Governor Tamilisai : బోనాలకు ప్రభుత్వం నుంచి నాకు ఎలాంటి ఆహ్వానం అందలేదు : గవర్నర్

గవర్నర్ తెలంగాణ, దేశ ప్రజలకు బోనాల శుభాకాంక్షలు తెలిపారు. అందరికీ అన్ని సౌకర్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు. అందరికీ ఆహారం, విద్య, వ్యాపారం, ఆరోగ్యం ప్రాప్తింపజేయాలని అమ్మవారిని కోరుకుంటున్నట్లు వెల్లడించారు.

Governor Tamilisai : బోనాలకు ప్రభుత్వం నుంచి నాకు ఎలాంటి ఆహ్వానం అందలేదు : గవర్నర్

Governor Tamilisai

Updated On : July 16, 2023 / 2:40 PM IST

Raj Bhavan Bonalu : బోనాలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి తనకు ఎలాంటి ఆహ్వానం అందలేదని గవర్నర్ తమిళిసై అన్నారు. అయినప్పటికీ తాను హ్యాపీగానే ఉన్నానని తెలిపారు. రాజభవన్ లో సంతోషంగా బోనాలు చేసుకున్నామని పేర్కొన్నారు. హైదరాబాద్ రాజ్ భవన్ లో ఘనంగా బోనాల ఉత్సవాలు నిర్వహించారు. బోనాల ఉత్సవాల్లో గవర్నర్ తమిళిసై పాల్గొని, బోనం ఎత్తుకున్నారు.

ఈ మేరకు గవర్నర్ తెలంగాణ, దేశ ప్రజలకు బోనాల శుభాకాంక్షలు తెలిపారు. అందరికీ అన్ని సౌకర్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు. అందరికీ ఆహారం, విద్య, వ్యాపారం, ఆరోగ్యం ప్రాప్తింపజేయాలని అమ్మవారిని కోరుకుంటున్నట్లు వెల్లడించారు. చంద్రయాన్ ను విజయవంతంగా లాంచ్ చేసిన ఇస్రోకు గవర్నర్ శుభాకాంక్షలు తెలిపారు.

Lal Darwaja Bonalu : ఘనంగా ప్రారంభమైన లాల్ దర్వాజా బోనాలు… తొలి బోనం సమర్పించిన ఆలయ కమిటీ

శాస్త్రవేత్తలందరికి అభినందనలు అంటూ పేర్కొన్నారు. మరోవైపు హైదరాబాద్ పాతబస్తీలో లాల్ దర్వాజా బోనాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తెల్లవారుజామున సింహవాహిని అమ్మవారికి ఆలయ కమిటీ సభ్యులు తొలి బోనం సమర్పించారు. అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీంతో లాల్ దర్వాజా బోనాల జాతర ప్రారంభం అయింది.

రాష్ట్ర ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సింహవాహిని అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఇందుకోసం ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు చేసింది. భక్తుల కోసం క్యూ లైన్లు ఏర్పాటు చేసింది.