WhatsApp Trick : వాట్సాప్‌లో ఎవరైనా మెసేజ్ పంపి వెంటనే డిలీట్ చేశారా? ఆ మెసేజ్ ఏంటో ఈజీగా తెలుసుకోవచ్చు!

WhatsApp Trick : మీరు ఈ వాట్సాప్ ఫీచర్‌ విషయంలో అసంతృప్తగా ఉన్నారా? డిలీట్ చేసిన అన్ని మెసేజ్‌లను చదవాలనుకుంటున్నారా? మీరు ఈ కింది విధంగా ఫాలో అయితే డిలీట్ మెసేజ్‌లను సులభంగా తెలుసుకోవచ్చు.

WhatsApp Trick : వాట్సాప్‌లో ఎవరైనా మెసేజ్ పంపి వెంటనే డిలీట్ చేశారా? ఆ మెసేజ్ ఏంటో ఈజీగా తెలుసుకోవచ్చు!

WhatsApp Trick How to read deleted messages

WhatsApp Trick : ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేంజర్ యాప్ వాట్సాప్ (Whatsapp) ప్రపంచంలో అత్యధికంగా ఉపయోగించే మెసేజింగ్ యాప్‌లలో ఒకటి.. మెసేజింగ్ యాప్‌లో ఆసక్తికరమైన ముఖ్యమైన ఫీచర్‌లు ఎన్నో ఉన్నాయి. ప్రపంచంలో ఎవరికైనా వీడియో లేదా వాయిస్ కాల్‌లు చేయవచ్చు. వాయిస్ మెసేజ్‌లను కూడా పంపుకోవచ్చు. కంపెనీ ఫోటోలు లేదా వీడియోలను ఎక్స్ఛేంజ్ చేసేందుకు అనుమతించే ఆప్షన్ కూడా చేర్చింది.

వాట్సాప్‌లో ఏదైనా మెసేజ్‌ని డిలీట్ చేసే ఆప్షన్ కూడా యూజర్లకు అందించనుంది. వాట్సాప్ కాంటాక్ట్‌లతో లైవ్ లొకేషన్‌ను షేర్ చేసేందుకుకూడా ఒక మార్గం ఉంది. యూజర్లు WhatsAppలో ఎవరికైనా పేమెంట్స్ చేయవచ్చు. మీరు మీ ఫోన్ అడ్రస్ బుక్ నుంచి కాంటాక్టులను కూడా షేర్ చేయవచ్చు. వాట్సాప్‌లో ఫోటోను పంపడానికి ఈ యాప్‌ని ఉపయోగించి ఫోటోలను కాప్చర్ చేయవచ్చు.

WhatsApp Trick How to read deleted messages

WhatsApp Trick How to read deleted messages

ఈ ఫీచర్లు చాట్‌లో ఇన్‌స్టంట్ అందుబాటులో ఉంటాయి. ఎవరితోనైనా వీలైనంత వేగంగా కనెక్ట్ అయ్యేందుకు అవకాశం కల్పిస్తుంది. కానీ, వాట్సాప్ మెసేజ్ డిలీటెడ్ ఫీచర్ ఉంది. యాప్‌లోని ఏదైనా మెసేజ్ పంపిన రెండు రోజుల తర్వాత కూడా డిలీట్ చేసేందుకు ప్లాట్‌ఫారమ్ యూజర్లను అనుమతిస్తుంది. మెసేజ్ డిలీట్ చేసినట్టుగా రిసీవర్‌కు తెలిసేలా యాప్ చాట్‌లో డిలీటెడ్ అనే మెసేజ్ కూడా కనిపిస్తుంది. ఇంతకీ వాట్సాప్‌లో ఏ మెసేజ్ పంపారు? ఎందుకు డిలీట్ చేశారు అనేది తెలియకపోవచ్చు. ఆ మెసేజ్ ఏమై ఉంటుంది అనేది ప్రతిఒక్కరికి తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటుంది.

మెటా యాజమాన్యంలోని ఇన్‌స్టాగ్రామ్ (Instagram) వంటి ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు కూడా ఈ “Delete Message” ఫీచర్‌ను అందిస్తున్నాయి. యాప్ డిలీట్ చేసిన మెసేజ్ గురించి రిసీవర్‌ని ఎప్పటికీ అలర్ట్ చేస్తుంది. ఈ ఫీచర్ ఎలా పని చేయాలి. పంపిన మెసేజ్ ఏమిటి? ఎందుకు డిలీట్ చేయాల్సి వచ్చిందో వివరించాల్సిన అవసరం లేదని వాట్సాప్ అభిప్రాయం..

యూజర్లు పంపిన మెసేజ్ తప్పిదాన్ని గుర్తించిన తర్వాత మళ్లీ మెసేజ్ పంపడానికి WhatsApp ఈ ఫీచర్‌ను అందించింది. కాబట్టి, మీరు ఈ వాట్సాప్ ఫీచర్‌ విషయంలో అసంతృప్తగా ఉన్నారా? డిలీట్ చేసిన అన్ని మెసేజ్‌లను చదవాలనుకుంటున్నారా? మీరు ఈ కింది విధంగా ఫాలో అయితే డిలీట్ మెసేజ్‌లను సులభంగా తెలుసుకోవచ్చు. అందుకోసం మీరు Google Play Store ద్వారా థర్డ్-పార్టీ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంతకీ అదేలా పనిచేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

WhatsApp Trick How to read deleted messages

WhatsApp Trick How to read deleted messages

డిలీట్ అయిన వాట్సాప్ మెసేజ్‌లను మొబైల్‌లో ఇలా చూడొచ్చు :
* Google Play Store నుంచి ”Get Deleted Messages” యాప్‌ను ఇన్‌స్టాల్ చేయండి.
* మీరు ఇప్పుడు యాప్‌కి కొన్ని Allow పర్మిషన్స్ ఇవ్వాల్సి ఉంటుంది.
* WhatsAppలో మెసేజ్ డిలీట్ చేసినప్పుడల్లా మీరు ఈ యాప్ ద్వారా ఆ మెసేజ్ ఏంటో చూడవచ్చు.

Note : ఈ యాప్ వర్క్ చేయాలంటే మీ ఫోన్‌లో (Allow) పర్మిషన్స్ అవసరం. మీరు దాన్ని మీ ఫోన్ Settings > Apps & Notificationsలలో ఎప్పుడైనా మార్చవచ్చు. యాప్ నోటిఫికేషన్, స్టోరేజ్ కోసం కూడా Allow చేయాల్సి ఉంటుంది.

ఈ థర్డ్ పార్టీ యాప్ మీ ఫోన్ నోటిఫికేషన్‌ల ప్యానెల్ నుంచి ఏదైనా పంపినవారి మెసేజ్‌లను ట్రాక్ చేస్తుంది. ఆపై మీకు ఆ మెసేజ్ కూడా చూపిస్తుందని గుర్తించుకోండి. మీరు నోటిఫికేషన్‌లకు Allow ఇవ్వవలసి ఉంటుంది. మీరు ఒక యూజర్ WhatsApp చాట్‌ని ఓపెన్ చేసినప్పుడు అందులో ఏదైనా మెసేజ్ డిలీట్ అయితే మీరు చదవలేరని గుర్తించుకోండి.

ఎందుకంటే థర్డ్ పార్టీ యాప్ మీ WhatsAppలో ఉన్న వెంటనే నోటిఫికేషన్ నుంచి మెసేజ్‌లను డిస్‌ప్లే చేస్తుంది. మెసేజ్‌లు డిలీట్ అయిన తర్వాత అవి WhatsAppలో కనిపించవు. కానీ, మీరు వాట్సాప్‌లో డిలీట్ చేసిన మెసేజ్‌లను “Get Deleted Messages” యాప్‌లో మాత్రం చూడవచ్చు.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : WhatsApp Update Fix : వాట్సాప్‌ యూజర్లకు అలర్ట్.. ఆ వెర్షన్‌లో డేంజరస్ బగ్.. ఇప్పుడే అప్‌డేట్ చేసుకోండి..!