Xiaomi Pad 6 India Launch : ఈ నెల 13న షావోమీ ఆండ్రాయిడ్ ప్యాడ్ 6 వచ్చేస్తోంది.. ఫీచర్లు ఇవేనా? ధర ఎంత ఉండొచ్చుంటే?

Xiaomi Pad 6 India Launch : షావోమీ నుంచి ఆండ్రాయిడ్ ప్యాడ్ (Xiaomi Pad 6) భారత మార్కెట్లో ఈ నెల 13న లాంచ్ కానుంది. అధికారిక లాంచ్ తేదీని ట్విట్టర్ ద్వారా షావోమీ ప్రకటించింది.

Xiaomi Pad 6 India Launch : ఈ నెల 13న షావోమీ ఆండ్రాయిడ్ ప్యాడ్ 6 వచ్చేస్తోంది.. ఫీచర్లు ఇవేనా? ధర ఎంత ఉండొచ్చుంటే?

Xiaomi Pad 6 India Launch Scheduled for June 13; Snapdragon 870 SoC Teased

Xiaomi Pad 6 India Launch : షావోమీ యూజర్లకు గుడ్‌న్యూస్.. ఈ నెల (జూన్) 13న భారత మార్కెట్లోకి షావోమీ ప్యాడ్ 6 (Xiaomi Pad 6) రానుంది. Qualcomm Snapdragon 870 SoC ద్వారా ఆధారితమైన (Xiaomi Pad 6 Pro), Xiaomi 13 Ultraతో పాటు గత ఏప్రిల్‌లో చైనాలో లాంచ్ అయింది. ఇప్పుడు, ఆండ్రాయిడ్ టాబ్లెట్ (Android Tablet) జూన్ 13న భారత్‌లో లాంచ్ అవుతుందని అంచనా. ఈ షావోమీ ప్యాడ్ డాల్బీ విజన్-సర్టిఫైడ్ డిస్‌ప్లే, డాల్బీ అట్మాస్-సపోర్టెడ్ ఆడియో సిస్టమ్‌తో కనీసం రెండు విభిన్న కలర్ ఆప్షన్లలో వస్తుంది.

షావోమీ స్మార్ట్ పెన్ స్టైలస్‌కు కూడా సపోర్టు ఇస్తుంది. Xiaomi ప్యాడ్ 6 Android 13-ఆధారిత MIUI 14పై రన్ అవుతుంది. 33W ఛార్జింగ్ సపోర్ట్‌తో 8,840mAh బ్యాటరీని కలిగి ఉంది. చైనీస్ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ షావోమీ Xiaomi ప్యాడ్ 6 అధికారిక లాంచ్ తేదీని ట్విట్టర్ ద్వారా జూన్ 5న ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం.. ఆండ్రాయిడ్ టాబ్లెట్ జూన్ 13న ఇండియాలో లాంచ్ కానుంది. Xiaomi తన వెబ్‌సైట్‌లో ప్రత్యేక ల్యాండింగ్ పేజీ ద్వారా టాబ్లెట్ స్పెసిఫికేషన్‌లను రివీల్ చేసింది.

Read Also : Realme 11 Pro 5G Series : రియల్‌మి 11ప్రో 5G సిరీస్ లాంచ్ ఆఫర్.. ఈ నెల 8నే లాంచ్.. ప్రీ-ఆర్డర్ డేట్ ఇదిగో..!

Xiaomi ప్యాడ్ 6, షావోమీ స్మార్ట్ పెన్ సెకండ్ జనరేషన్‌కు సపోర్టుతో స్నాప్‌డ్రాగన్ 870 SoC ద్వారా పనిచేస్తుంది. డాల్బీ విజన్-సర్టిఫైడ్ డిస్‌ప్లే, డాల్బీ అట్మాస్-సపోర్టెడ్ స్పీకర్‌లతో కనీసం రెండు వేర్వేరు కలర్ ఆప్షన్లలో వస్తుంది. 490 గ్రాముల బరువుతో 6.55mm సన్నని బిల్డ్‌తో రానుంది. అయితే, Xiaomi Pad 6 భారతీయ వేరియంట్ ధర వివరాలు ప్రస్తుతానికి తెలియవు. ఆసక్తి ఉన్న కస్టమర్‌లు ఈ ప్యాడ్ లాంచ్, లభ్యత గురించి అప్‌డేట్‌లను పొందాలంటే వెబ్‌సైట్‌లోని ‘Notify Me’ బటన్‌ను Click చేయవచ్చు.

Xiaomi Pad 6 India Launch Scheduled for June 13; Snapdragon 870 SoC Teased

Xiaomi Pad 6 India Launch Scheduled for June 13; Snapdragon 870 SoC Teased

Xiaomi ప్యాడ్ 6 ఏప్రిల్‌లో చైనాలో లాంచ్ కాగా.. ప్రారంభ ధర CNY 1,899 (దాదాపు రూ. 22,000)గా ఉంది. 6GB + 128GB వేరియంట్‌లో బ్లాక్, గోల్డ్, ఫార్ మౌంటైన్ బ్లూ కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉన్నాయి. Android 13 ఆధారంగా MIUI 14పై రన్ అవుతుంది. 144Hz వరకు రిఫ్రెష్ రేట్, డాల్బీ విజన్ సపోర్ట్‌తో 11-అంగుళాల 2.8K (1,800×2,880 పిక్సెల్‌లు) LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. టాబ్లెట్ గరిష్టంగా 12GB LPDDR5 RAM, 256GB వరకు UFS3 స్టోరేజీని అందిస్తుంది. ఇందులో 13MP వెనుక సెన్సార్, 8MP ఫ్రంట్ సెన్సార్ ఉన్నాయి. టాబ్లెట్ 8,840mAh బ్యాటరీతో 33W ఛార్జింగ్‌కు సపోర్టు అందిస్తుంది.

Read Also : Nothing Phone 2 Launch : నథింగ్ ఫోన్ 2 తయారీ ఇక భారత్‌లోనే.. జూలైలోనే లాంచ్.. కంపెనీ క్లారిటీ ఇచ్చిందిగా..!