YS Sharmila: షర్మిల కన్నా తుమ్మలనే బెస్ట్ అప్షన్.. తెలంగాణ కాంగ్రెస్ లో మారిపోతున్న సమీకరణాలు!

దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదన్నట్టుగా తయారైంది వైఎస్ షర్మిల పరిస్థితి. రెండేళ్ల క్రితం తెలంగాణలో పార్టీని ఏర్పాటు చేసిన షర్మిల..

YS Sharmila: షర్మిల కన్నా తుమ్మలనే బెస్ట్ అప్షన్.. తెలంగాణ కాంగ్రెస్ లో మారిపోతున్న సమీకరణాలు!

tummala nageswar rao best option for paleru than ys sharmila

YS Sharmila – Tummala: తెలంగాణ కాంగ్రెస్ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. వైఎస్సార్టీపీ (YSRTP) కాంగ్రెస్ పార్టీలో విలీనం అయిపోయినా.. ఆ పార్టీ అధ్యక్షురాలు షర్మిలకు మాత్రం పాలేరు (Paleru) నుంచి పోటీ చేసే ఛాన్స్ దక్కేలా కన్పించడం లేదు. బీఆర్ఎస్ (BRS Party) అసంతృప్త నేత తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageswara Rao) హస్తం పార్టీతో టచ్లోకి రావడంతో షర్మిలకు హ్యాండివ్వడం ఖాయంగా కన్పిస్తోంది. ఏ రకంగా చూసుకున్నా పాలేరుకు షర్మిల కన్నా తుమ్మలనే బెస్ట్ అప్షన్ గా భావిస్తున్నారు ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కీలక నేతలు. ఇప్పటికే వారంతా తుమ్మలకు మద్దతుగా నిలుస్తుండటంతో కాంగ్రెస్ పార్టీలో చేరకముందే ఒంటరి అయిపోతున్నారు షర్మిల.. ఇంతకీ కాంగ్రెస్ లో షర్మిల లెక్క తప్పుతోందా?

దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదన్నట్టుగా తయారైంది వైఎస్ షర్మిల పరిస్థితి. రెండేళ్ల క్రితం తెలంగాణలో పార్టీని ఏర్పాటు చేసిన షర్మిల.. పొలిటికల్ మైలేజీ సాధించలేక హస్తం గూటికి చేరాలని డిసైడ్ అయ్యారు. తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసి.. గ్రాండ్ ఓల్డ్ పార్టీ ద్వారా తెలంగాణ పాలిటిక్స్ లో చక్రం తిప్పాలని భావించారు షర్మిల. అంతేకాదు ఖమ్మం జిల్లా పాలేరు నుంచి పోటీ చేసి అసెంబ్లీలో అడుగుపెట్టాలని ఎప్పటి నుండో ఉవ్విళ్లూరుతున్నారు. . అయితే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు షర్మిల ఆశలకు గండి పడుతున్నట్లు కనిపిస్తోంది. షర్మిల తెలంగాణ పాలిటిక్స్‌లో చక్రం తిప్పడం సంగతేమో కానీ… అసలు పాలేరు టిక్కెట్టే ఆమెకు దక్కేలా కన్పించడం లేదు.

పార్టీ పెట్టినప్పుడే పాలేరు బరిలో దిగుతానంటూ ప్రకటించేశారు వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిల. తానూ ఖమ్మం కోడలినేనంటూ.. పాలేరులో పార్టీ కార్యాలయం కూడా ఏర్పాటు చేసుకున్నారు. కాంగ్రెస్ లో పార్టీని విలీనం చేసినా.. కాంగ్రెస్ తరఫున పాలేరు బరిలోకే దిగాలనేది షర్మిల కోరిక. నిన్న మొన్నటివరకు ఇది ఈజీనే అనుకున్న షర్మిలకు… తుమ్మల రూపంలో ఇప్పుడు ఇబ్బంది ఎదురవుతోంది. పాలేరు టిక్కెట్ ను మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు నిరాకరించింది బిఆర్ఎస్. దీంతో ఆయన కాంగ్రెస్ తరఫున పాలేరు బరిలో దిగేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. మొదటి నుండి షర్మిల రాకను వ్యతిరేకిస్తున్న రేవంత్ రెడ్డి.. స్వయంగా తుమ్మల నాగేశ్వర్ రావు ఇంటికి వెళ్లి మరీ ఆహ్వానించారు.

Also Read: కేంద్ర ఎన్నికల కమిటీ ప్రకటించిన కాంగ్రెస్.. తెలుగు రాష్ట్రాల నుంచి కేవలం ఒక్కరికే అవకాశం

మరోవైపు షర్మిల రాకను స్వాగతిస్తున్న వైఎస్ కుటుంబానికి సన్నిహితంగా ఉండే పొంగులేటి, భట్టి కూడా తుమ్మల అయితేనే పాలేరులో ఈజీగా విజయం సాధిస్తారనే ధీమాతో ఉన్నారు. మరోవైపు తుమ్మల లాంటి నేత కాంగ్రెస్ లో చేరితే జిల్లాలో పార్టీ మరింత బలపడుతుందనే అంఛనాలో ఉన్నారు. దీంతో షర్మిలకు టిక్కెట్ దక్కడం కష్టమనే వాదన వినిపిస్తోంది. మరోవైపు ఖమ్మం జిల్లాకే చెందిన ఫైర్ బ్రాండ్ రేణుకా చౌదరి కూడా షర్మిల పాలేరు టిక్కెట్ ఆశించడాన్ని తప్పుపడుతున్నారు. పాలేరు నుంచి పోటీ చేయడానికి ఇంకెవరైనా మిగిలి ఉన్నారా అంటూ సెటైర్లు వేస్తున్నారు రేణుకా చౌదరి. స్థానికులే పోటీ చేయాలంటూ తుమ్మలకే మద్దతు
పలికారు రేణుకా చౌదరి.

Also Read: కాంగ్రెస్ కీలక నేతతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే రాజయ్య భేటీ.. రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్

ఇలా మొత్తం మీద ముఖ్య నేతలు అంతా పాలేరుపై షర్మిలకు వ్యతిరేకంగా.. తుమ్మలకు అనుకూలంగా వ్యవహరించడం ఆసక్తి రేకెత్తిస్తోంది. ఈ పరిస్థితుల్లో షర్మిల భవిష్యత్ రాజకీయ ప్రణాళికపై ఉత్కంఠ రేగుతోంది. కాంగ్రెస్ పార్టీలో చేరకముందే అసెంబ్లీ సీటు విషయంపై పోరాడాల్సిన పరిస్థితి రావడాన్ని షర్మిల ఎలా తీసుకుంటారనేది చర్చనీయాంశంగా మారింది. పాలేరులో కుదరకపోతే ఆమె సింకిద్రాబాద్‌కు మారే అవకాశం కూడా ఉందంటున్నారు. అదే జరిగితే ఇప్పటికే సికింద్రాబాద్ నుండి బీజేపీ తరఫున బరిలో దిగేందుకు జయసుధ సిద్ధమౌతున్నారు. వీరిద్దరి పోటీతో లష్కర్ పోటీ కూడా రసవత్తరంగా మారే అవకాశాలు కన్పిస్తోంది. మొత్తానికి ఈ సస్పెన్స్ కు కాంగ్రెస్ పార్టీ ముగింపు ఎప్పుడు ఇవ్వనుందనేది ఆసక్తికరంగా మారింది.