Backyard Poultry Farming : స్వయం ఉపాధి మార్గంగా పెరటి కోళ్ల పెంపకం

పెరట్లో కోళ్లు పెంపకం రైతులకు, నిరుద్యోగులకు మంచి ఉపాధినిచ్చే పరిశ్రమ.  గ్రామీణ ప్రాంతాల్లో  రైతులు తమ ఇళ్లల్లో సాధారణంగా 10-15 పెరటికోళ్లు పెంచుకుంటే  అటు గుడ్లు, మాంసం ద్వారా మంచి పౌష్టికాహారంతో లభించటంతోపాటు కోళ్ల అమ్మకాల ద్వారా కూడా లాభాలను గడించవచ్చు.

Backyard Poultry Farming : స్వయం ఉపాధి మార్గంగా  పెరటి కోళ్ల పెంపకం

Backyard Poultry Farming

Updated On : April 6, 2023 / 10:32 AM IST

Backyard Poultry Farming : గ్రామీణప్రాంతాల్లో నాటుకోళ్ల పెంపకం ఒకప్పుడు రైతుల జీవనశైలిలో భాగంగా వుండేది. కానీ మారిన పరిస్థితుల్లో, కోళ్ల పెంపకం పౌల్ట్రీ ఫారాలకే పరిమితమయ్యింది. నాటు కోళ్లనుంచి గుడ్లు, మాంసం దిగుబడి తక్కువగా వుండటంవల్ల, వీటి పెంపకం రాను రాను కనుమరుగవుతోంది. అయితే కేంద్రీయ కోళ్ల పరిశోధనా స్థానం వారు, వివిధ పరిశోధనలు జరిపి దేశవాళీ కోళ్లలో అత్త్యుత్తమ సంకరజాతులను విడుదలచేశారు. వీటి ద్వారా సంవత్సరం పొడవునా ఆదాయం లభించే అవకాశం కల్పిస్తున్నారు. పూర్తిగా నాటుకోళ్లను పోలివుండే ఈ జాతుల నుంచి అధిక మాంసోత్పత్తితో పాటు, నాటుకోళ్లకంటే రెండు నుంచి 3రెట్ల అధిక గుడ్ల దిగుబడిని, మాంసోత్పత్తిని సాధించవచ్చని నిపుణులు చెబుతున్నారు.

READ ALSO : Natu Kodi Farming : నాటుకోడి పచ్చళ్లతో.. లాభాలు ఆర్జిస్తున్న పి.హెచ్.డి స్టూడెంట్

పెరట్లో కోళ్లు పెంపకం రైతులకు, నిరుద్యోగులకు మంచి ఉపాధినిచ్చే పరిశ్రమ.  గ్రామీణ ప్రాంతాల్లో  రైతులు తమ ఇళ్లల్లో సాధారణంగా 10-15 పెరటికోళ్లు పెంచుకుంటే  అటు గుడ్లు, మాంసం ద్వారా మంచి పౌష్టికాహారంతో లభించటంతోపాటు కోళ్ల అమ్మకాల ద్వారా కూడా లాభాలను గడించవచ్చు. నాటుకోళ్ల మాంసానికి, గుడ్లకు గిరాకీ అదికంగా వున్న నేపధ్యంలో నాటుకోళ్లకంటే రెండు రెట్లు అధిక లాభాన్నిచ్చే విధంగా హైదరాబాద్ లోని జాతీయ కోళ్లపరిశోధనా సంస్థ పలు రకాల పెరటికోళ్లను అభివృద్ది పరిచింది.

వీటిలో వనరాజా, గిరిరాజా, గ్రామ ప్రియ, శ్రీనిధి  లాంటి వివిధ రకాల కోడి జాతులను రైతులకు అందుబాటులోకి తెచ్చారు. వీటిని  పెంచితే.. నాటు కోళ్ళతో పోల్చితే తక్కువ సమయంలో , అధిక గుడ్లు, మాసం పెరుగుదల ఉంటుందని చెబుతున్నారు శ్రీకాకుళం జిల్లా, ఆముదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం, ప్రోగ్రాం కో ఆర్డినేటర్, డా. డి . చిన్నమనాయుడు. ఆసక్తి ఉన్న నిరుద్యోగులు, సన్న, చిన్నకారు రైతులు సంప్రదిస్తే పెరటి కోళ్ల పెంపకంలో శిక్షణ ఇచ్చి , స్వంతంగా స్వయం ఉపాధి పొందేందుకు అవకాశాలు కల్పిస్తామంటున్నారు.

READ ALSO : నాటు కోడి కి పెరుగుతున్న డిమాండ్

నాటుకోళ్ల పెంపకం అనాదిగా మన గ్రామీణ సంస్కృతిలో భాగం. అయితే వీటిలో గుడ్లు, మాంసం ఉత్పాదక శక్తి చాలా తక్కువ వుండటం వల్ల వీటి పెంపకం రైతుకు అంత గిట్టుబాటుగా లేదు. అయితే అభివృద్ధి పరిచిన సంకరజాతి కోళ్లను పెంచుకుంటే, తక్కవ సమయంలోనే అధిక గుడ్లు, మాంసం ఉత్పతిని చేసుకోని , జీవన స్తితిగతులను మెరుగు పర్చుకోవచ్చని ఆముదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం, ప్రోగ్రాం కో ఆర్డినేటర్, డా. డి . చిన్నమనాయుడు అంటున్నారు.