Karimnagar : రహస్య యాప్ తో భార్య ఫోన్ ట్యాపింగ్

ఫోన్ లోకి సీక్రెట్‌ యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేసి భర్త తనను ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Karimnagar : రహస్య యాప్ తో భార్య ఫోన్ ట్యాపింగ్

Karimnagar

Karimnagar : ఫోన్ లోకి సీక్రెట్‌ యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేసి భర్త తనను ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన ఫోన్ లోని వీడియోలు, సందేశాలు చూసి అనుమానంతో వేధిస్తున్నాడని వాపోయింది. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా కోరుట్లలో చోటుచేసుకుంది.

సీఐ రాజశేఖర్ రాజు తెలిపిన వివరాల ప్రకారం.. కోరుట్లకు చెందిన టి. నర్సింహాచలం (48) తన భార్య అనిత ఫోన్ లో ఓ సీక్రెట్ యాప్ ఇన్‌స్టాల్‌ చేశాడు. ఈ విషయం ఆమెకు తెలియదు. ఈ యాప్ ద్వారా ఆమె ఎక్కడెక్కడికి వెళ్తుంది. ఎవరితో ఫోన్ మాట్లాడుతుంది అనేవి తన ఫోన్ నుంచే ఆ యాప్ ద్వారా చూస్తుండేవాడు.

అంతేకాదు ఆమె ఫోన్ ను ఎక్కువగా భర్తే ఆపరేట్ చేసేవాడు. వాట్సాప్‌ చాటింగ్‌ చూడటం, ఆడియో రికార్డింగ్ వినడం వంటివి చేస్తుండేవాడు. అయితే భర్త తన ఫోన్ లో రహస్య యాప్ ఇన్‌స్టాల్‌ చేసిన విషయం తెలుసుకునేందుకు చాలా కాలమే పట్టింది. బుధవారం విషయం తెలియడంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది.

అనిత ఫిర్యాదుతో ఆమె భర్త టి. నర్సింహాచలంను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించారు. విచారణలో రహస్య యాప్ ఇన్‌స్టాల్‌ చేసినట్లు అంగించారించాడు. కొన్నేళ్ల క్రితం తమ ఇంట్లో బంగారం పోయిందని, అది ఎవరు తీశారనే విషయం తెలుసుకునేందుకే తాను ఈ పని చేశానని తెలిపాడు. భార్య ఫోన్ తోపాటు మరో ఇద్దరు బంధువుల ఫోన్లలో కూడా ఈ రహస్య యాప్ ఇన్‌స్టాల్‌ చేసినట్లు వివరించాడు. దీంతో నర్సింహాచలంపై 498, 354 (సీ) సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు సీఐ తెలిపారు.