CM KCR Birthday : సీఎం కేసీఆర్ కు ఫోన్ చేసి బర్త్ డే విషెస్ తెలిపిన రాష్ట్రపతి రామ్ నాథ్, ప్రధాని మోదీ

రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ఫోన్ చేసి సీఎం కేసీఆర్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఫోన్ చేయడానికంటే ముందే ట్విట్టర్ లో మోదీ విషెస్ చెప్పారు.

CM KCR Birthday : సీఎం కేసీఆర్ కు ఫోన్ చేసి బర్త్ డే విషెస్ తెలిపిన రాష్ట్రపతి రామ్ నాథ్, ప్రధాని మోదీ

Kcr (6)

President Ram Nath kovind and PM Modi : తెలంగాణ సీఎం కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా దేశవ్యాప్తంగా ఆయనకు శుభాకాంక్షల వెల్లువకొనసాగుతోంది. ప్రముఖులు కేసీఆర్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. సీఎం కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ఫోన్ చేసి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఫోన్ చేయడానికంటే ముందే మోదీ ట్విట్టర్ లో కేసీఆర్ కు విషెస్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వ విధానాలపైన, ప్రధానంగా మోదీపైన సీఎం కేసీఆర్ ఓ రేంజ్ లో విరుచుకుపడుతున్న ఈ తరుణంలో మోదీ స్వయంగా కేసీఆర్ కు ఫోన్ చేసి విషెస్ చెప్పడం ఆసక్తి కల్గిస్తోంది.

తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే.స్టాలిన్ సీఎం కేసీఆర్ కు ఫోన్ చేసి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే సీఎం కేసీఆర్ కు మెగాస్టార్ చిరంజీవి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. గొప్ప వాక్పటిమ, ముందుచూపు కలిగిన రాజకీయ పోరాట యోధుడు అని పవన్ కొనిడాయాడారు. తెలంగాణ రాష్ట్రానికి ఎంతటి జఠిలమైన సమస్య ఎదురైనా తన మాటలతో, వాక్చాతుర్యంతో ప్రజలకు స్వాంతన చేకూర్చడంలో ఆయనకు ఆయనే సాటి. ఆయన రాజకీయ ప్రయాణం, తెలంగాణ సాధనలో ఆయన చేసిన పోరాటాన్ని గుర్తు చేశారు.

Desh Ki Neta KCR: దేశ వ్యాప్తంగా కేసీఆర్ ఫ్లెక్సీలు.. జోరుగా గులాబీ బాస్ పుట్టినరోజు సంబరాలు

తెలంగాణ చరిత్రలో కేసీఆర్ చిరస్థాయిగా నిలిచిపోతారని పేర్కొన్నారు. సమకాలీన రాజకీయనాయకులలో తనకంటూ ఒక ప్రత్యేక పంథాను ఏర్పరచుకున్నారని కొనియాడారు. రాజకీయ ప్రస్థానం కొనసాగించడం కేసీఆర్ లోని మరో ప్రత్యేకత అని అన్నారు. ఆయన రాజకీయ శైలిని ప్రత్యర్ధులు సైతం మెచ్చుకోకుండా ఉండలేరన్నది నిగూఢమైన నిజం అన్నారు. తెలంగాణ అంతటా శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వడం విజ్ఞులందరితోపాటు తనకు ఆనందాన్ని కలిగించిందన్నారు.

నూతన వసంతంలోకి అడుగిడుతున్న శుభ తరుణంలో కేసీర్ కు సంపూర్ణ ఆరోగ్యాన్ని, దీర్ఘాయుష్షును ప్రసాదించాలని ఆ భగవంతుణ్ణి ప్రార్ధిస్తున్నట్లు పేర్కొన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు.. ముఖ్యమంత్రి కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సదా ఆనంద ఆరోగ్యాలతో ఉండాలని మనసారా కోరుకుంటున్నట్లు చెప్పారు. నారా లోకేష్ కూడా కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.