Foxconn Chairman Young Liu : వావ్.. వాటే డెవలప్‌మెంట్, తెలంగాణలో అభివృద్ధిపై ఫాక్స్ కాన్ చైర్మన్ యంగ్ లీయు ప్రశంసలు

తెలంగాణలో అభివృద్ధిని, హైదరాబాద్ నగరాన్ని చూసి తాను ఎంతో ఇంప్రెస్ అయ్యానని ఫాక్స్ కాన్ చైర్మ‌న్ యంగ్ లీయు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తో మీటింగ్ చాలా బాగా జరిగిందన్నారు. ఏడేళ్లలో తెలంగాణ అభివృద్ధిపై సీఎం చూపించిన వీడియో తనను ఎంతగానో ఆకట్టుకుందన్నారు.

Foxconn Chairman Young Liu : వావ్.. వాటే డెవలప్‌మెంట్, తెలంగాణలో అభివృద్ధిపై ఫాక్స్ కాన్ చైర్మన్ యంగ్ లీయు ప్రశంసలు

Foxconn Chairman Young Liu : తెలంగాణలో అభివృద్ధిని, హైదరాబాద్ నగరాన్ని చూసి తాను ఎంతో ఇంప్రెస్ అయ్యానని ప్రపంచస్థాయి ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ సంస్థ ఫాక్స్ కాన్ చైర్మ‌న్ యంగ్ లీయు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తో మీటింగ్ చాలా బాగా జరిగిందన్నారు. ఏడేళ్లలో తెలంగాణ అభివృద్ధిపై సీఎం చూపించిన వీడియో తనను ఎంతగానో ఆకట్టుకుందన్నారు.

తెలంగాణలో జరిగిన అభివృద్ధి చాలా అద్భుతం అన్నారు యంగ్ లీయు. రాబోయే నాలుగేళ్లలో తెలంగాణ రెవెన్యూ డబుల్ అవుతుందన్నారు. తెలంగాణ మంచి స్పిరిట్ ఉన్న రాష్ట్రం అన్నారు. తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోతోందన్నారు. టి-వర్క్స్ లోనే కాదు మిగతా రంగాల్లో కూడా డెవలప్ మెంట్ ఉందన్నారు. అభివృద్ధిలో తెలంగాణ స్పీడ్ నాకు బాగా నచ్చిందన్నారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తుంది తెలంగాణ అని ప్రశంసించారు.

Also Read..Hyderabad: టీ వర్క్స్ సెంటర్ ప్రారంభోత్సవం

తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా ఏర్పాటు చేసిన టీ వ‌ర్క్స్‌ను చూసి ఎంతో ఇంప్రెస్ అయినట్లు యంగ్ లీయు తెలిపారు. టీ వ‌ర్క్స్ ప్రారంభించిన అనంత‌రం అక్క‌డ ఏర్పాటు చేసిన స‌మావేశంలో యంగ్ లీయు మాట్లాడారు.

”హైద‌రాబాద్‌ నగరంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఇదే వేగంతో ప‌ని చేస్తే రాబోయే నాలుగేళ్లలో డ‌బుల్ రెవెన్యూ సాధించడం ఖాయ‌ం. ఈ ఏడేళ్లలో తెలంగాణ ఎంత అభివృద్ధి సాధించిందో సీఎం కేసీఆర్ వివ‌రించారు. టీ వ‌ర్క్స్‌కి ఎస్ఎంటీ యంత్రాన్ని త్వ‌ర‌లోనే అందిస్తాం” అని ఫాక్స్ కాన్ చైర్మ‌న్ తెలిపారు.

Also Read.. Foxconn Investment in Telangana : తెలంగాణలో ఫాక్స్ కాన్ కంపెనీ భారీ పెట్టుబడులు .. లక్షమందికి ఉద్యోగాలు

రాయ‌దుర్గం ఐటీ కారిడార్‌లో 18 ఎక‌రాల్లో అత్యాధునిక స‌దుపాయాల‌తో టీ వ‌ర్క్స్‌ను నిర్మించారు. ఈ టీ-వర్క్స్‌ను ఫాక్స్ కాన్ చైర్మ‌న్ యంగ్ లియూతో క‌లిసి రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. 200కు పైగా అత్యాధునిక యంత్రాల కోసం రూ.110 కోట్లు వెచ్చించారు. మరో రూ.40 కోట్ల వరకు కార్పొరేట్‌ సంస్థల నుంచి వచ్చే అవకాశం ఉంది. టీ-వర్క్స్‌ మొదటి దశ 78 వేల చదరపు అడుగుల్లో ఉంది. ఇందులోనే ఉత్పత్తుల రూపకల్పన, ఇంజినీరింగ్‌, ఫ్యాబ్రికేషన్‌, సోర్సింగ్‌, మెటీరియల్స్‌, ఇతర అంశాలపై టీ-వర్క్స్‌లో నిపుణులు అందుబాటులో ఉండి ఆవిష్కర్తలకు సహకరిస్తారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.