ఎడిట్ బటన్‌పై ట్వీట్ వార్: ట్విట్టర్‌కు వికీపీడియా బర్త్‌డే విషెస్ 

ప్రముఖ సోషల్ మీడియా నెట్ వర్కింగ్ సర్వీసు ట్విట్టర్ పుట్టి మార్చి 21 నాటికి 33ఏళ్లు. 2006 మార్చి 21న శాన్ ఫ్రాన్సిస్ కోలో జాక్ డోర్సే క్రియేట్ చేశారు. అప్పటినుంచి 13ఏళ్లుగా ట్విట్టర్ తమ యూజర్లను ఆకట్టుకుంటోంది.

  • Published By: sreehari ,Published On : March 23, 2019 / 02:12 PM IST
ఎడిట్ బటన్‌పై ట్వీట్ వార్: ట్విట్టర్‌కు వికీపీడియా బర్త్‌డే విషెస్ 

ప్రముఖ సోషల్ మీడియా నెట్ వర్కింగ్ సర్వీసు ట్విట్టర్ పుట్టి మార్చి 21 నాటికి 33ఏళ్లు. 2006 మార్చి 21న శాన్ ఫ్రాన్సిస్ కోలో జాక్ డోర్సే క్రియేట్ చేశారు. అప్పటినుంచి 13ఏళ్లుగా ట్విట్టర్ తమ యూజర్లను ఆకట్టుకుంటోంది.

ప్రముఖ సోషల్ మీడియా నెట్ వర్కింగ్ సర్వీసు ట్విట్టర్ పుట్టి మార్చి 21 నాటికి 33ఏళ్లు. 2006 మార్చి 21న శాన్ ఫ్రాన్సిస్ కోలో జాక్ డోర్సే క్రియేట్ చేశారు. అప్పటినుంచి 13ఏళ్లుగా ట్విట్టర్ తమ యూజర్లను ఆకట్టుకుంటోంది. ట్విట్టర్ 13వ వార్షికోత్సవం సందర్భంగా ఆన్ లైన్ ఫ్రీ ఎన్ క్లోపీడీయా వికీపీడియా ట్విట్టర్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పింది. తమ అధికారిక ట్విట్టర్ అకౌంట్ పై ట్విట్టర్ కు విషెస్ చెప్పిన వికీపీడియా ఓ ఉచిత సలహా ట్వీట్ చేసింది. అంతే.. ఈ ట్వీట్ నెటిజన్ల కంటపడటంతో వికీపీడియాను ఏకిపారేశారు. ఇంతకీ వికీపీడియా ట్విట్టర్ కు బోధించిన పాఠాలు ఏంటో తెలుసుకుందాం రండి.. 13ఏళ్ల క్రితం ట్విట్టర్ ను ప్రవేశపెట్టారని, ట్విట్టర్ కు సంబంధించి వికీపీడియా అందించే సమాచారం ఇదిగో అంటూ వికీ లింక్ ను షేర్ చేసింది.
Read Also : మెసేజ్ ఫార్వాడ్ చేస్తున్నారా? : వాట్సాప్‌లో 3 కొత్త ఫీచర్లు వచ్చేస్తున్నాయ్

‘499 రోజుల నుంచి ట్విట్టర్ అకౌంట్ పై 140 క్యారెక్టర్ల కంటే ఎక్కువగా ట్వీట్ చేయగలుగుతున్నాం’ అని వికీ పీడియా ట్వీట్ చేసింది. 3వేల 110 రోజుల నుంచి ట్విట్టర్ ప్లాట్ ఫాంపై బర్డ్ లోగోను చూస్తున్నామని, అంతకంటే ముందు 1 వెయ్యి 756 రోజులుగా గౌతమ్ ఫాంట్ ను ట్విట్టర్ లో వాడుతున్నామంటూ వీకీపీడియా చెప్పుకొచ్చింది. ‘3వేల 612 రోజుల నుంచి మాత్రమే తొలిసారి మనకు ట్రెండింగ్ టాపిక్స్ ఆప్షన్ అందుబాటులోకి వచ్చింది’ అంటూ ఆఖరి ట్వీట్ లో వికీపీడియా తెలిపింది. 

‘33ఏళ్ల @ట్విట్టర్.. నువ్వొక యంగ్ సోషల్ ప్లాట్ ఫాం. వికీపీడియా లాంటి పాత తరం సైట్ నుంచి సలహాలు తీసుకుంటావా? లేదో.. అయితే వికీపీడియాలో ఉండే ఎడిట్ బటన్ రహాస్యం గురించి చెబుతాం వింటావా?’ అంటూ తమ సైట్ ఎడిట్ ఆప్షన్ స్ర్కీన్ షాట్ ను ట్వీట్ చేసింది. అంటే.. ఇక్కడ వికీపీడియా ఉద్దేశం ఏంటంటే.. తమ సైట్ లో ఎడిట్ బటన్ ఆప్షన్ ఉంది.. 13ఏళ్లు పూర్తయినా ట్విట్టర్ లో ఎడిట్ బటన్ లేదాయో అని ఎటకారంగా వరుస ట్వీట్లు చేసింది. ప్రస్తుతం ట్విట్టర్ లో యూజర్లు ఏదైనా తప్పుగా ట్వీట్ చేస్తే.. ఫేస్ బుక్ తరహాలో ఎడిట్ చేసే అవకాశం లేదు.. ట్వీట్ చేసిన మెసేజ్ ను డిలీట్ చేయడం ఒక్కటే మార్గం.. డిలీట్ చేసిన ట్వీట్ స్థానంలో మరోసారి కొత్త ట్వీట్ చేయడమే. వికీపీడియా.. ఇదే విషయాన్ని ట్విట్టర్ పై ఎత్తి చూపింది.
Read Also : పండుగ చేస్కోండి : జియో సెలబ్రేషన్ ప్యాక్ .. రోజుకు 2GB డేటా ఎక్స్‌ట్రా

దీంతో వికీపీడియా ట్వీట్ల పై ట్విట్టర్ కూడా అదే స్థాయిలో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. మా గురించి మీకు తెలిసినంతగా మరిఎవరికీ బాగా తెలియదులే అంటూ ట్విట్టర్ ట్వీట్ చేసింది. ట్విట్టర్ ట్వీట్ పై వికీపీడియా వ్యవస్థాపకుల్లో ఒకరైన జిమ్మి వేల్స్ స్పందిస్తూ.. అవును.. మాకు అన్నీ తెలుసులే అని ట్వీట్ చేశారు. ట్విట్టర్, వికీపీడియా మధ్య జోరుగా ట్వీట్ల వార్ జరుగుతుంటే.. మరోవైపు ట్విట్టర్ యూజర్లు సడన్ ఎంట్రీ ఇచ్చారు. రచ్చ రచ్చచేశారు.. ట్విట్టర్ కు బర్త్ డే విషెస్ చెబుతూనే.. తాము కూడా ఏం తక్కువ కాదంటూ.. వికీపీడియా, ట్విట్టర్ల ట్వీట్లకు తమకు నచ్చిన ట్వీట్లను జోడిస్తూ తెగ వైరల్ చేసేశారు.