Gaddar: 1997లో గద్దర్‌పై హత్యాయత్నం.. దేశ వ్యాప్తంగా సంచలనం

ఆ బుల్లెట్ తొలగిస్తే ఆయన ప్రాణాలకి ముప్పు ఉంటుందని దాన్ని అలాగే వదిలేశారు. శరీరంలో ఆ బుల్లెట్ తోనే ఇప్పటి వరకు జీవించారు.

Gaddar: 1997లో గద్దర్‌పై హత్యాయత్నం.. దేశ వ్యాప్తంగా సంచలనం

Gaddar

Gaddar passed away: పాటలతో పల్లె ప్రజలను ఊపుఊపిన ప్రజాగాయకుడు గద్దరన్న (77) ఉద్యమ గళం మూగబోయింది. ఆయన పాటలు మాత్రం చిరస్థాయిగా నిలిచి ఉంటాయి. గద్దర్‌ తన జీవితంలో ఎన్నో కష్టాలను అనుభవించారు.. ఎన్నో బెదిరింపులూ ఎదురయ్యాయి. 1997లో గద్దర్‌పై హత్యాయత్నం కూడా జరిగింది. 1990ల్లో నక్సలైట్లపై జన నాట్య మండలి ఆధ్వర్యంలో గద్దర్ హైదరాబాద్‌లోని నిజాం కాలేజీ మైదానంలో నిర్వహించిన బహిరంగ సభకు దాదాపు రెండు లక్షల మంది ప్రజలు హాజరయ్యారు.

గద్దర్ అప్పట్లో నక్సలైట్లకు మద్దతుగా పాటలు పాడారు. ఆయన పాటలకు చాలా మంది ఆకర్షితులయ్యే వారని ఆరోపణలు ఉన్నాయి. గద్దర్‌ పై పలు కేసులు ఉన్నాయి. 1997, ఏప్రిల్ 6న గద్దర్‌పై కొందరు కాల్పులు జరిపారు. ఆ హత్యాయత్నం దేశమంతా సంచలనం సృష్టించింది. ఆయనపై కాల్పులు జరిపింది ఎవరన్న విషయంపై అనేక రకాలుగా ప్రచారం జరిగింది.

నిందితులను పోలీసులు ఎందుకు పట్టుకోలేకపోయారని విమర్శలు వచ్చాయి. అప్పట్లో గద్దర్ శరీరంలోకి బుల్లెట్లు చొచ్చుకెళ్లాయి. వైద్యులు చికిత్స అందించారు. గద్దర్ శరీరంలో ఒక్క బుల్లెట్‌ను మాత్రం తొలగించలేకపోయారు. ఆ బుల్లెట్ తొలగిస్తే ఆయన ప్రాణాలకి ముప్పు ఉంటుందని దాన్ని అలాగే వదిలేశారు. శరీరంలో ఆ బుల్లెట్ తోనే ఇప్పటి వరకు జీవించారు.

విప్లవ సాహిత్యాన్ని ఆపలేదు. 2002లో అప్పటి ప్రభుత్వంతో చర్చలు జరిపే విషయంలో అధికారుల వద్దకు గద్దర్, వరవర రావును నక్సలైట్లు పంపారు. పోలీసులు నకిలీ ఎన్‌కౌంటర్లు చేస్తున్నారని గద్దర్ నిరసించారు. కాలక్రమంలో గద్దర్ ఆలోచనా విధానాలు మారినట్లు తెలుస్తోంది.

Gaddar: నీ పాటనై వస్తున్నానమ్మో అంటూ పలకరించే గద్దరన్న ఇకలేరు