Castor Oil Farming : వర్షధారంగా ఆముదం సాగు – అధిక దిగుబడులకోసం మేలైన యాజమాన్యం 

Rainfed Castor Cultivation : తెలంగాణలో మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డి, కరీంనగర్ జిల్లాల్లో సాగవుతుండగా, ఆంధ్రప్రదేశ్ లో కర్నూలు, అనంతపురం, ప్రకాశం జిల్లాల్లో దీని విస్తీర్ణం వుంది.

Castor Oil Farming : వర్షధారంగా ఆముదం సాగు – అధిక దిగుబడులకోసం మేలైన యాజమాన్యం 

Rainfed Castor Cultivation - Superior Management for High Yields

Updated On : May 21, 2024 / 3:00 PM IST

Castor Oil Farming : దేశంలో పండించే నూనెగింజల పంటల్లో ఆముదంసాగు విశిష్ఠ ప్రాధాన్యత వుంది. ఒకప్పుడు ఈ పంటను, సాగులో చిట్టచివరి అవకాశంగా భావించేవారు. కానీ నేడు పరిస్థితులు  మారాయి. అధికదిగుబడినిచ్చే వంగడాల రావడం..  నీటి ఎద్దడిని తట్టుకుని మెట్టప్రాంత రైతులకు మంచి ఆదాయ వనరుగా మారడంతో చాలా ప్రాంతాల్లో రైతులు ఈ పంటసాగుకు మొగ్గుచూపుతున్నారు. మేలైన యాజమాన్యం చేపట్టినట్లైయితే, ఆముదం పంట, ఇతర వర్షాధార పంటలకు ఏమాత్రం తీసిపోదంటున్నారు పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డా. కె. సదయ్య.

Read Also : Soil Test For Agriculture : నేలకు ఆరోగ్యం.. పంటకు బలం – భూసార పరీక్షలతోనే అధిక దిగుబడులు 

ఆముదం విస్తీర్ణం, ఉత్పత్తిలో ప్రపంచంలోనే మన దేశం ప్రథమ స్థానంలో ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 3 లక్షల హెక్టార్లలో సాగవుతుంది.  తెలంగాణలో మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డి, కరీంనగర్ జిల్లాల్లో సాగవుతుండగా, ఆంధ్రప్రదేశ్ లో కర్నూలు, అనంతపురం, ప్రకాశం జిల్లాల్లో దీని విస్తీర్ణం వుంది.

ఆముదం నూనెను వైమానిక రంగంలో, జెట్‌, రాకెట్‌పరిశ్రమల్లో లూబ్రికెంట్‌గానూ, పాలిష్‌లు, ఆయింట్‌మెంట్లు , మందుల తయారీల్లోనూ, డీజిల్‌పంపుసెట్లలో డీజిల్‌కు ప్రత్యమ్నాయ ఇంధనంగా ఉపయోగిస్తున్నారు. సబ్బులు, డిటర్జంట్లు వంటి వాటిల్లో కూడా వాడుతుండడంతో దేశంలో ఆముదం పంటకు ప్రాధాన్యత పెరిగింది. ఈ పంట ఉప ఉత్పత్తుల వల్ల భారత దేశానికి ఏటా 5వేల కోట్ల విదేశీ మారక ద్రవ్యం లభించటం విశేషం. అయితే ఈ ఖరీఫ్ లో రుతుపవనాలు ఆలస్యంగా రావడం వల్ల చాలా ప్రాంతాల్లో మెట్టపంటలను సకాలంలో విత్తలేకపోయారు.

ప్రస్తుత వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఆముదాన్ని సాగుచేసుకోవడం ఎంతో మేలు. ఈ పంటను జులై చివరి వరకూ విత్తుకోవడానికి సమయం ఉంది. మురుగు నీరు నిల్వ ఉన్న భూములు, చౌడు భూములు తప్పా, అన్ని నేలలు ఈ పంటకు సాగుకు అనుకూలం. అయితే వర్షధారంగా సాగుచేసే ఆముదంలో కొన్ని మెళకువలు పాటిస్తే మంచి దిగుబడులను తీయవచ్చనం చెబుతున్నారు  పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త, డా. కె . సదయ్య. ఆముదం పంటను వివిధ రకాల చీడపీడలు ఆశించి తీవ్రం నష్టం చేస్తాయి.

సకాలంలో వీటిని గుర్తించి సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టినట్లైతే మంచి దిగుబడులను ఆశించే అవకాశం ఉంది. ఆముదం సాగుకు తక్కువ పెట్టుబడి, తక్కువ శ్రమ అవసరం ఉంటుంది. ఇటు మార్కెట్ లో కూడా మంచి ధర లభిస్తోంది. సరైన యాజమాన్య చర్యలు చేపట్టినట్లైతే ఎకరానికి 5 నుండి 6 క్వింటాల దిగుబడిని పొందవచ్చు. నీటిపారుదల సౌకర్యం ఉంటే 10 నుండి 12 క్వింటాల వరకు దిగుబడి పొందే వీలుంది.

Read Also : Agri Tips : వ్యవసాయంలో యాంత్రీకరణతో కూలీల కొరతకు చెక్ – సమయం ఆదాతో పాటు తగ్గనున్న పెట్టుబడులు