Boron Deficiency : కొబ్బరి సాగులో బోరాన్ లోపం, నివారణ మార్గాలు!

ఎదిగిన చెట్ల ఆకుల్లోని ఈనెలు విడిపడక అంటుకుపోయి ఉంటాయి. బోరాన్ లోప నివారణకు, 1.0, 1.5 మీటర్ల గొయ్యి తీసి ప్రతి అడుగుకు మట్టి నమూనా సేకరించి, భూసార పరీక్ష చేయించుకోవాలి.

Boron Deficiency : కొబ్బరి సాగులో బోరాన్ లోపం, నివారణ మార్గాలు!

Boron deficiency in coconut cultivation, remedies!

Boron Deficiency : కొబ్బరి సాగులో బోరాన్ లోపం పంట ఎదుగుదలకు తీవ్ర ఆటంగా మారుతుంది. ముఖ్యంగా సున్నపు పాలు అధికంగా ఉన్న భూముల్లో భోరన్ లోపం కనిపిస్తుంది. ఇసుక నేలల్లో బోరాన్ లభ్యత తక్కువగా ఉంటుంది. కాటట్టి మట్టి కణాలు విడిపోవటం వల్ల సూక్ష్మ పోషకాల నిల్వలు తక్కువగా ఉంటాయి.

సాధారణంగా నేల ఉదజని సూచిక పెరిగే కొద్దీ బోరాన్ లభ్యత తగ్గుతుంది. నేలలో అధిక తేమ ఉంటే బోరాన్ లోప లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. అధిక మోతాదులో నత్రజని ఎరువుల వాడకం వల్ల కూడా ఈ లోపం రావచ్చు.

కొబ్బరిలో కాపుకు వచ్చిన తొలదశలో మొక్కలు బోరాన్ లోపానికి గురవుతాయి. లేత ఆకులు చిన్నవిగా, మెలి తిరిగి చివర్లు రెండు చీలి ఉంటాయి. మొవ్వ కుచించుకోని పోయి గట్టిగా తయారవుతుంది. ఆకులు ఈ నెలు లేకుండా కురచబారి నల్లని కట్టెముక్కలుగా మొవ్వ చుట్టూ కనిపిస్తాయి.

ఎదిగిన చెట్ల ఆకుల్లోని ఈనెలు విడిపడక అంటుకుపోయి ఉంటాయి. బోరాన్ లోప నివారణకు, 1.0, 1.5 మీటర్ల గొయ్యి తీసి ప్రతి అడుగుకు మట్టి నమూనా సేకరించి, భూసార పరీక్ష చేయించుకోవాలి.

భూమిలో బోరాన్ లభ్యత 0.3 పిపిఎం కన్నా తక్కువ ఉంటే నివారణకు ఏడాది లోపు మొక్కలకు 1.0 నుండి 1.5 గ్రా బోరాక్స్ వాడాలి. 1 నుండి 3 ఏళ్ళ మొక్కలకు 10 నుండి 15 గ్రా , 5 ఏళ్ళు పైబడిన మొక్కలకు 50 నుండి 75 గ్రాములు వాడాలి.