Samsung Galaxy A24 Launch : శాంసంగ్ గెలాక్సీ A24 ఫోన్ కీలక ఫీచర్లు లీక్.. లాంచ్ ఎప్పుడు? ధర ఎంత ఉండొచ్చుంటే?

Samsung Galaxy A24 Launch : సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ (Samsung) గెలాక్సీ A సిరీస్ నుంచి కొత్త ఫోన్ వస్తోంది. ఈ ఫోన్ అధికారిక లాంచ్‌కు ముందే కీలక ఫీచర్లు లీకయ్యాయి.

Samsung Galaxy A24 Launch : శాంసంగ్ గెలాక్సీ A24 ఫోన్ కీలక ఫీచర్లు లీక్.. లాంచ్ ఎప్పుడు? ధర ఎంత ఉండొచ్చుంటే?

Samsung Galaxy A24 New Design (Photo Credit : Samsung)

Samsung Galaxy A24 Launch : ప్రముఖ సౌత్ కొరియన్ దిగ్గజం (Samsung) అనేక సరికొత్త స్మార్ట్‌ఫోన్లను ప్రవేశపెడుతోంది. గ్లోబల్ మార్కెట్లో తమ గెలాక్సీ A సిరీస్ మోడల్ ఫోన్లను విస్తరిస్తోంది. ఇప్పటివకే భారత్ సహా పలు మార్కెట్లో గెలాక్సీ A14, A34 సర్వీసులను లాంచ్ చేసింది. లేటెస్టుగా శాంసంగ్ గెలాక్సీ A24 సిరీస్ ఫోన్ లాంచ్ చేయనుంది. అయితే, ఈ ఫోన్ అధికారిక లాంచ్‌కు ముందే కీలక ఫీచర్లు లీకయ్యాయి. షెడ్యూల్ ప్రకారం.. (Samsung Galaxy A24) అధికారికంగా టర్కీలో లాంచ్ కానుందని ధృవీకరించారు.

దక్షిణ కొరియా మొబైల్ తయారీ సంస్థ గెలాక్సీ A-సిరీస్ స్మార్ట్‌ఫోన్ లైనప్‌ను విస్తరిస్తోంది. శాంసంగ్ గెలాక్సీ (Galaxy A14), (Galaxy A34 5G), (Galaxy A54 5G) స్మార్ట్‌ఫోన్‌లను కంపెనీ ఇటీవల లాంచ్ చేసింది. గెలాక్సీ A24 4G గతంలో అనేక సర్టిఫికేషన్ వెబ్‌సైట్‌లు, డేటాబేస్‌లలో కనిపించింది. నెక్స్ట్ గెలాక్సీ A-సిరీస్ హ్యాండ్‌సెట్ ఫీచర్లకు సంబంధించి మల్టీ లీక్‌లు బయటకు వచ్చాయి. ఈ కొత్త నివేదిక ప్రకారం.. రాబోయే డివైజ్ కొన్ని డిజైన్ రెండర్‌లను సూచిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ మరికొన్ని స్పెసిఫికేషన్‌లతో రానుంది.

Read Also : Samsung Galaxy Z Fold 5 : శాంసంగ్ నుంచి రెండు కొత్త మడతబెట్టే ఫోన్లు.. లాంచ్‌కు ముందే ఫీచర్లు లీక్..!

(TechOutlook) నివేదిక ప్రకారం.. శాంసంగ్ Galaxy A24 ఏప్రిల్ చివరి నాటికి ప్రపంచవ్యాప్తంగా లాంచ్ అవుతుందని అంచనా. దీని ధర సుమారు 190 డాలర్లు (దాదాపు రూ. 16వేలు) ఉండవచ్చు. అదే సమయంలో ఈ ఫోన్ భారతీయ మార్కెట్‌లో లాంచ్ అవుతుందని నివేదిక తెలిపింది. గత లీక్‌ల ప్రకారం.. మోడల్ బ్లాక్, డార్క్ రెడ్, లైట్ గ్రీన్, సిల్వర్ అనే 4 కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంటుందని సూచించింది. కొత్తగా లీక్ అయిన రెండర్‌లలో బ్లాక్, గ్రీన్ వేరియంట్‌లు కనిపిస్తాయి.

Samsung Galaxy A24 New Design Renders, Key Specifications Leaked _ Report

Samsung Galaxy A24 New Design (Photo Credit : Samsung)

రాబోయే (Samsung) A-సిరీస్ డివైజ్ 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.5-అంగుళాల Full-HD+ (1080 x 2408) LCD డిస్‌ప్లే ప్యానెల్‌ను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. పైన వన్ UI5తో ఆండ్రాయిడ్ 13తో వస్తుందని భావిస్తున్నారు. శాంసంగ్ (Galaxy A2) ఆక్టా-కోర్ MediaTek Helio G99 SoC ద్వారా పనిచేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 4GB RAM, 128GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో కూడా వస్తుందని భావిస్తున్నారు.

Galaxy A24 డివైజ్.. ట్రిపుల్ వెనుక కెమెరా యూనిట్‌లో 50-MP ప్రైమరీ సెన్సార్, 5-MP అల్ట్రా-వైడ్ లె,న్స్ 2-MP మాక్రో లెన్స్ ఉన్నాయి. వెనుక ప్యానెల్‌కు ఎగువ-ఎడమవైపున ఒకే సర్య్కూలర్ కటౌట్‌లలో నిలువుగా ఉంటాయి. ఈ నివేదికలో డిజైన్ రెండర్‌ల ప్రకారం.. కెమెరా మాడ్యూల్స్ పక్కన సర్క్యూలర్ LED ఫ్లాష్ యూనిట్ ఉంది. 13-MP ఫ్రంట్ కెమెరా డిస్ప్లే పైభాగంలో సెంటర్డ్ వాటర్‌డ్రాప్ నాచ్‌లో ఉంటుంది.

శాంసంగ్ Galaxy A24 15W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీని అందిస్తుందని భావిస్తున్నారు. నివేదిక ప్రకారం.. ప్లాస్టిక్ బాడీలో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంటుంది, బహుశా.. ఈ డివైజ్ 3.5mm ఆడియో జాక్‌తో కూడా వస్తుందని భావిస్తున్నారు. 195 గ్రాముల బరువున్న డివైజ్ 162.1mm x 77.6mm x 8.3mm పరిమాణంలో ఉండనుంది.

Read Also : Infinix Note 30 Specifications : ఇన్ఫినిక్స్ నోట్ 30 ఫోన్ వస్తోంది.. లాంచ్‌కు ముందే కీలక ఫీచర్లు లీక్.. పూర్తి వివరాలు ఇవే!