Xiaomi Smart TV X Series : షావోమీ నోట్‌బుక్ ప్రో, స్మార్ట్‌టీవీ X సిరీస్ లాంచ్.. ఫీచర్లు అదుర్స్.. ఇండియాలో ధర ఎంతంటే?

Xiaomi Smart TV X Series : ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం షావోమీ (Xiaomi) వివిధ కేటగిరీలలో రెండు కొత్త ప్రొడక్టులను లాంచ్ చేసింది. 120Hz రిఫ్రెష్ రేట్, 12వ జనరేషన్ ఇంటెల్ కోర్ ప్రాసెసర్‌లు, మరిన్నింటితో 2.5K డిస్‌ప్లేతో వచ్చే కొత్త నోట్‌బుక్ ప్రో (Xiaomi Notebook Pro) ల్యాప్‌టాప్‌ను ప్రవేశపెట్టింది.

Xiaomi Smart TV X Series : షావోమీ నోట్‌బుక్ ప్రో, స్మార్ట్‌టీవీ X సిరీస్ లాంచ్.. ఫీచర్లు అదుర్స్.. ఇండియాలో ధర ఎంతంటే?

Xiaomi Notebook Pro, Xiaomi Smart TV X Series launched in India: Price, features and more

Xiaomi Smart TV X Series : ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం షావోమీ (Xiaomi) వివిధ కేటగిరీలలో రెండు కొత్త ప్రొడక్టులను లాంచ్ చేసింది. 120Hz రిఫ్రెష్ రేట్, 12వ జనరేషన్ ఇంటెల్ కోర్ ప్రాసెసర్‌లు, మరిన్నింటితో 2.5K డిస్‌ప్లేతో వచ్చే కొత్త నోట్‌బుక్ ప్రో (Xiaomi Notebook Pro) ల్యాప్‌టాప్‌ను ప్రవేశపెట్టింది. 4K సినిమా వ్యూ ఎక్స్ పీరియన్స్ కోరుకునే వినియోగదారుల కోసం Xiaomi స్మార్ట్ TV X సిరీస్‌ను లాంచ్ చేసింది. ఈ కొత్త టీవీ సిరీస్ ధరలు రూ. 28,999 నుంచి ప్రారంభం కానున్నాయి. ల్యాప్‌టాప్ ధర రూ. 69,999లకు అందుబాటులో ఉంది.

Xiaomi Notebook Pro స్పెసిఫికేషన్‌లు ఇవే :
భారత మార్కెట్లో Xiaomi Notebook Pro ల్యాప్‌టాప్ 120Hz డిస్‌ప్లేను కలిగి ఉంది. 14-అంగుళాల సైజు ఉంటుంది. ప్యానెల్ 2.5K రిజల్యూషన్‌తో పనిచేస్తుంద. దీనికి DC డిమ్మింగ్‌కు సపోర్టు కూడా ఉంది. స్క్రీన్ TUV నుంచి తక్కువ బ్లూలైట్ ఎమిషన్ సర్టిఫికేషన్ కూడా ఉంది. Xiaomi నోట్‌బుక్ ప్రోలో ఏరోస్పేస్ గ్రేడ్ సిరీస్ 6 అల్యూమినియం బిల్డ్ ఉంది. 12వ జనరేషన్ కోర్ i5 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ల్యాప్‌టాప్‌లో GeForce MX550 GPU ఉంది. ఎంట్రీ-లెవల్ గ్రాఫిక్స్ కార్డ్ కూడా అందించారు. 16GB వరకు LPDDR5 RAM, 512GB ఇంటర్నల్ స్టోరేజీతో బ్యాకప్ అందిస్తుంది.

Xiaomi Notebook Pro, Xiaomi Smart TV X Series launched in India_ Price, features and more

Xiaomi Notebook Pro, Xiaomi Smart TV X Series launched in India

ఈ డివైజ్ 3 స్థాయి బ్యాక్‌లిట్ కీబోర్డ్‌ను కలిగి ఉంది. సెక్యూరిటీ బెనిఫిట్స్ కోసం ఫింగర్ ఫ్రింట్ స్కానర్ పవర్ బటన్‌లో అందించారు. ఫ్రంట్ సైడ్ 720p కెమెరా కూడా అమర్చారు. కంపెనీ Wi-Fi 6కి సపోర్టు అందించింది. ల్యాప్‌టాప్‌లో ఆడియో జాక్ కూడా అందించారు. USB Type-C పోర్ట్ కూడా ఉంది. థండర్ బోల్ట్ 4 పోర్ట్, టైప్-A USB 3.1 పోర్ట్, HDMI 2.0 పోర్ట్ కలిగి ఉంటుంది. Xiaomi బాక్స్‌లో 100W ఛార్జర్‌ కూడా అందిస్తుంది. దాదాపు 35 నిమిషాల్లో బ్యాటరీని 50 శాతం వరకు అందిస్తుందని కంపెనీ పేర్కొంది. Xiaomi నోట్‌బుక్ ప్రో ధర రూ. 69,999తో వస్తుంది. సెప్టెంబర్ 20న సేల్ ప్రారంభం కానుంది. ఈ డివైజ్ Amazon, Mi.com వంటి ఇతర స్టోర్‌ల ద్వారా కొనుగోలు చేయవచ్చు.

Xiaomi Smart TV X Series : స్పెసిఫికేషన్‌లు, ధర ఎంతంటే? :

Xiaomi నుంచి కొత్త స్మార్ట్ టీవీ సిరీస్ (Xiaomi Smart TV X Series) మెటల్ బెజెల్-లెస్ డిజైన్‌ను అందిస్తోంది. వివిధ సైజుల్లో స్మార్ట్ టీవీ X సిరీస్ అందుబాటులో ఉంది. ఈ టీవీ స్క్రీన్ 4K రిజల్యూషన్‌తో వచ్చింది. కలర్, కాంట్రాస్ట్ డాల్బీ విజన్, HDR10, HLGలకు సపోర్టు అందిస్తుంది. టెలివిజన్‌లో కంటెంట్ వ్యూ ఎక్స్‌పీరియన్స్ కోసం ఇంటర్నల్ ఇమేజ్-ప్రాసెసింగ్ అల్గారిథమ్, వివిడ్ పిక్చర్ ఇంజిన్ (VPE)ని కలిగి ఉంది. టీవీ 96.9 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియోను కలిగి ఉంది. మెటాలిక్ ఫ్రేమ్‌ను కలిగి ఉంది. 30W స్పీకర్లు డాల్బీ ఆడియోకు అత్యుత్తమ సౌండ్ ఎక్స్ పీరియన్స్ కోసం సపోర్ట్‌ను కూడా అందిస్తుంది. Xiaomi DTS-HD, DTS: వర్చువల్ X టెక్‌లకు కూడా సపోర్టును అందిస్తుంది.

Xiaomi Notebook Pro, Xiaomi Smart TV X Series launched in India: Price, features and more

Xiaomi Notebook Pro, Xiaomi Smart TV X Series launched in India

Xiaomi Smart TV X సిరీస్ Android TV 10 ప్లాట్‌ఫారమ్‌ ఆధారిత PatchWall UIపై రన్ అవుతుంది. హుడ్ కింద 64-బిట్ క్వాడ్-కోర్ A55 చిప్‌సెట్ అందించారు. 2GB RAM, 8GB స్టోరేజీకి సపోర్టు ఇస్తుంది. Xiaomi స్మార్ట్ TV X సిరీస్ డ్యూయల్-బ్యాండ్ Wi-Fi, బ్లూటూత్ 5.0 కనెక్టివిటీకి సపోర్టు అందిస్తుంది. మూడు HDMI పోర్ట్‌లు (eARC x 1), రెండు USB పోర్ట్‌లు, AV, ఇయర్‌ఫోన్ పోర్ట్ ఉన్నాయి. Xiaomi స్మార్ట్ TV X సిరీస్ రేంజ్ ధర రూ. 28,999 నుంచి ప్రారంభమవుతుంది. 43-అంగుళాల వేరియంట్, 50-అంగుళాల మోడల్ ధర రూ. 34,999, 55-అంగుళాల మోడల్ ధర రూ. 39,999కి సేల్ ప్రారంభం కానుంది. ఈ కొత్త టీవీ Mi.com, Flipkart, రిటైల్ స్టోర్ల ద్వారా అందుబాటులో ఉంటుంది.

Read Also :Xiaomi Notebook Pro 120G : ఆగస్టు 30న షావోమీ నోట్‌బుక్ ప్రో 120G ల్యాప్‌టాప్ వస్తోంది.. ధర ఎంత ఉండొచ్చుంటే?