YouTube: యూట్యూబ్‌లో ఫ్యాన్ వార్‌కి చెక్.. ఇక ఆ కౌంట్ కనిపించదు

.సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్‌లు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.. మా హీరో గొప్ప అంటే మా హీరో గ్రేట్ అంటూ పొగిడేసుకుంటూ ఉంటారు.

YouTube: యూట్యూబ్‌లో ఫ్యాన్ వార్‌కి చెక్.. ఇక ఆ కౌంట్ కనిపించదు

Youtube

YouTube: సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్‌లు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.. మా హీరో గొప్ప అంటే మా హీరో గ్రేట్ అంటూ పొగిడేసుకుంటూ ఉంటారు.. అందులో తప్పులేదు కానీ, తిట్టేసుకుంటూ కూడా కొందరు నెగెటివిటీని స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా యూట్యూబ్ లాంటి మాధ్యమంలో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కామెంట్లలో తెగ తిట్టేసుకుంటూ ఉంటారు. వీడియో నచ్చినా నచ్చకపోయినా.. ఆత్మస్థైర్యం దెబ్బతినేందుకు DisLike బటన్ నొక్కేస్తూ ఉంటారు.

ఈ DisLike బటన్‌పై ఎంతోకాలంగా.. తర్జన భర్జన పడుతున్న యూట్యూబ్‌.. డిస్‌లైక్‌ బటన్‌ కౌంట్‌ను తొలగించేందుకు నిర్ణయం తీసుకుంది. ఈమేరకు గూగుల్ అధికారికంగా ప్రకటన చేసింది. డిస్‌లైక్‌ కౌంట్‌ కనిపించకుండా చేయడం ద్వారా క్రియేటర్స్‌కి, వ్యూయర్స్‌కి మధ్య మర్యాదపూర్వక వాతావరణం ఏర్పడుతుందని, అందుకోసమే ఈమేరకు నిర్ణయం తీసుకున్నట్లు గూగుల్ చెబుతోంది. యూట్యూబ్‌లో కామెంట్‌ సెక్షన్‌లో కామెంట్‌కు సైతం డిస్‌లైక్‌ బటన్‌ ఉంటుంది. అయితే అది కూడా కౌంట్‌ చూపించదు.

గూగుల్ తీసుకున్న ఈ నిర్ణయంతో యూట్యూబ్‌ ఛానెల్స్‌, కొత్త యూట్యూబర్స్‌కు కాస్త ఊరట లభించినట్లేనని చెబుతున్నారు. డిస్‌లైక్‌ బటన్‌ మాత్రం యధాతధంగా ఉంటుంది కానీ, కౌంట్ మాత్రం చూపించదు. యూట్యూబ్‌ స్టూడియోలో కౌంట్‌ను మాత్రం చూసుకునే వెసులుబాటు ఉంటుంది. ఈ ఫీచర్‌ కనిపించాలంటే యూట్యూబ్‌ యాప్‌ను అప్‌డేట్‌ చేసుకోండి.