Somesh Kumar: ప్రభుత్వంతో చర్చలు సఫలం.. ముగిసిన వీఆర్ఏల సమ్మె.. రేపట్నుంచి విధులకు హాజరు

గత 80 రోజులుగా తమ సమస్యల పరిష్కారం కోరుతూ సమ్మె చేసిన వీఆర్ఏలు బుధవారం సమ్మె విరమించారు. ప్రభుత్వంతో జరిపిన చర్చలు సఫలమైనట్లు పేర్కొన్నారు. గురువారం నుంచి విధులకు హాజరుకానున్నట్లు చెప్పారు.

Somesh Kumar: ప్రభుత్వంతో చర్చలు సఫలం.. ముగిసిన వీఆర్ఏల సమ్మె.. రేపట్నుంచి విధులకు హాజరు

Somesh Kumar: తమ హక్కుల సాధన కోసం కొద్ది రోజులుగా సమ్మె చేస్తున్న వీఆర్ఏలు సమ్మె విరమించారు. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్‌తో బుధవారం సాయంత్రం వీఆర్ఏల సంఘం ప్రతినిధులు జరిపిన చర్చలు సఫలమయ్యాయి.

Leopard Cub: ఫిలిం సిటీలో చిరుత పిల్ల.. తరిమిన కుక్కలు.. పట్టుకుని అధికారులకు అప్పగించిన గార్డ్స్

దీంతో తాము సమ్మె విరమిస్తున్నట్లు, గురువారం నుంచి విధులకు హాజరుకానున్నట్లు వీఆర్ఏలు ప్రకటించారు. తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సంక్షేమ సంఘం (ట్రెసా) అధ్యక్షుడు రవీందర్ రెడ్డి, వీఆర్ఏ సంఘం ప్రతినిధులు, ఇతర ఉద్యోగ సంఘాల నేతలు హైదరాబాద్‌లోని బీఆర్కే భవన్‌లో సోమేష్ కుమార్‌తో చర్చించారు. వీఆర్ఏలకు పే స్కేలు ఇవ్వాలని, పదోన్నతులు కల్పించాలని, వయసు పైడిన వారి వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని.. ఇలా పలు డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచారు. వీటికి సీఎస్ సానుకూలంగా స్పందించారు. సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారు.

Railway Employees: రైల్వే ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. 78 రోజుల బోనస్ ప్రకటించిన కేంద్రం

మునుగోడు ఎన్నిక ఉన్నందున, వచ్చే నెల 7 తర్వాత నిర్ణయం తీసుకుంటామని సీఎస్ హామీ ఇచ్చారు. దీంతో వీఆర్ఏలు సమ్మె విరమించారు. వీఆర్ఏలు దాదాపు 80 రోజులుగా తమ సమస్యల పరిష్కారం కోసం దీక్షలు, నిరసనలు చేస్తున్నారు.