Raja Singh: బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్‭పై పీడీ యాక్ట్‭ను సమర్థించిన అడ్వైజరీ బోర్డ్

పిడియాక్ట్ ఎత్తివేయాలంటూ రాజసింగ్ చేసిన విజ్ఞప్తిని పీడీ యాక్ట్ అడ్వైసరీ కమిటీ తిరస్కరించింది. హైదరాబాద్ పోలీసుల వాదనతో అడ్వైజరీ కమిటీ ఏకీభవించింది. రాజాసింగ్‭పై 101కేసులు ఉన్నాయని పోలీసుల వాదిస్తున్నారు. ఇందులో 18 కేసులు కమ్యూనల్‭కు సంబంధించినవి కావడంతో పీడీ యాక్ట్ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Raja Singh: బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్‭పై పీడీ యాక్ట్‭ను సమర్థించిన అడ్వైజరీ బోర్డ్

The advisory board upheld the PD Act against BJP MLA Raja Singh

Updated On : October 26, 2022 / 4:23 PM IST

Raja Singh: ఇప్పటికే చిక్కుల్లో ఇరుక్కున్న భారతయ జనతా పార్టీ ఎమ్మెల్యే రాజా సింగ్‭కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన వేసిన పీడీ యాక్ట్‭ను అడ్వైజరీ బోర్డ్ తాజాగా సమర్ధించింది. జైలు శిక్ష అనుభవిస్తున్న ఆయనను గత నెలలోనే ముగ్గురు రిటైర్డ్ జడ్జిలు, ఓ సామాజిక కార్యకర్తతో ఏర్పాటు చేసిన పీడీయాక్ట్ అడ్వైజరీ బోర్డు విచారించింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ విచారణ జరిగింది. కాగా, రాజా సింగ్ కుటుంబ సభ్యులు బోర్డు ముందు నేరుగా హాజరయ్యారు. చట్టం ప్రకారమే పీడీ యాక్ట్ ను పెట్టారా? లేదా? అనే విషయాన్ని బోర్డు సభ్యులు ప్రముఖంగా పరిగణలోకి తీసుకుని విచారించారు.

పిడియాక్ట్ ఎత్తివేయాలంటూ రాజసింగ్ చేసిన విజ్ఞప్తిని పీడీ యాక్ట్ అడ్వైసరీ కమిటీ తిరస్కరించింది. హైదరాబాద్ పోలీసుల వాదనతో అడ్వైజరీ కమిటీ ఏకీభవించింది. రాజాసింగ్‭పై 101కేసులు ఉన్నాయని పోలీసుల వాదిస్తున్నారు. ఇందులో 18 కేసులు కమ్యూనల్‭కు సంబంధించినవి కావడంతో పీడీ యాక్ట్ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఇక పీడీ యాక్ట్‭ను రీవోక్ చేయాలని హైకోర్టులో రాజాసింగ్ కుటుంబ సభ్యులు పిటిషన్ ఈ నెల 28న విచారణకు రానుంది. రాజ్యాంగంలోని 14, 21 అధికారాలకు ఉల్లంఘిస్తూ ఆగస్టు 26 నుంచి రాజా సింగ్ ను అక్రమంగా నిర్బంధించారని తమ పిటిషన్‭లో రాజా సింగ్ భార్య ఆరోపించారు. కేసుల గురించి చెప్పకుండానే పీడీ యాక్ట్ కింద అరెస్టు చేయడం అన్యాయమన్నారు. రాజాసింగ్‭కు బెయిల్ మంజూరు చేసేలా ఉత్తర్వులు జారీ చేయాలని ఆమె కోరారు.‭

iPhone 13 : రూ. 48వేల లోపు ధరకే ఐఫోన్ 13 సొంతం చేసుకోవచ్చు.. రూ. 10వేలు డిస్కౌంట్.. ఇప్పుడే కొనేసుకోండి..!