Tushar Mehta : ఫామ్‪హౌజ్ కేసు వీడియో దుమారం.. హాట్ టాపిక్‪గా మారిన తుషార్ పేరు, ఎవరీ తుషార్ మెహతా?

తుషార్ మెహతా.. తెలంగాణలో సంచలనం రేపిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ప్రలోభాల కేసులో ఇప్పుడీ పేరు హాట్ టాపిక్ గా మారింది. దీనికి కారణం తుషార్ మెహతా ఒకప్పుడు గవర్నర్ తమిళిసైకి ఏడీసీగా పని చేయడమే.

Tushar Mehta : ఫామ్‪హౌజ్ కేసు వీడియో దుమారం.. హాట్ టాపిక్‪గా మారిన తుషార్ పేరు, ఎవరీ తుషార్ మెహతా?

Tushar Mehta : తుషార్ మెహతా.. తెలంగాణలో సంచలనం రేపిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ప్రలోభాల కేసులో ఇప్పుడీ పేరు హాట్ టాపిక్ గా మారింది. దీనికి కారణం తుషార్ మెహతా ఒకప్పుడు గవర్నర్ తమిళిసైకి ఏడీసీగా పని చేయడమే. ఫామ్ హౌజ్ వీడియోలో ఈ పేరే ఇప్పుడు ప్రముఖంగా వినిపిస్తోంది. ఎక్కడో ఉండి హైదరాబాద్ లో ఉన్న ఎమ్మెల్యేలతో ఫోన్ లో సెటిల్ మెంట్ కు ట్రై చేసిన వ్యక్తి, మీడియేటర్ గా వచ్చిన రామచంద్ర భారతి తుషార్ తోనే రోహిత్ రెడ్డిని మాట్లాడించాడు.

ఫామ్ హౌజ్ కేసు తెలంగాణ రాజకీయాల్లో హీట్ పెంచింది. దీనిపై దుమారం కొనసాగుతోంది. తాజాగా ఈ వ్యవహారంలో రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తెలంగాణ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ఫోన్ ను కూడా తెలంగాణ ప్రభుత్వం ట్యాప్ చేస్తోందేమోనన్న అనుమానం కలుగుతోందని ఆమె అన్నారు. గవర్నర్ కార్యాలయం రాజ్ భవన్.. ప్రగతి భవన్ లా కాదని.. రాజ్ భవన్ ద్వారాలు జనం కోసం నిత్యం తెరిచే ఉంటాయని కూడా ఆమె అన్నారు. రాజ్ భవన్ లో మీడియా సమావేశంలో టీఆర్ఎస్ సర్కారుపై సంచలన ఆరోపణలు చేశారు గవర్నర్ తమిళి సై.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు యత్నించారన్న కేసులో రాజ్ భవన్ ను ఇరికించేందుకు యత్నించారని తమిళిసై అన్నారు. ఇందులో భాగంగానే గతంలో తన వద్ద ఏడీసీగా పనిచేసిన తుషార్ పేరును ప్రస్తావించారని ఆమె అన్నారు. ఈ వ్యవహారంలో రాజ్ భవన్ పాత్ర ఉందని చెప్పే విధంగా అధికారిక ట్విట్టర్ ఖాతాల్లో పోస్టులు పెట్టారని ఆమె ఆరోపించారు.

ఈ పరిస్థితులన్నీ చూస్తుంటే తన ఫోన్ ను కూడా ట్యాప్ చేస్తున్నారేమోనన్న అనుమానం కలుగుతోందన్నారు. ఫలితంగా తన వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలుగుతోందన్నారు. తన ఫోన్ ను ట్యాప్ చేయాలనుకుంటే.. దొంగదారులు అవసరం లేదన్న తమిళిసై.. తానే స్వయంగా తన ఫోన్ ను అప్పగిస్తానని చెప్పారు.