Hyderabad T20 Match : హైదరాబాద్‌లో పీక్స్‌కు క్రికెట్ ఫీవర్.. అభిమానులతో కిటకిటలాడుతున్న ఉప్పల్ స్టేడియం పరిసరాలు

హైదరాబాద్ లో క్రికెట్ ఫీవర్ పీక్స్ కు చేరింది. ఫైనల్ ఫైట్ కు టీమిండియా, ఆస్ట్రేలియా జట్లు సిద్ధంగా ఉన్నాయి. మ్యాచ్ ను లైవ్ లో చూసేందుకు ఉప్పల్ స్టేడియానికి అభిమానులు భారీగా తరలివచ్చారు. దీంతో ఉప్పల్ స్టేడియం పరిసరాలు క్రికెట్ లవర్స్ తో కిటకిటలాడుతున్నాయి.

Hyderabad T20 Match : హైదరాబాద్‌లో పీక్స్‌కు క్రికెట్ ఫీవర్.. అభిమానులతో కిటకిటలాడుతున్న ఉప్పల్ స్టేడియం పరిసరాలు

Hyderabad T20 Match : హైదరాబాద్ లో క్రికెట్ ఫీవర్ పీక్స్ కు చేరింది. కాసేపట్లో భారత్, ఆస్ట్రేలియా మధ్య చివరి టీ20 మ్యాచ్ ప్రారంభం కానుంది. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా సిరీస్ డిసైడర్ మ్యాచ్ జరగనుంది. ఫైనల్ ఫైట్ కు టీమిండియా, ఆస్ట్రేలియా జట్లు సిద్ధంగా ఉన్నాయి. మ్యాచ్ ను లైవ్ లో చూసేందుకు ఉప్పల్ స్టేడియానికి అభిమానులు భారీగా తరలివచ్చారు. దీంతో ఉప్పల్ స్టేడియం పరిసరాలు క్రికెట్ లవర్స్ తో కిటకిటలాడుతున్నాయి.

ఉప్పల్ స్టేడియంలో భారత్-ఆసీస్ టీ20 మ్యాచ్ కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది. ఉప్పల్ స్టేడియం దగ్గర ఫ్యాన్స్ కోలాహలం నెలకొంది. తమ అభిమాన క్రికెటర్లను స్వయంగా చూసేందుకు ఫ్యాన్స్ ఆత్రుతగా ఉన్నారు. దాదాపు మూడేళ్ల తర్వాత ఉప్పల్ స్టేడియంలో క్రికెట్ మ్యాచ్ జరగనుంది. దీంతో సందడి వాతావరణం నెలకొంది.

ఆదివారం.. ఆహ్లాదకరమైన సాయంత్రం. అద్భుతమైన స్టేడియం. సూపర్ స్టార్లతో కూడిన రెండు పెద్ద జట్ల మధ్య టీ20 ఫైట్. అందులోనూ సిరీస్ డిసైడర్. క్రికెట్ ఫ్యాన్స్ కు ఇంతకంటే ఎంజాయ్ మెంట్ ఏముంటుంది. స్టేడియంలో మ్యాచ్ ను లైవ్ లో చూస్తే వచ్చే కిక్ నెక్ట్స్ లెవెల్ లో ఉంటుందని అంటున్నారు క్రికెట్ లవర్స్. అంతర్జాతీయ మ్యాచ్ కోసం మూడేళ్లుగా ఎదురుచూస్తున్న హైదరాబాద్ క్రికెట్ అభిమానులకు టీ20 ఫైట్ ను ఆస్వాదించడానికి ఇంతకంటే గొప్ప రోజేం ఉంటుంది. ఆదివారం సాయంత్రం 7గంటలకు ఉప్పల్ స్టేడియంలో భారత్, ఆసీస్ మధ్య జరిగే ఆఖరి టీ20 మ్యాచ్ కోసం క్రికెట్ ఫ్యాన్స్ కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. కాసేపట్లో మ్యాచ్ ప్రారంభం కానుండగా.. స్టేడియంలోకి ఫ్యాన్స్ ను పంపించడం ప్రారంభించారు.

భారత్‌, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఉప్పల్‌ స్టేడియంలో జరగనున్న టీ20 మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు క్రికెట్‌ అభిమానులు ఉవ్విళ్లూరుతున్నారు. ఆదివారం సాయంత్రం జరిగే మ్యాచ్‌ కోసం ఫ్యాన్స్‌ ఆత్రుతగా ఉన్నారు. కాగా, అభిమానుల కోసం పోలీసులు కొన్ని సూచనలు చేశారు. వ్యక్తిగత వాహనాలను పక్కనపెట్టి ప్రజా రవాణాను వినియోగిస్తే స్టేడియానికి సులువుగా చేరుకోవచ్చని సూచించారు. అభిమానుల కోసం మెట్రో రైల్‌, ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసిందని తెలిపారు.

ఆదివారం ఉప్పల్‌ స్టేడియంలో జరిగే టీ-20 క్రికెట్‌ మ్యాచ్‌ సందర్భంగా ప్రత్యేక బస్సులు నడుపనున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఉప్పల్‌ స్టేడియం నుంచి వివిధ ప్రాంతాలకు 50 బస్సులను అందుబాటులో ఉంచనున్నారు. ఉప్పల్‌ నుంచి సికింద్రాబాద్, జేబీఎస్, మేడ్చల్, హకీంపేట్, మెహిదీపట్నం, కోఠి, ఘట్‌కేసర్‌ తదితర ప్రాంతాలకు ఈ బస్సులు నడుపనున్నారు.

అటు.. ప్రయాణికుల సౌకర్యార్థం హైదరాబాద్‌ మెట్రో రైలు పలు చర్యలు చేపట్టింది. స్టేడియం మెట్రో స్టేషన్‌ నుండి రాత్రి 11 గంటల నుంచి మధ్యరాత్రి ఒంటి గంట వరకు ప్రత్యేక రైళ్లు నడపనుంది. అమీర్‌పేట్, జేబీఎస్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌ నుండి కనెక్టింగ్‌ రైళ్లు ఉంటాయి.