Boost Slow WiFi Speed : మీ వైఫై స్లోగా ఉందా? స్పీడ్ పెరగాలంటే ఈ 5 టిప్స్ ఫాలో అవ్వండి

భారతదేశంలో కరోనా కేసుల తీవ్రత ఎక్కువగా కనిపిస్తోంది. కరోనా కట్టడి కోసం ఢిల్లీ ఎన్‌సీఆర్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర సహా ఇతర రాష్ట్రాలు తాత్కాలిక లాక్‌డౌన్ అమలు చేస్తున్నాయి.

Boost Slow WiFi Speed : మీ వైఫై స్లోగా ఉందా? స్పీడ్ పెరగాలంటే ఈ 5 టిప్స్ ఫాలో అవ్వండి

Boost Slow Wifi Speed

Boost Slow WiFi Speed : భారతదేశంలో కరోనా కేసుల తీవ్రత ఎక్కువగా కనిపిస్తోంది. కరోనా కట్టడి కోసం ఢిల్లీ ఎన్‌సీఆర్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర సహా ఇతర రాష్ట్రాలు తాత్కాలిక లాక్‌డౌన్ అమలు చేస్తున్నాయి. పలు రాష్ట్రాల ప్రభుత్వాలు సైతం ప్రైవేటు కంపెనీలను వారి ఉద్యోగుల భద్రత కోసం వెంటనే వర్క్ ఫ్రమ్ హోం అమలు చేయాలని సూచిస్తున్నాయి. వర్క్ ఫ్రమ్ హోంలో ఇంటర్నెట్ కనెక్షన్ కావాలంటే ఉండాల్సింది ఒకే ఒకటి ఇంటర్నెట్ కనెక్షన్. నెట్ స్పీడ్ వైఫై స్పీడ్ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. మీ ఇంట్లో వాడే వైఫై స్పీడ్ స్లోగా ఉందా? వైఫై స్పీడ్ పెంచుకోవాలంటే ఈ కింది 5 టిప్స్ ఫాలో అవ్వండి.. అవేంటో ఓసారి ప్రయత్నించి చూద్దాం..

1. వైఫై రూటర్ స్విచ్ ఆఫ్ చేసి.. మళ్లీ ఆన్ చేయండి :
మీ ఇంట్లో రూటర్ వైఫై స్పీడ్ బూస్ట్ చేయాలంటే.. ఇదో సులభమైన మార్గం. రూటర్ టర్న్ ఆఫ్ చేసేయండి. మోడమ్ కూడా తొలగించి మళ్లీ కనెక్ట్ చేయండి. మోడమ్ ఇంటర్నెట్ సిగ్నల్స్, హోం నెట్ వర్క్, ఐసీపీ మధ్య సిగ్నల్స్ కలుపుతుంది. వైఫై స్పీడ్ స్లోగా ఉంటే.. మోడమ్ రీసెట్ చేస్తే చాలు.. వైఫై స్పీడ్ ఒక్కసారిగా పెరిగిపోతుంది.

2. రూటర్ అమర్చిన చోటు మార్చండి :
వైఫై స్పీడ్ పెంచుకోవడానికి ఇదో మార్గం.. చాలామంది తమకు తెలియకుండానే రూటర్ ఎక్కడపడితే అక్కడే అమరుస్తుంటారు. కొన్నిసార్లు వైఫై సిగ్నల్స్ గోడ, ఫ్లోర్ సీలింగ్స్, ఫర్నీచర్, పెద్దగా ఉండే వస్తువుల కారణంగా సరిగా అందవు. అందుకే వైఫై రూటర్ ఎప్పుడూ మీరు కూర్చొని పనిచేసే చోట దగ్గరగా ఉండేలా సెట్ చేసుకోండి.

3. రూటర్ ఎక్విప్ మెంట్ రిప్లేస్ చేసుకోండి :
వైఫై స్పీడ్ తగ్గడానికి చాలా కారణాలు ఉంటాయి. అందులో మోడమ్ ఇక్విప్ మెంట్ ఒకటి.. ఇది ఔట్ డేటెడ్ లేదా పాత అయితే వైఫై స్పీడ్ నెమ్మదిస్తుంది. పాతది పక్కన పడేసి.. కొత్త వైఫై రూటర్ కనొుగోలు చేసుకోండి. మోడమ్ కూడా మంచిది ఎంచుకోండి.

4. రూటర్ ఫ్రిమ్ వేర్ అప్ డేట్ చేయండి :
మీ వైఫై స్పీడ్ చాలా స్లోగా ఉందా? మీ రూటర్ ఫ్రిమ్ వేర్ అప్ డేట్స్ అందుబాటులో ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. అదే నిజమైతే.. మీ రూటర్ వెంటనే అప్ డేట్ చేసుకోండి. తద్వారా ఈ ఎక్విప్ మెంట్ అప్ డేట్ కావడంతో పాటు ఏదైనా బగ్స్ ఉంటే ఫిక్స్ అయిపోతాయి. సెక్యూరిటీ పరంగా ఎంతో బెటర్ కూడా.

5. రూటర్ యాంటెనా సరిచేయాలి :
మీ వైఫై రూటర్ యాంటినా సరిగా లేకపోయినా వైఫై స్లో అవుతుంది. వైఫై స్పీడ్ బూస్ట్ చేయాలంటే వెంటనే రూటర్ యాంటినా సరిగా సెట్ చేసుకోండి. సాధారణంగా రూటర్ యాంటినాలు ఒమిని డైరెక్షనల్ లోనే ఉంటాయి. అంటే.. యాంటెన్నాకు లంబంగా అన్ని దిశలలో సంకేతాలను పంపుతాయి. మీరు మీ Wi-Fi సిగ్నల్‌లను అనేక భవన అంతస్తులకు విస్తరించాల్సిన అవసరం పడితే యాంటెన్నాను తప్పక సర్దుబాటు చేసుకోవాలి.