MLC Kavitha Vs YS Sharmila : టీఆర్ఎస్ MLC కవిత ట్వీట్‌కు.. YS షర్మిల కౌంటర్ ట్వీట్

టీఆర్ఎస్ పార్టీ,వైఎస్సార్ టీపీల మధ్య ట్వీట్ల వార్ నడుస్తోంది. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, వైఎస్సార్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల మధ్య ట్వీట్ల వార్ నడుస్తోంది. దీంట్లో భాగంగా కవిత ‘తాము వదిలిన బాణం..తాన అంటే తందానా అంటున్న తామరపూలు’అంటూ సెటైర్ వేశారు. దీనికి షర్మిల కూడా ట్వీట్ ద్వారా స్ట్రాంగ్ కౌంట్ ఇచ్చారు.

MLC Kavitha Vs YS Sharmila : టీఆర్ఎస్ MLC కవిత ట్వీట్‌కు.. YS షర్మిల కౌంటర్ ట్వీట్

Tweets war between MLC Kavitha YS Sharmila

MLC Kavitha Vs YS Sharmila : టీఆర్ఎస్ పార్టీ,వైఎస్సార్ టీపీల మధ్య ట్వీట్ల వార్ నడుస్తోంది. మంగళవారం (నవంబర్ 29,2022) వైస్ షర్మిల అరెస్ట్ తరువాత ఆమె విడుదల కావటం..ఆమె పాదయాత్రకు అనుమతి లభించటం వంటి పలు కీలక పరిణామాల మధ్య టీఆర్ఎస్ ఎమ్మెల్సీ,వైఎస్సార్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల మధ్య ట్వీట్ల వార్ నడుస్తోంది. దీంట్లో భాగంగా కవిత ‘తాము వదిలిన బాణం..తాన అంటే తందానా అంటున్న తామరపూలు’అంటూ సెటైర్ వేశారు.

అంటే వైఎస్సార్ తెలంగాణ పార్టీ, బీజేపీ పార్టీ ఒకటే అనే అర్థంతో కవిత ఈ ట్వీట్ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ ట్వీట్ నెట్టింగ హాట్ టాపిక్ గా మారిన వేళ కవిత ట్వీట్ కు షర్మిల కౌంటర్ ఇస్తూ.. ‘పాదయాత్రలు చేసింది లేదు..ప్రజల సమస్యలు చూసింది లేదు..ఇచ్చిన హామీల అమలు లేదు..పదవులే కానీ పనితనం లేని గులాబీ తోటలో ‘కవిత’లకు కొదవ లేదు’అంటూ స్ట్రాంగ్ గా బదులిచ్చారు.

కాగా ఇటీవల కాలంలో తన పాదయాత్రలో షర్మిల టీఆర్ఎస్ పార్టీ నేతలపై ఘాటు విమర్శలు చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో సీఎం కేసీఆర్ భారీ అవినీతికి పాల్పడ్డారని విమర్శించారు. అంతేకాదు..ఏకంగా ఢిల్లీ వెళ్లి కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని..దీనిపై విచారణ జరిపించాలని కూడా డిమాండ్ చేస్తూ ఫిర్యాదు కూడా చేశారు. ఇలా ప్రతీ సందర్భంలోనే షర్మిల టీఆర్ఎస్ పై విరుచుకుపడుతునే ఉన్నారు. తన గురించి ఇష్టానురీతిగా మాట్లాడితే టీఆర్ఎస్ మంత్రిని చెప్పు తీసుకుని కొడతాను అంటూ బహిరంగానే వార్నింగ్ ఇచ్చారు షర్మిల. ఇలా ప్రతీ విషయంలోనే టీఆర్ఎస్ పై మండిపడుతున్నారు.

YS Sharmila Arrest: వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు వై.ఎస్. షర్మిల అరెస్ట్.. ఎస్ఆర్‌ నగర్ పీఎస్ వద్ద హైటెన్షన్..

ఈక్రమంలో వరంగల్ జిల్లాలో పాదయాత్ర కొనసాసగుతున్న సమయంలో సోమవారం (నవంబర్ 28,2022)ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీఆర్ఎస్, వైఎస్ఆర్ టీపీ కార్యకర్తల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ఎమ్మెల్యే సుందర్శన్ రెడ్డిపై షర్మిల అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ పలువురు టీఆర్ఎస్ కార్యకర్తలు షర్మిల కారవాన్‌కు నిప్పంటించారు. వైఎస్సార్ విగ్రహం, ప్లెక్సీలను ధ్వంసం చేశారు. తీవ్ర ఉద్రిక్తతల నడుమ పోలీసులు షర్మిల పాదయాత్రను అడ్డుకొని ఆమెను అరెస్టు చేసి హైదరాబాద్ లోని ఆమె కార్యాలయంకు తరలించారు.

కాగా, టీఆర్ఎస్ కార్యకర్తలు దాడిని తీవ్రంగా ఖండిస్తూ, పాదయాత్రను అడ్డుకోవటం పట్ల ఆగ్రహం వ్యక్తంచేస్తూ షర్మిల, ఆ పార్టీ కార్యకర్తలు ప్రగతి భవన్ ముట్టడికి వెళ్లారు. టీఆర్ఎస్ నేతల దాడిలో సోమవారం స్వల్పంగా ధ్వంసమైన కారులోనే స్వయంగా కారు నడుపుకుంటూ షర్మిల వెళ్లారు. ఈ క్రమంలో సోమాజికగూడ వద్ద పోలీసులు వారిని అడ్డుకోవటంతో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. పోలీసులు బలవంతంగా షర్మిలను అదుపులోకి తీసుకొనే ప్రయత్నం చేయగా కార్యకర్తలు ప్రతిఘటించారు. దీంతో పోలీసులు షర్మిల కారును క్రేన్ ద్వారా లిఫ్ట్ చేసి ఎస్ ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. అనంతరం కారు డోర్ తెరిచి ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇలా పలు కీలక పరిణామాల మధ్య టీఆర్ఎస్ కు షర్మిల పార్టీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న క్రమంలో ఇరు పార్టీల మహిళా నేతలు ట్వీట్ల యుద్ధం చేసుకోవటం హాట్ టాపిక్ గా మారింది.

YS Sharmila: షర్మిల పాదయాత్రకు తెలంగాణ హైకోర్టు అనుమతి.. వైఎస్.విజయమ్మను అడ్డుకున్న పోలీసులు