Hyderabad Traffic Cop: నెంబర్ ప్లేట్ మోసం చేస్తే క్రిమినల్ కేసులే

ట్రాఫిక్ పోలీసులు సెక్యూరిటీ, సేఫ్టీ దృష్టిలో ఉంచుకొని నెంబర్ ప్లేట్‌ల విషయంలో మోసాలకు పాల్పడేవారిపై క్రిమినల్ కేసులు బుక్ చేయనున్నారు. జులై నెలలో దాదాపు 100 మంది పలు పోలీస్ స్టేషన్లలో ఇదే కేసులో బుక్ అయినట్లు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ వెల్లడించారు.

Hyderabad Traffic Cop: నెంబర్ ప్లేట్ మోసం చేస్తే క్రిమినల్ కేసులే

 

 

Hyderabad Traffic Cop: ట్రాఫిక్ పోలీసులు సెక్యూరిటీ, సేఫ్టీ దృష్టిలో ఉంచుకొని నెంబర్ ప్లేట్‌ల విషయంలో మోసాలకు పాల్పడేవారిపై క్రిమినల్ కేసులు బుక్ చేయనున్నారు. జులై నెలలో దాదాపు 100 మంది పలు పోలీస్ స్టేషన్లలో ఇదే కేసులో బుక్ అయినట్లు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ వెల్లడించారు.

“చాలా రిపీటెడ్ వార్నింగ్స్ తర్వాత మేం క్రిమినల్ కేసులు బుక్ చేస్తున్నాం. క్రిమినల్స్ సాధారణంగా ట్యాంపర్డ్ ప్లేట్ లేదా ఎటువంటి నెంబర్ ప్లేట్ లేని వాహనాలపై తిరుగుతుంటారు. ఇది సీరియస్ లా అండ్ ఆర్డర్ ఇష్యూ” అని సీనియర్ ట్రాఫిక్ పోలీస్ అధికారి వెల్లడించారు.

దీంతో ఐపీసీ సెక్షన్ 420తో పాటుగా మోటర్ వెహికల్ యాక్ట్ కూడా మోసాలకు పాల్పడేవారిపై విధించనున్నారు పోలీస్. “చాలా మంది వాహనదారులు ట్రాఫిక్ పెనాల్టీల నుంచి తప్పించుకోవాలనే ఇలా చేస్తున్నారు. ఇదంతా ప్రభుత్వాన్ని, ట్రాఫిక్ పోలీసులను మోసం చేయడమే. అందుకే వారిపై క్రిమినల్ కేస్ బుక్ చేసి.. వాహనం సీజ్ చేస్తున్నాం” అని అధికారి తెలిపారు.

Read Also: అసలు పోలీసులతో కలిసిపోయి చలాన్లు వసూలు చేస్తున్న నకిలీ ట్రాఫిక్ పోలీస్

లోకల్ ట్రాఫిక్ పోలీసులు వాహనాన్ని రద్దు చేసి స్థానిక లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇస్తారు. అలా వాహన యజమాని లేదా వాహనాన్ని నడిపేవారిని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్తారు. ట్రాఫిక్ అఫీషియల్ వారిపై క్రిమినల్ కేసు బుక్ చేస్తారు. వాహనాలకు నెంబర్ ప్లేట్ లేకపోయినా ట్యాంపరింగ్ కు పాల్పడినట్లు తెలిసినా లా అండ్ ఆర్డర్ పోలీసులు సైతం కేసులు బుక్ చేస్తున్నారు.