MLAs trap issue : TRS ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి భద్రత పెంపు .. బుల్లెట్ ప్రూఫ్ కారు,4+4 గన్‌మెన్లు కేటాయింపు

మొయినాబాద్ ఫామ్‌ హౌస్ లో TRS ఎమ్మెల్యేల కొనుగోలు జరిగిందనే వ్యవహారం విషయంలో తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి భద్రతను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రోహిత్ రెడ్డికి 4+4 గన్‌మెన్లను కేటాయిస్తూ రాష్ట్ర హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ కూడా కేటాయించింది.

MLAs trap issue :  TRS ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి భద్రత పెంపు .. బుల్లెట్ ప్రూఫ్ కారు,4+4 గన్‌మెన్లు కేటాయింపు

TRS MLAs trap issue

TRS MLAs trap issue : మొయినాబాద్ ఫామ్‌ హౌస్ లో TRS ఎమ్మెల్యేల కొనుగోలు జరిగిందనే వ్యవహారం విషయంలో తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి భద్రతను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రోహిత్ రెడ్డికి 4+4 గన్‌మెన్లను కేటాయిస్తూ రాష్ట్ర హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ కూడా కేటాయించింది. ప్రస్తుతం రోహిత్ రెడ్డి 2+2 భద్రతను కలిగి ఉన్నారు.

టీఆర్‌ఎస్‌‌కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించేలా ప్రయత్నాలు జరిగాయనే వార్త తెలంగాణలో హీట్ పుట్టిస్తోంది. ఈ వ్యవహారపంపై అటు టీఆర్ఎస్, బీజేపీలో ఆరోపనలు, ప్రత్యారోపణలను కొనసాగిస్తున్నాయి. ఇటువంటి నీచ రాజకీయాలు మీకు అలవాటు అంటే కాదు మీకే అలవాటు అంటూ దుమ్మెత్తిపోసుకుంటున్నారు. రూ.100 కోట్ల రూపాయలు ఆశపెట్టి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనాలని బీజేపీ కుట్ర పన్నిందనే వ్యవహారం మునుగోడు ఉప ఎన్నిక వేదిగా జరుగుతున్న వ్యవహారం అంతకంతకు ముదురుతోంది. దీనికి సంబంధించి ఫిర్యాదుతోనే తాము ఈ యత్నాలను భగ్నం చేసినట్టుగా పోలీసులు వెల్లడించారు.

టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారితే డబ్బు, కాంట్రాక్టులు, పదవులు ఇస్తామని కొందరు ప్రలోభపెట్టారని పోలీసులు చెబుతున్నారు. దీనికి సంబంధించి ఫరీదాబాద్ ఆలయానికి చెందిన రామచంద్రభారతి, తిరుపతికి చెందిన సింహయాజి, హైదరాబాద్‌కు చెందిన నందకుమార్‌‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనలో నిందితులతో పైలెట్ రోహిత్ రెడ్డి మాట్లాడినట్టుగా చెబుతున్న ఫోన్ సంభాషణల ఆఢియోలు రెండు వైరల్‌గా అవుతున్నాయి.