర్ టైపింగ్ ఎక్స్‌పీరియన్స్ అందించనుంది. యూజర్లకు అదనపు ఫార్మాటింగ్ ఆప్షన్లను అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఇటీవల వాట్సాప్‌కు ప్రైవసీ, సెక్యూరిటీపై ఆందోళన కలిగించే అంశాలపై ప్రత్యేకించి కొత్త ప్రైవసీ విధానాలను అమలు చేస్తోంది. యూజర్లకు డేటా సురక్షితంగా ఉందని భరోసా వాట్సాప్ ఈ దిశగా కృషి చేస్తోంది. యూజర్ ప్రైవసీని ప్రొటెక్ట్ చేయడానికి వాట్సాప్ అమలు చేస్తున్న అనేక చర్యలలో లాక్ చాట్ ఫీచర్ ఒకటిగా చెప్పవచ్చు. వాట్సాప్ ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ మెసేజ్ పంపినవారు, పొందిన వారు మాత్రమే చదవగలరు. తద్వారా వాట్సాప్ చాట్‌ను ఇతరులు యాక్సస్ చేయడం కుదరదు.

Read Also : WhatsApp Desktop Chats : మీ సిస్టమ్‌లో వాట్సాప్ మెసేజ్‌లను ఎవరైనా పదేపదే చూస్తున్నారా? ఈ సింపుల్ ట్రిక్‌తో చాట్స్ బ్లర్ చేయొచ్చు..!