WhatsApp Update Fix : వాట్సాప్ యూజర్లకు అలర్ట్.. ఆ వెర్షన్‌లో డేంజరస్ బగ్.. ఇప్పుడే అప్‌డేట్ చేసుకోండి..!
WhatsApp Update Fix : వాట్సాప్ (Whatsapp) యూజర్లకు అలర్ట్.. మీ వాట్సాప్ అప్‌డేట్ (Whatsapp Update) చేసుకున్నారా? లేదంటే ఇప్పుడే వాట్సాప్ అప్‌డేట్ చేసుకోండి. లేదంటే మీ విలువైన డేటా హ్యాకర్ల చేతికి చిక్కే రిస్క్ ఉంది. మెటా యాజమాన్యంలోని వాట్సాప్ ఇటీవల రిలీజ్ చేసిన (Whatsapp Latest Version) లేటెస్ట్ వెర్షన్‌లో డేంజరస్ బగ్ ఉందని గుర్తించింది.

WhatsApp fixes a critical vulnerability in latest version, wants users to update the app immediately
WhatsApp Update Fix : వాట్సాప్ (Whatsapp) యూజర్లకు అలర్ట్.. మీ వాట్సాప్ అప్‌డేట్ (Whatsapp Update) చేసుకున్నారా? లేదంటే ఇప్పుడే వాట్సాప్ అప్‌డేట్ చేసుకోండి. లేదంటే మీ విలువైన డేటా హ్యాకర్ల చేతికి చిక్కే రిస్క్ ఉంది. మెటా యాజమాన్యంలోని వాట్సాప్ ఇటీవల రిలీజ్ చేసిన (Whatsapp Latest Version) లేటెస్ట్ వెర్షన్‌లో డేంజరస్ బగ్ ఉందని గుర్తించింది. వెంటనే అప్రమత్తమైన వాట్సాప్ ఆ బగ్ ఫిక్స్ చేసినట్టు వెల్లడించింది. అయితే ఫిక్స్ చేసిన అప్‌డేట్ పొందాలంటే వాట్సాప్ యూజర్లందరూ తమ వాట్సాప్ యాప్ అప్‌డేట్ చేసుకోవాలని సూచిస్తోంది. యాప్ కొత్త వెర్షన్‌లో ప్యాచ్ ఉందని తెలిపింది.
ఇప్పటికీ యాప్ పాత వెర్షన్‌లో ఉన్న వాట్సాప్ వినియోగదారులు వెంటనే అప్లికేషన్‌ను అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. భద్రతా సలహాదారులపై WhatsApp పేజీ సెప్టెంబర్ అప్‌డేట్ బగ్ వంటి వివరాలను వెల్లడించింది. క్రిటికల్ బగ్ అనే ఇంటిజెర్ ఓవర్‌ఫ్లో ద్వారా కోడ్ ఎర్రర్‌ను ఉపయోగించేలా అనుమతించిందని వాట్సాప్ తెలిపింది. దీనికి సంబంధించి ప్రత్యేకంగా రూపొందించిన వీడియో కాల్‌ని పంపిన తర్వాత యూజర్ స్మార్ట్‌ఫోన్‌లో సొంత కోడ్‌ను అమలు చేసేందుకు అనుమతించిందని పేర్కొంది.

WhatsApp fixes a critical vulnerability in latest version, wants users to update
V2.22.16.12కి ముందు Android WhatsAppలో ఇంటిజెర్ ఓవర్‌ఫ్లో, v2.22.16.12కి ముందు Android బిజినెస్ v2.22.16.12కి ముందు iOS, v2.22.16.12కి ముందు iOS కోసం బిజినెస్ యాప్ యాక్సస్ రిమోట్‌కు దారితీయవచ్చునని తెలిపింది. వాట్సాప్ అప్‌డేట్‌లో పేర్కొంది. రిమోట్ కోడ్ అమలులో ఉంటే.. హ్యాకర్లు రిమోట్‌గా ఒకరి కంప్యూటింగ్ డివైజ్‌లో నుంచి ఆపరేట్ చేయగలరు. చివరికి ఈ మీ డివైజ్ మొత్తం హ్యాకర్ల కంట్రోల్ లోకి వెళ్లిపోతుంది.
వినియోగదారు మొత్తం వ్యక్తిగత డేటాను హ్యాకర్లు యాక్సెస్ చేయవచ్చు. అందుకే.. లేటెస్ట్ వాట్సాప్ వెర్షన్‌లోని లోపాన్ని ఫిక్స్ చేసినట్టు తెలిపింది. కాబట్టి, వాట్సాప్ యూజర్లు తమ యాప్‌ను వెంటనే అప్‌డేట్ చేసుకోవాలని సూచిస్తోంది. మీ WhatsApp యాప్ లేటెస్ట్ వెర్షన్‌కి ఆటోమేటిక్‌గా అప్‌డేట్ కాకపోతే.. యాప్ స్టోర్‌కి వెళ్లి కొత్త అప్‌డేట్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలని సూచిస్తోంది. అప్‌డేట్‌ని ఇన్‌స్టాల్ చేసే ముందు WiFi నెట్‌వర్క్‌కి కనెక్ట్ అయ్యేలా చూసుకోండి.

WhatsApp fixes a critical vulnerability in latest version, wants users to update
మరోవైపు.. వాట్సాప్ అనేక కొత్త ఫీచర్లను రిలీజ్ చేస్తోంది, లేటెస్టుగా “Call Links” ఆప్షన్ ఫీచర్ ఒకటి తీసుకొస్తోంది. సరికొత్త కాల్ లింక్‌ల ఫీచర్ అందుబాటులోకి వస్తే.. ఈ ఫీచర్ ద్వారా వినియోగదారులు తమ కాల్స్ ట్యాబ్‌లోని ‘Call Links’ ఆప్షన్ పై Tap చేయవచ్చు. ఆపై ఆడియో లేదా వీడియో కాల్ కోసం లింక్‌ను క్రియేట్ చేయవచ్చు.
ఆ తర్వాత కుటుంబ సభ్యులు, స్నేహితులతో సులభంగా షేర్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ పొందాలంటే WhatsApp యూజర్లు తమ యాప్‌ను లేటెస్ట్ వెర్షన్‌కి అప్‌గ్రేడ్ చేయాలి. ఆండ్రాయిడ్, iOS యూజర్ల కోసం ఈ వారం నుంచే ఈ కొత్త ఫీచర్ అందుబాటులోకి వస్తుందని కంపెనీ ధృవీకరించింది.
WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..