Export of Mango Slices : మామిడికాయ ముక్కల ఎగుమతితో అధిక లాభాలు ఆర్జిస్తున్న ఎన్టీఆర్ జిల్లా వాసి

ఎన్టీఆర్ జిల్లాలోని  రెడ్డిగూడెం , విస్సన పేట, నూజివీడు మండలాల కొందు రైతులు మామిడికాయలను కొనుగోలు చేసి వాటిని పచ్చడి ముక్కలుగా కట్ చేసి ఉప్పులో ఊరబెడుతున్నారు. వాటిని దేశంలో పచ్చళ్లు తయారుచేసే కంపెనీలకు ఎగుమతి చేస్తూ.. అధిక లాభాలను ఆర్జిస్తున్నారు.

Export of Mango Slices : మామిడికాయ ముక్కల ఎగుమతితో అధిక లాభాలు ఆర్జిస్తున్న ఎన్టీఆర్ జిల్లా వాసి

Export of Mango Slices

Updated On : July 16, 2023 / 9:45 AM IST

Export of Mango Slices : మామిడికాయ బద్దకు కాస్త ఉప్పూ కారం, ఆవాల పొడి అద్ది.. ఆపై నూనెలో ఈత కొట్టించి.. నలభీమ పాకాన్ని మరిపించే రుచిని సాధించిన గొప్పతనం తెలుగువారిది. అలాంటి ఆవకాయ తయారీలోనే ప్రఖ్యాతి పొందింది ఎన్టీఆర్ జిల్లా. గతంలో ఇక్కడి రైతులు పండిన పంటను దళారులకు అమ్ముకునేవారు. అయితే మార్కెట్లో సరైన ధర పలకకపోవడంతో కొన్నేళ్లుగా మామిడి ఊరగాయ ముక్కలను తయారుచేస్తూ.. దేశవ్యాప్తంగా ఎగుమతి చేస్తూ… అధిక లాభాలను ఆర్జిస్తున్నారు.

READ ALSO : Sugarcane Cultivation : ఉత్తర కోస్తాకు అనువైన నూతన చెరకు రకాలు

పేదవాడి ఇంటిలోను రాజుల ఇంటిలో సైతం ఉండి జిహ్వకు  మధురమైన రుచిని అందించి ఆకలిని తీర్చేదీ… ఎక్కడ ఎప్పుడు పుట్టిందో తెలియదు కానీ తరతరాలుగా అందరి ఇళ్ళల్లోను ఇది ఉంటుంది. కూరవండలేదని భర్త మండిపడితే ఆకోపాన్ని తగ్గించి విందు భోజనంవలె లొట్టలేసుకుంటూ తినేలా చేస్తుంది. బడినుంచి వచ్చిన పిల్లలకు అన్నంలో యింత నెయ్యి వేసి, ఇది వేస్తే కంచం ఖాళీ చేసి పోతారు పిల్లలు. ఇప్పుడంటే దమ్ బిర్యాని, వెజిటబుల్ బిర్యాని , పలావ్ అంటూ పలురకాలైన వంటలు వచ్చి విందు లో చోటు చేసుకున్నాయి.

READ ALSO : Mango Cultivation : మామిడితోటల్లో చేపట్టాల్సిన తొలకరి యాజమాన్యం

కానీ నాటికాలంలో ఇంటికివచ్చిన అతిధికి ముద్దపప్పు, నెయ్యితో పాటుగా ఈ పదార్ధం  వేయకుండా విందు భోజనం సంపూర్తి అయ్యేది కాదు. నాటి కాలంలో పెళ్లిళ్లకు, విందులకు ఇది ఖచ్చితంగా ఉండితీరాల్సిందే. అందేంటిది అనుకుంటున్నారా.. అదే నండి మామిడికాయ పచ్చడి. ఇప్పుడు ఆ పచ్చడిని దేశంలోని అన్ని రాష్ట్రాల వారు ఇష్టంగా తింటున్నారు. దీంతో మామిడికాయకు మంచి డిమాండ్ ఏర్పడింది.

READ ALSO : Mango Farming : 40 ఎకరాల్లో మామిడి సాగు.. ఏడాదికి రూ. 50 లక్షల నికర ఆదాయం

అయితే.. వ్యాపారులు మాత్రం రైతులకు తక్కువ ధరే చెల్లిస్తూ.. కొనుగోలు చేసి.. వారు లాభాలు పొందుతున్నారు. పెరుగుతున్న పెట్టుబడులు తగ్గుతున్న దిగుబడులతో.. మామిడి పండించే రైతులు నష్టాల పాలవుతున్నారు. అయితే ఎన్టీఆర్ జిల్లాలోని  రెడ్డిగూడెం , విస్సన పేట, నూజివీడు మండలాల కొందు రైతులు మామిడికాయలను కొనుగోలు చేసి వాటిని పచ్చడి ముక్కలుగా కట్ చేసి ఉప్పులో ఊరబెడుతున్నారు. వాటిని దేశంలో పచ్చళ్లు తయారుచేసే కంపెనీలకు ఎగుమతి చేస్తూ.. అధిక లాభాలను ఆర్జిస్తున్నారు. ఈ విధానంతో ఇటు మామిడి రైతులకు సైతం అధిక ధర అందుతుండటంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.