Toor dal Cultivation : కందిపంటను ఆశించే పేనుబంక, ఆకుగూడు పరుగులు.. నివారణ పద్దతులు

పిల్ల , తల్లి పురుగులు నల్లగా ఉండి గుంపులుగా చేరి లేత కొమ్మలు, ఆకులు, పువ్వులు , కాయలు నుండి రసం పీలుస్తాయి. ఇవి ఆశించిన ఆకులు ముడతలు పడతాయి. పువ్వులు, కాయలను ఆశించినట్లైతే గింజ సరిగ్గా తయారుకాదు.

Toor dal Cultivation : కందిపంటను ఆశించే పేనుబంక, ఆకుగూడు పరుగులు.. నివారణ పద్దతులు

Toor dal Cultivation

Updated On : August 28, 2023 / 11:46 AM IST

Toor dal Cultivation : ఖర్చుతక్కువ, లాభం ఎక్కువగా ఉండే ప్రత్యామ్నాయ పంటలలో కంది కూడా ఒకటి. ఈ పంటలో శాస్త్రీయ మెలుకువలు, సస్యరక్షణ పద్ధతులుు పాటిస్తే అధిక దిగుబడులు సాధించే అవకాశం ఉంటుంది. కంది పంట పూత దశ నుండి కోత దశవరకు వివిధ రకాల చీడపీడలు ఆశించి పంటకు నష్టం కలిగిస్తుంటాయి. సకాలంలో గమనించి తగిన సస్యరక్షణ చర్యలు చేపడితే పంటను పురుగుల బారి నుండి రక్షించుకోవచ్చు. కంది పంటలో ముఖ్యంగా పేనుబంక, ఆకు గూడు పురుగులు ఆశించి నష్టం కలిగిస్తుంటాయి. వాటి విషయంలో కొన్ని జాగ్రత్త చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. ఆవివరాలేంటో తెలుసుకుందాం..

READ ALSO : Turmeric Cultivation : సేంద్రీయ పసుపు సాగులో ఎరువులు, నీటి యాజమాన్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

పేను బంక ; పిల్ల , తల్లి పురుగులు నల్లగా ఉండి గుంపులుగా చేరి లేత కొమ్మలు, ఆకులు, పువ్వులు , కాయలు నుండి రసం పీలుస్తాయి. ఇవి ఆశించిన ఆకులు ముడతలు పడతాయి. పువ్వులు, కాయలను ఆశించినట్లైతే గింజ సరిగ్గా తయారుకాదు. ఈ పురుగులు తేనె వంటి పదార్దాన్ని విసర్జిస్తాయి. దీంతో ఆకులు కాయలపైన మసి తెగులు, బూజు ఆశ్రయించి నల్లగా మారతాయి. మేఘావృతమైన , తేమతో కూడిన చల్లటి వాతావరణం ఈ పురుగు ఆశించటానికి అనుకూలం. అదే అధిక వర్షపాతం ఉన్నట్లైయితే దీని ఉధృతి తగ్గుతుంది. దీని నివారణకు మోనో క్రోటోఫాస్ 30శాతం ఎస్ఎల్ 1.6 మి.లీ లేదా డైమిథోయేట్ 30 శాతం ఇ.సి 2.2మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

READ ALSO : Groundnut Crop : వేరుశనగలో పంటను ఆశించే పొగాకు లద్దె పురుగు.. నివారణ చర్యలు

ఆకు గూడు పురుగు ; ఈ పురుగు పంట ఎదుగుదల దశలో ఎక్కువగా ఆశిస్తుంది. ఒక్కోసారి పూత దశలో కూడా ఆశిస్తుంది. లార్వాలు చిగురాకులను , ఆకులను గూడుగా చేసి లోపల ఉండి ఆకులను తింటాయి. పువ్వులను లేత కాయలను కూడా తొలచి తింటాయి. అధిక వర్షపాతం ఉన్న సమయంలో ఈ ఆకుగూడు పురుగు పంటను ఆశిస్తుంది. దీని నివారణకు క్వినాల్ ఫాస్ 25 శాతం 2.0 ఇ.సి 2.0మి.లీ లేదా మోనోక్రోటోఫాస్ 36శాతం యస్.యల్ 1.6మి.లీ, లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి.