BRS: మామిడి తోటలో ఓ వర్గం భేటీ.. తోట బయట మరో వర్గం నిలబడి..

మామిడి తోటలో ఎమ్మెల్సీ రవీందర్ రావు వర్గీయులు ఉండగా, మామిడి తోట బయట ఎమ్మెల్యే శంకర్ నాయక్ వర్గీయులు ఉన్నారు.

BRS: మామిడి తోటలో ఓ వర్గం భేటీ.. తోట బయట మరో వర్గం నిలబడి..

MLA Banoth Shankar Naik vs MLC Takkallapalli Ravinder Rao

Updated On : July 16, 2023 / 3:12 PM IST

BRS – Shankar Naik: మహబూబాబాద్ (Mahabubabad) జిల్లా బీఆర్ఎస్ పార్టీలో వర్గ విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ కు వ్యతిరేకంగా ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్ రావు (Takkallapalli Ravinder Rao) వర్గీయులు సమావేశమయ్యారు.

నెల్లికుదురు మండలం మదనతుర్తి సమీపంలోని మామిడి తోటలో ఈ రహస్య భేటీ జరిగింది. ఆ సమయంలో దాన్ని అడ్డుకోవడానికి శంకర్ నాయక్ వర్గీయులు ప్రయత్నించారు. ఆ ప్రాంతం వద్ద ఎమ్మెల్యేకు మద్దతుగా నినాదాలు చేశారు.

మామిడి తోటలో ఎమ్మెల్సీ రవీందర్ రావు వర్గీయులు ఉండగా, మామిడి తోట బయట ఎమ్మెల్యే శంకర్ నాయక్ వర్గీయులు ఉన్నారు. పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతుండడంతో పోలీసులు భారీగా మోహరించారు.

మహబూబాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీలో తరుచూ ఇటువంటి ఘటనలు చోటుచేసుకుంటున్న విషయం తెలిసిందే. పార్టీ అధిష్ఠానానికి ఆ జిల్లా నేతలు తలనొప్పి తెప్పిస్తున్నారు. మరో నాలుగు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్న వేళ వారి తీరు బీఆర్ఎస్ కు నష్టపర్చేలా ఉందని విమర్శలు వస్తున్నాయి.

Governor Tamilisai : బోనాలకు ప్రభుత్వం నుంచి నాకు ఎలాంటి ఆహ్వానం అందలేదు : గవర్నర్