Warangal : కోచింగ్ సెంటర్లు కళకళ.. వరంగల్‌‌కు నిరుద్యోగుల క్యూ

ఏజ్‌ లిమిట్‌ పెంచడంతో ఉద్యోగాల కోసం పోటీ ఎక్కువగానే ఉంది. కరీంనగర్, ఖమ్మం సహా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వివిధ ప్రాంతాల నిరుద్యోగులు ఉత్తర తెలంగాణకు ప్రధాన కేంద్రంగా ఉన్న వరంగల్‌కు..

Warangal : కోచింగ్ సెంటర్లు కళకళ.. వరంగల్‌‌కు నిరుద్యోగుల క్యూ

Jobs

North Telangana Students : కుంభమేళాకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టడంతో నిరుద్యోగుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. వివిధ ప్రభుత్వ శాఖల్లోని ఖాళీలను నోటిఫై చేయడంతోపాటు భర్తీకి వేగంగా చర్యలు ప్రారంభమయ్యాయి… నిరుద్యోగ అభ్యర్థులు అభ్యర్థులు సైతం అంతే ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తున్నారు. పోటీ పరీక్షల పుస్తకాలు, మెటీరియల్‌ సేకరించుకునే పనిలో పడ్డారు. అటు వరంగల్‌లో కోచింగ్ సెంటర్లు బిజీ బిజీ అయ్యాయి. కరోనా సమయంలో మూత పడిన కోచింగ్ సెంటర్లు.. మళ్లీ ఓపెన్ అయ్యాయి. 80వేలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేస్తుండటంతో.. కోచింగ్ సెంటర్లు బ్యాచులు బ్యాచులుగా విద్యార్థులకు క్లాసులు నిర్వహిస్తున్నాయి.

Read More : Government Jobs : తెలంగాణలో 86వేల ఉద్యోగాలు ఖాళీ, త్వరలో 55వేల పోస్టులు భర్తీ..!

ఏజ్‌ లిమిట్‌ పెంచడంతో ఉద్యోగాల కోసం పోటీ ఎక్కువగానే ఉంది. కరీంనగర్, ఖమ్మం సహా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వివిధ ప్రాంతాల నిరుద్యోగులు ఉత్తర తెలంగాణకు ప్రధాన కేంద్రంగా ఉన్న వరంగల్‌కు క్యూ కట్టారు. ఉత్తమ ఫ్యాకల్టీ, డైలీ టెస్టుల నిర్వహణ, స్టడీ మెటీరియల్‌ ఇస్తున్న సంస్థలకే ఆశావహులు ప్రాధాన్యం ఇస్తున్నారు. కొందరు ఎక్కువ ఫీజు చెల్లించి మరీ నాణ్యమైన కోచింగ్‌ సెంటర్లలో చేరుతున్నారు.

Read More : Jobs For Locals : తెలంగాణలోని నిరుద్యోగులకు గుడ్‌న్యూస్, 95శాతం ఉద్యోగాలు స్థానికులకే

అటు కోచింగ్ సెంటర్లు కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాయి. ఈసారి అభ్యర్థుల సంఖ్య పెరిగిపోతుండటంతో దానికి అనుగుణంగా కోచింగ్‌ సెంటర్ల నిర్వాహకులు క్లాస్‌ రూమ్‌లను సిద్ధం చేస్తున్నారు. ప్రైవేటు విద్యాసంస్థల్లో టీచర్లుగా పనిచేస్తూ పరీక్షకు ప్రిపేర్‌ అవుతున్న వాళ్లు ఎక్కువ మంది ఉన్నారు. వారి కోసం సాయంత్రం పూట క్లాసులు నిర్వహిస్తున్నారు. అలాగే డిగ్రీ, పీజీ, బీటెక్‌ పూర్తిచేసిన అభ్యర్థుల కోసం స్పెషల్‌గా బ్యాచ్‌లు ఏర్పాటు చేస్తున్నారు.