6 నెలలుగా నీటిలో ఉన్నా అద్భుతంగా పనిచేస్తోంది ఈ ఐఫోన్‌!

ఫోన్ నీళ్లలో పడితే పనిచేస్తుందా? చెప్పడం కష్టమే.. అలాంటిది నెలల తరబడి ఫోన్ నీళ్లలో ఉంటే అసలకే పనికిరాదు..కానీ, ఈ ఐఫోన్ మాత్రం దాదాపు 6 నెలలపైనే నీటిలో ఉంది.. అయినా బ్రహ్మండంగా పనిచేస్తోంది ఈ ఐఫోన్.

6 నెలలుగా నీటిలో ఉన్నా అద్భుతంగా పనిచేస్తోంది ఈ ఐఫోన్‌!

Working iPhone 11 : ఫోన్ నీళ్లలో పడితే పనిచేస్తుందా? చెప్పడం కష్టమే.. 90శాతం ఆ ఫోన్ పనికిరాదు. ఎందుకంటే నీళ్లు ఫోన్‌లోకి పోతే వెంటనే పాడైపోతుంది. అలాంటిది నెలల తరబడి ఫోన్ నీళ్లలో ఉంటే అసలకే పనికిరాదు..కానీ, ఈ ఐఫోన్ మాత్రం దాదాపు 6 నెలలపైనే నీటిలో ఉంది.. అయినా బ్రహ్మండంగా పనిచేస్తోంది ఈ ఐఫోన్. అదే మోడల్ ఐఫోన్ 11.. ఆరు నెలలపైనే సరస్సులో ఉంది. ఐఫోన్ చేజారిపోవడంతో ఫోన్ పొగట్టుకున్న వ్యక్తి ఆశలు వదిలేసుకున్నాడు.

కానీ, సరిగ్గా ఆరు నెలల తర్వాత అదే ఐఫోన్ యజమాని వద్దకు చేరుకుంది. ఈ ఘటన కెనడాలోని బ్రిటీష్ కొలంబియాలో జరిగింది. వాంకోవర్‌కు చెందిన ఫాతిమా ఘోడ్సీ 2020 సెప్టెంబర్‌లో బ్రిటీష్‌ కొలంబియాలోని హారిసన్ సరస్సులో బోటుపై ప్రయాణించారు. ఆ సమయంలో తన చేతిలోని ఐఫోన్‌11 పొరపాటున జారి నీటిలో పడిపోయింది. కొన్ని నెలల తర్వాత చిల్లివాక్‌కు చెందిన జంట, హారిసన్‌ సరస్సులో లోపల పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించారు.

అప్పుడు సరస్సు నీటి అడుగుభాగంలో కొన్ని వ్యర్థాలు, రెండు మొబైల్‌ ఫోన్లు బయటపడ్డాయి. అందులో ఒకటి ఐఫోన్ 11, మరొకటి ఫీచర్ ఫోన్. అయితే ఆ రెండింటిలో ఒక ఫోన్ మాత్రం ఇంకా పనిచేస్తూనే ఉంది. స్విచ్ఛాఫ్ అయిన ఆ ఫోన్ ఆన్ చేయగానే వెంటనే పనిచేస్తోంది. అదే.. ఐఫోన్ 11.. ఆ ఫోన్ లోని కాంటాక్టుల ఆధారంగా ఫోన్ యజమాని ఫాతిమాను ఈ జంట కలిసింది. ఐఫోన్ 11 ఫోన్ తిరిగి ఆమెకు ఇచ్చారు. పోగట్టుకున్న తన ఐఫోన్ తిరిగి తన వద్దకు రావడంతో ఆనందం పట్టలేకపోయింది.

ఐఫోన్ అందించిన జంటకు ఆమె కృతజ్ఞతలు తెలిపింది. ఆపిల్ సంస్థకు చెందిన లేటెస్ట్‌ ఐఫోన్‌లు ఐపీ (ఇంగ్రెస్ ప్రొటెక్షన్) రేటింగ్‌ తో మార్కెట్లోకి వస్తున్నాయి. ఈ డివైజ్ నీటిలో కూడా (వాటర్ రిసిస్టినెన్స్) సురక్షితంగా ఉంటుంది. ఐఫోన్ 11కి ఐపీ 68 రేటింగ్ ఉంది. గరిష్ఠంగా రెండు మీటర్ల లోతు నీటిలో 30 నిమిషాల వరకు పనిచేస్తుంది. కానీ, అంతకంటే ఎక్కువ రోజులు ఐఫోన్ 11 పనిచేయడం నిజంగా చాలా అద్భుతమే కదా..