Summer : వామ్మో ఎండలు.. మార్చిలోనే మాడు పగులుతోంది

ఎండల ప్రభావంతో అడుగు బయటపెట్టాలంటేనే జనం వణికిపోతున్నారు. రోజురోజుకూ పెరుగుతున్న ఎండలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మార్చిలోనే ఇలా ఉంటే.. రానున్న రోజుల్లో ఇంకెంత దారుణ పరిస్థితులు

Summer : వామ్మో ఎండలు.. మార్చిలోనే మాడు పగులుతోంది

Summer

High Temperature In Telugu States : తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండుతున్నాయి. మార్చిలోనే ఏప్రిల్‌, మేలో నమోదయ్యే ఉష్ణోగ్రతలు రికార్డు అవుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలు దాటాయి. ఉక్కబోతతో జనం ఉక్కరిబిక్కిరి అవుతున్నారు. అక్కడడక్కడ వడగాల్పులు కూడా ప్రారంభమయ్యాయి. దీంతో భానుడు ప్రతాపానికి జనం బెంబేలెత్తున్నారు. ఇప్పుడే భానుడు భగ్గుమంటుంటే.. ఇక ఏప్రిల్‌, మేలో పరిస్థితి ఎలా ఉంటుందోనని ఆందోళన చెందుతున్నారు.

Read More : High Temperatures: తెలంగాణలో రికార్డు స్థాయిలో నమోదవుతున్న ఉష్ణోగ్రతలు

మున్ముందు ఉష్ణోగత్రలు మరింత పెరిగి మాడు పగిలే స్థాయికి చేరే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో సాధారణ స్థాయి కంటే ఆరేడు డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నల్లగొండలో అత్యధికంగా 42.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇది సాధారణం కన్నా 5 డిగ్రీలు అధికం. మార్చిలో ఇంతటి ఉష్ణోగ్రతలు నమోదవడం పదేళ్లలో ఇదే మొదటిసారి. 2016 మార్చి 23న అత్యధికంగా 42 డిగ్రీలు నమోదైంది. పగటి ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తెలంగాణకు ఆరెంజ్‌ అలెర్ట్‌ జారీ చేసింది.

Read More : Telangana : వామ్మో ఎండలు.. ఇది శాంపిల్, మున్ముందు పెరుగనున్న ఉష్ణోగ్రతలు

ఆదిలాబాద్‌, రామగుండం, నిజామాబాద్‌, పెద్దపల్లి భద్రాచలం, మెదక్‌ ప్రాంతాల్లో కూడా 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదవుతున్నాయి. ఉత్తర, ఈశాన్య భారత నుంచి తెలంగాణలోకి వీస్తున్న వేడి గాలుల ప్రభావంతో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నట్లు ఐఎండీ పేర్కొంది. ఏపీలోని కడప, విజయవాడ, గుంటూరు, రాజమండ్రి ప్రాంతాల్లో కూడా అధిక ఉష్ణోగ్రతలు నమోదువుతున్నాయి. రాత్రి ఉష్ణోగ్రతలు కనిష్టంగానే నమోదు అవుతున్నా.. పగటి ఉష్ణోగ్రతల్లో తీవ్రత అధికంగా ఉంటోంది. ఏటా ఏప్రిల్ రెండో వారంలో నమోదు అయ్యే గరిష్ట ఉష్ణోగ్రతలు ప్రస్తుతం మార్చి నెలలోనే నమోదు కావడం ఆందోళన వ్యక్తం అవుతోంది.

Read More : Weather Report: మార్చి మొదటి వారం నుంచే “మండే ఎండలు”

ఎండల ప్రభావంతో అడుగు బయటపెట్టాలంటేనే జనం వణికిపోతున్నారు. రోజురోజుకూ పెరుగుతున్న ఎండలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మార్చిలోనే ఇలా ఉంటే.. రానున్న రోజుల్లో ఇంకెంత దారుణ పరిస్థితులు ఉంటాయోనని ఆందోళన చెందుతున్నారు. బంగాళాఖాతంలోఇటీవల ఏర్పడిన అల్పపీడనం ప్రభావం తగ్గింది. దీంతో వేడి పెరిగింది. మధ్యాహ్నం ఉక్కపోత ఉంటోంది. ఉత్తర కోస్తాంధ్ర, యానాం ప్రాంతాల్లో వాయువ్య దిశ నుంచి బలమైన గాలులు వీస్తున్నాయని హైదరాబాద్‌ వాతావరణ శాఖ ఇన్‌ఛార్జి డైరెక్టర్‌ శ్రావణి చెప్తున్నారు.